twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దీప, సౌందర్య, మోనిత, కార్తీక్ ఒకేచోట.. హైడ్రామా మామూలుగా లేదుగా

    |

    కార్తీక్ తల్లిదండ్రులు మోనిత ఫోన్ నంబర్ సంపాదించి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో కార్తీక్ కిందపడిపోతుంటే.. కార్తీక్ అంటూ మోనిత అరిచింది. దాంతో సౌందర్య, ఆనందరావుకు అనుమానం వచ్చి కార్తీక్ ఏంటి అని నిలదీశారు. దాంతో వెంటనే ఫోన్ కట్ చేసి మోనిత టెన్షన్ పడింది. అయితే మోనిత ఏదో నాటకం ఆడుతుందని ఆమె ఇంటి అడ్రస్ పట్టుకొని అక్కడకు చేరుకొన్నారు. సౌందర్య, ఆనందరావు రావడంతో మోనిత కంగారుపడింది. అయితే కార్తీక్‌ను కనిపించకుండా శివను పక్కకు తీసుకెళ్లమని చెప్పింది. అదే సమయంలో వంటలక్క కూడా అక్కడికి వచ్చింది. కార్తీక దీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1465 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    Karthika Deepam

    మోనిత బొటిక్‌కు వచ్చిన సౌందర్య, ఆనందరావు ఇద్దరు ఇంటిని నిశితంగా పరిశీలించారు. అయితే మోనిత కంగారు పడటం చూసి అనుమానాలు వారిలో పెరిగాయి. అయితే డాక్టర్ చదువు చదివి బోటిక్ ఎందుకు పెట్టుకొన్నావని సౌందర్య నిలదీసింది. దాంతో నా చదువు కార్తీక్‌తోనే పోయిందని మోనిత చెప్పింది. అయితే కార్తీక్‌కు యాక్సిడెంట్ జరిగిన చోటే ఎందుకు ఉన్నావంటే.. మోనిత నీళ్లు నమిలింది. అయితే కార్తీక్ పేరు ఎందుకు పలికావు అంటే.. తీసుకెళ్లి తన కొడుకును చూపించింది. అయినా సౌందర్య అనుమానంగా చూసింది.

    ఇదిలా ఉండగా, దీప కూడా అక్కడి వచ్చింది. మోనిత ఎదురుగా సౌందర్య ఉన్నప్పటికీ.. ఆమెకు మధ్య ఒక తెర ఉండటంతో దీప తన అత్త, మామను చూడలేకపోయింది. అయితే కార్తీక్‌ను వెతుక్కొంటూ వెళ్తుండటంతో ఆనందరావు కంట దీప పడింది. దీప అంటూ అరిస్తే.. మీకు భ్రమ అని సౌందర్య చెప్పారు.

    ఇక మోనిత కంగారు పడటం చూసి.. నేను ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతాను. కానీ నిన్ను మాత్రం నమ్మను అంటూ కారెక్కడానికి బయలు దేరారు. అయితే సౌందర్య, ఆనందరావును చూసిన కార్తీక్.. వారిని గుర్తుపట్టలేకపోయాడు. వారిని ఎక్కడో చూసినట్టు ఉందని అనుకొన్నాడు. అంతలోనే శివ వచ్చి కార్తీక్‌ను పక్కకు తీసుకెళ్లాడు. అయితే సౌందర్య, ఆనందరావు వెళ్లిపోతుంటే.. హల్లో.. హల్లో అంటూ పిలిచారు. అప్పటికే వారి కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో మోనిత ఊపిరి పీల్చుకొన్నది.

    ఆ తర్వాత దీప వచ్చి ఇక్కడికి వచ్చింది ఎవరు అంటే.. నీ అత్త, మామ అని చెప్పి.. పరుగెత్తు.. కారు వెంట అని ఎగతాళి చేసింది. దాంతో నీ పాపం పండే రోజు వచ్చిందని దీప వార్నింగ్ ఇచ్చింది.

    English summary
    Karthika Deepam 23rd September Episode number 1465. కార్తీక్ తల్లిదండ్రులు మోనిత ఫోన్ నంబర్ సంపాదించి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో కార్తీక్ కిందపడిపోతుంటే.. కార్తీక్ అంటూ మోనిత అరిచింది. దాంతో సౌందర్య, ఆనందరావుకు అనుమానం వచ్చి కార్తీక్ ఏంటి అని నిలదీశారు. దాంతో వెంటనే ఫోన్ కట్ చేసి మోనిత టెన్షన్ పడింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X