twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ముందు పార్టీలో కార్తీక్, శివ.. దీప చేతికి అలాంటి ఆయుధం!

    |

    తన కొడుకును తీసుకురావడానికి మోనిత హైదరాబాద్‌కు వెళ్లడంతో ఇంట్లో కార్తీక్, శివ మాత్రమే ఉన్నారు. అయితే ఎప్పటి మాదిరిగానే తనను రకరకాల పేర్లతో పిలవడంతో శివ ఇబ్బందిపడ్డాడు. అయితే మేడం ఇంట్లో లేదు కదా.. నేను మందు తాగుతాను అని కార్తీక్ చెప్పాడు. దాంతో ఎంత తాగుతావు అంటూ శివను కార్తీక్ అడిగాడు. అప్పుడు నేను హాఫ్ బాటిల్ తాగుతాను అని శివ చెబితే.. ఫుల్ బాటిల్ తీసుకురా.. నేను హాఫ్ వేస్తాను అని కార్తీక్ చెప్పాడు. దాంతో మీకు తాగే అలవాటు ఉందా అని శివ అడిగితే.. ఏమో గుర్తు లేదు. ఒకవేళ తాగే అలవాటు లేకపోతే ఆ ఆలోచన నాకు రాదు కదా అని కార్తీక్ అన్నాడు. వీరిద్దరి సంభాషణను దీప వింటూ.. గతంలో చిక్ మంగళూరులో మందు పార్టీ చేసుకొన్న విషయాన్ని దీప గుర్తు చేసుకొన్నది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1461లో ఇంకా ఏం జరిగిందంటే?

    కార్తీక్‌తో శివ మందు పార్టీ

    కార్తీక్‌తో శివ మందు పార్టీ

    రాత్రి ఏర్పాటు చేసుకొన్నా పార్టీ కోసం శివ మందు తీసుకు రావడానికి బయటకు వెళితే.. దీప ఎదురుపడింది. తమ్ముడా అంటూ ప్రేమగా పిలువడంతో.. నన్ను ఎవరు అంత ప్రేమగా పిలువరు. అరేయ్.. ఒరేయ్ అంటారు. తమ్ముడు అని ఎవరు పిలుస్తున్నారని చూస్తే.. ఎదురుగా వంటలక్క కనిపించింది. నన్ను తమ్ముడు అని పిలువకు.. మోనితకు తెలిస్తే..చంపేస్తుంది అని శివ భయపడ్డాడు. అయితే సరే.. మందు పార్టీకి బాటిల్ తీసుకొన్నావా అంటే శివ కంగారు పడ్డాడు. దాంతో నేను అంతా విన్నాను. మందు సరే.. మరీ మంచింగ్ ఏది అని అడిగి.. తాను చికెన్ పకోడి తెస్తానని చెప్పింది.

    మోనితపై సౌందర్య అనుమానం

    మోనితపై సౌందర్య అనుమానం

    ఇక ఆనంద్‌ను మోనిత తీసుకెళ్లడంపై సౌందర్యకు అనేక అనుమానాలు వచ్చాయి. బాబును తీసుకొని సీక్రెట్‌గా మోనిత ఎందుకెళ్లింది. మోనిత చిక్ మంగళూరులో ఉంటున్నా తాను ఉంటున్న ప్రదేశాన్ని లక్ష్మణ్‌కు చెప్పడానికి నిరాకరించింది. కార్తీక్ చనిపోయాడనే విషయం తెలిసిన తర్వాత తెల్ల చీర కట్టుకొన్న మోనిత ఇప్పుడు ఎందుకు రంగు చీరలు కట్టుకొంటున్నది. మోనిత బాబును తీసుకెళ్లడం వెనుక ఏదో అనుమానం ఉంది. ఆ అనుమానాలకు సమాధానం లభించాలంటే.. నేను చిక్ మంగళూరుకు వెళ్లాల్సిందే అని సౌందర్య డిసైడ్ అయింది.

