For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam నా భర్త మీద మోజు పడ్డావు. రేపు మరొకరిపై.. మోనితకు దీప వార్నింగ్

  |

  నా కొడుకు పేరు ఏమిటని కార్తీక్ అడిగితే.. నీ కొడుకు పేరు ఆనంద్ అని మోనిత చెప్పింది. అయితే ఆనంద్ పేరు వినగానే.. ఎక్కడో విన్నట్టు ఉన్నదని కార్తీక్ అన్నారు. నీ కొడుకు పేరే కదా కార్తీక్.. ఆనంద్.. ఆనంద్ అని నీవు వింటూనే ఉంటావు కదా అని మోనిత అంటే.. నీ పేరు ఆనందా? ఆనందా అని కార్తీక్ ముద్దు చేశాడు. నేను భార్యను అంటే సరే అన్నాడు. నీ కొడుకు అంటే ఒప్పుకొన్నాడు. దాంతో మళ్లీ మీకు అనుమానం వచ్చిందా అని మోనిత అనుకొన్నది. ఇలాంటి అనుమానాలు, దీప బారిన పడకుండా ఉండాలంటే.. మరో చోటికి వెళ్లాలని మనసులో అనుకొన్నది. అయితే తన ఇంటిలోకి దీప అడుగుపెడుతుంటే.. మోనిత ఆగవే అని అరిచింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లో ఏం జరిగిందంటే?

  తన ఇంటిలోకి వెళ్తున్న దీపను ఆపి.. నీ అత్తారింటిలోకి వెళ్తున్నట్టు వెళ్తున్నావు. నీకు ఎన్నిసార్లు ఇంటిలోకి అడుగుపెట్టొద్దని చెప్పాను. మళ్లీ మళ్లీ చెప్పించుకోవడానికి సిగ్గు లేదా? నా కాపురానికి శనిలా దాపురించావు అని మోనిత అంటే.. నోర్మూయ్.. తాళి కట్టిన వాడితో సంసారం చేస్తే కాపురం అంటారు. వేరే వారి భర్తతో కాపురం చేస్తే ఏమంటారో ఊళ్లో వాళ్లను అడిగి తెలుసుకో అని అంటే.. తాళి కట్టించుకొంటేనే భర్త అంటారా అని మోనిత ప్రశ్నిస్తే.. ఇంకోసారి అలా మాట్లాడితే గొంతు నులిమి చంపేస్తాను అని దీప వార్నింగ్ ఇచ్చింది.

   Big Twist in Karthika Deepam todays 1463 episode: Mounita big fight with Deepa for Karthik

  నా భర్తను నాకు కాకుండా మందులు ఇచ్చి కార్తీక్‌కు గతం గుర్తుకు రాకుండా చేస్తున్నావు. నీవు డాక్టర్ కదా.. మందులు ఇస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందనే విషయం తెలియదా? అని దీప అంటే.. తెలుసు. కార్తీక్ జీవితంలో నుంచి నిన్ను బయటకు పంపించడానికి నేను చేస్తున్నా అని మోనిత చెప్పింది. అయితే ఆయన ఏమైపోయినా నీకు పట్టింపు లేదా? తాళి కట్టిన భర్త అయితే.. ఏమైనా అవుతుందని బాధపడుతారు. నా భర్త మీద మోజు పడ్డావు. ఆయనకు ఏమైనా అయితే మరొకడిపై మోజుపడుతావు అని దీప ఫైర్ అయింది. అయితే నోర్మూయ్.. ఈ జన్మకు నా జీవితంలో ఎవరైనా మగాడు ఒకడు ఉన్నాడంటే.. అది కార్తీక్ మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకొన్నా నేను ప్రేమించా.. చనిపోయాడని అందరూ అనుకొన్నా..కార్తీక్‌ను వెతికిపట్టుకొన్నాను. కార్తీక్ అంటే నాకు ప్రాణం అని మోనిత అంది.

  మోనిత మాటలకు కౌంటర్ ఇస్తూ.. ఇదంతా కార్తీక్‌కు గుర్తుకు వచ్చే వరకే.. ఆ తర్వాత నీ పిచ్చికుదురుతుంది అని దీప అంటే.. గుర్తుకు రాదు. నీ ఎదురుగానే నా కొడుకును తెచ్చి కార్తీక్ చేతిలో పెట్టాను. నా కొడుకుకు తండ్రిని చేశాను.ఇక నా భర్త కావడం ఎంత సేపు. ఇలానే ఎదురింటిలో ఉంటూ మా కాపురానికి సాక్ష్యంగా ఉండు అని మోనిత కౌంటర్ ఇచ్చింది.

  మోనితకు కౌంటర్ ఇస్తూ.. నన్ను ఊరికి పంపించాలని ప్లాన్ చేసినప్పుడే ఇలాంటి జిత్తుల మారి ప్లాన్ వేస్తావని ముందే ఊహించానే జిత్తుల మారి నక్క. కార్తీక్ నీ కొడుకును ఎత్తుకొని మురిసిపోయినప్పుడు నేను టెన్షన్ పడ్డాను. కానీ బాబును ఎత్తుకొని ఆడించినప్పుడు నేను గుర్తుకు వస్తాను. పోయిన నేను తిరిగి వచ్చినప్పుడు.. పోయిన గతం గుర్తుకు వస్తుంది అని డాక్టర్ బాబు అంటూ పిలిచింది. అదిగో వచ్చాడు. డాక్టర్ బాబుకు నేనంటే అభిమానం. నా గొంతు వింటే వస్తాడు అని దీప అన్నారు.

  అయితే కార్తీక్ తీసుకొని వేరే ఊరికి వెళ్లడానికి ప్లాన్ చేసింది. అయితే ఎక్కడికి వెళ్తున్నాం అని కార్తీక్ అంటే.. నీకు ప్రతీది అనుమానం వస్తున్నది. నా కంటే వంటలక్క మీద నమ్మకం ఉంది. ఈ అనుమానాలు తీరాలంటే.. అక్కడికి వెళ్లాలి. ఆ తర్వాత నమ్మడం. నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పింది.

  అయితే శివ వచ్చి దీపతో.. డాక్టర్ బాబును వేరే చోటికి తీసుకెళ్తుందని చెప్పాడు. దాంతో ఎక్కడికి తీసుకెళ్తుందనే ఆలోచనల్లో పడ్డాడు. ఇదిలా ఉండగా.. మనం వెళ్లే ప్రదేశం ఎంత దూరమని అంటే.. రెండు గంటల ప్రయాణం అని మోనిత చెప్పింది. అయితే ఇన్ని రోజులు ఎందుకు తీసుకెళ్లలేదని కార్తీక్ అనుమానం వ్యక్తంచేశాడు. దాంతో మళ్లీ అనుమానం వచ్చిందా అంటూ మోనిత సహనం కోల్పోయింది.

  English summary
  Karthika Deepam 21st September Episode number 1463.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X