    శౌర్యకు చెప్పకూడదని వారణాసి

    శౌర్యకు చెప్పకూడదని వారణాసి

    ఇక తనతో ఉన్న డ్రైవర్ వారణాసిపై శౌర్యకు అనుమానాలు వచ్చాయి. నిన్ను మా తాత, నాన్నమ్మలే పంపించారు కదా. నీవు వారికి ఇక్కడ నా గురించి సమాచారం ఇస్తున్నావు కదా అని శౌర్య నిలదీసింది. అయితే అలాంటిదేమీ లేదు. నేను నీ జాడ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని వారణాసి చెప్పాడు. అయితే లేదు. మా తాత పంపిస్తేనే వచ్చావు అని నిలదీస్తే..ఆనందరావు పంపించారనే విషయం శౌర్యకు చెప్పకూడదని మనసులో వారణాసి అనుకొన్నాడు. అయితే అమ్మ, నాన్న ఆచూకీ తెలిసే వరకు నేను ఇంటికి రాను అని శౌర్య చెప్పింది.

    నా భార్తతో మందు తాగా అంటూ దీప

    నా భార్తతో మందు తాగా అంటూ దీప


    ఇక కంగారుపడుతూనే కంపెనీ ఇవ్వు అంటూ దీపకు శివ చెప్పి ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లాడు. మందులోకి చికెన్ కంటే.. యాపిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి.. టేబుల్‌పై యాపిల్స్ ఉంటాయని తీసుకురా అన్నారు. గతంలో యాపిల్ తింటే.. డాక్టర్ అవసరం లేదని చెప్పిన విషయాన్ని తలచుకొని మందు తాగుతున్న కార్తీక్‌ను చూసి ఎమోషనల్ అయింది. దాంతో వంటలక్కను చూసి.. తనకు ఏదైనా చెప్పు అని అంటే.. నేను, నా భర్తతో కలిసి మందు తాగిన విషయాన్ని చెప్పింది. చిక్‌మంగళూరు పార్టీని గుర్తు చేసుకొని ఆనందపడింది.

    దీప చేతికి మెడికల్ రిపోర్టులు

    దీప చేతికి మెడికల్ రిపోర్టులు

    మందు తాగిన మత్తులో శివ, కార్తీక్ పడుకోవడంతో ఇంటిలో సోదాలు జరిపింది వంటలక్క. అయితే అల్మారాలో కార్తీక్ మెడికల్ రిపోర్టుల ఫైల్ కనిపించడంతో దానిని జాగ్రత్తగా చేతిలో పట్టుకొన్నది. ఆ ఫైల్‌ను చూసి ఏదో ఆనందంతో ముందుకెళ్లింది. కార్తీక్‌కు సంబంధించిన ఫైల్‌తో కథలో ఏదైనా ట్విస్టు ఉండే అవకాశం ఉంటుందనే ఫీలింగ్‌ను యూనిట్ కల్పించింది.

    కార్తీకదీపం లేటేస్ట్ ప్రోమో

    కార్తీకదీపం లేటేస్ట్ ప్రోమో

    ఇక తాజా ప్రోమోలో కార్తీక్ కాఫీ ఇస్తున్న దీప చేతిని విసిరికొట్టింది. తన కొడుకు ఆనంద్‌ను చంకలో పెట్టుకొని కనిపించింది. పిల్లాడు ఏడుస్తుండటంతో దీప.. గతంలో కార్తీక్‌కు ఆనంద్ ఎంత ఇష్టమో గుర్తుకు చేసుకొన్నది. కార్తీక్ ఎత్తుకొంటే ఆనంద్ ఏడుపు ఆపేసే సంఘటనలు గుర్తు చేసుకొన్నది. దాంతో డాక్టర్ బాబు.. మీరు బాబును ఎత్తుకొండి.. ఏడుపు ఆపేస్తాడు అని చెప్పింది. దాంతో బాబు వెంటనే ఏడుపు ఆపేయడం కనిపించింది. దాంతో బాబును చూడగానే ఏమైనా గుర్తుకు వస్తున్నాయా అని దీప అడగడంతో మోనిత కంగారుపడింది.

    English summary
    Karthika Deepam 19th September Episode number 1461.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X