For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఆమె నా భార్య కాదు అంటూ కార్తీక్.. మోనితను పీక పిసికి చంపబోయిన దీప.. భారీ ట్విస్టులు

    |

    చిక్ మంగళూరులో యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన కార్తీక్ కోసం దీప వెతకడం కొనసాగించింది. కార్తీక్ ఫోటో పట్టుకొని ప్రతీ ఒక్కరికి చూపిస్తూ ఇతడిని ఎక్కడైనా చూశారా అని దీప అడుగుతూ వెళ్లింది. కనిపించినట్టే కనిపించి మాయమయ్యాడు. ఇక్కడే కనిపించి మాయమైనందుకు ఆనందపడాలా? లేదా బాధపడాలా అని తెలియడం లేదు అని దీప ఆవేదన వ్యక్తం చేసింది. అలా అడుగుతూ వెళ్తుండగా.. కార్తీక్ ఫోటో పట్టుకొని మోనిత ఎదురు పడింది. ఇతడిని మీరు ఎక్కడైనా చూశారా అని అంటున్న మోనితను చూసి దీప.. దీపను చూసి మోనిత ఇద్దరు ఒకరికొకరు షాక్ గురయ్యారు. కార్తీకదీపం సీరియల్ తాజా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ 1439 లో ఇంకా ఏం జరిగిందంటే?

    మోనితను పీక పిసికి చంపబోయిన దీప

    మోనితను పీక పిసికి చంపబోయిన దీప


    కార్తీక్‌ను తనే ఎత్తుకెళ్లిందనే కోపంతో గొంతు పిసికి మోనితను దీప చంపబోయింది. తనకు ఎదురుపడిన దీపను చూసి నీవు ఇంకా బతికే ఉన్నావా? అయితే కార్తీక్ ఎక్కడనున్నాడు అంటూ మోనిత ప్రశ్నించింది. దాంతో ఆపవే నీ నాటకాలు. డాక్టర్ బాబును హాస్పిటల్ నుంచి తీసుకెళ్లింది నీవే కదా అని దీప అంటే.. నీవు చెప్పే మాటలు చూస్తే నా కార్తీక్ కూడా బతికి ఉన్నాడు? ఎంత శుభవార్త చెప్పావు దీప.. నా కార్తీక్ బతికి ఉండాలని తపస్సు చేశాడు. నా దేవుడు మొర ఆలకించాడు. కార్తీక్ బతికే ఉన్నాడు. గొప్ప శుభవార్త చెప్పాడు. నా కార్తీక్ ఎక్కడ.. చెప్పు దీప అంటూ మోనిత వెంటపడింది.

    కార్తీక్ బతికే ఉన్నాడనే నమ్మకంతో

    కార్తీక్ బతికే ఉన్నాడనే నమ్మకంతో

    అయితే మోనితను చూసి.. ఆపవే నీ నాటకాలు. నేను హాస్పిటల్‌కు వెళితే.. ఆయన భార్య తీసుకెళ్లారని చెప్పారు. నీవు తప్ప ఎవరు తీసుకెళ్తారని నేను అనుకొన్నాను. నీ మీదే అనుమానం వచ్చింది. నిన్ను చూస్తేనే డాక్టర్ బాబు అసహ్యించుకొంటారని తెలిసి సర్దిచెప్పుకొన్నాను. నీవు ఇక్కడ కనిపించావు కాబట్టి..నా అనుమానం కరెక్ట్ అయింది. డాక్టర్ బాబును ఎక్కడ పెట్టావో చెప్పు అంటూ దీప నిలదీసింది. అయితే డాక్టర్ బాబును తీసుకెళ్తే నేను ఈ ఫోటోను పట్టుకొని ఎందుకు వెళ్తాను చెప్పు దీప అని మోనిత చెప్పింది. అందరూ కార్తీక్ లేడని చెప్తున్నా.. నా కార్తీక్ బతికే ఉన్నారనే నమ్మకంతో ప్రతీ చోట వెతుకుతూనే ఉన్నాను. కార్తీక్ లేడని అనుకొంటుండగా నీవు కనిపించి శుభవార్త చెప్పావు. నీవు ఉండి.. నీ వద్ద కార్తీక్ లేకపోవడం ఏమిటి? ఎవరో తీసుకెళ్లావని అంటున్నావు. కార్తీక్‌ను తీసుకెళ్లింది ఎవరు అని మోనిత కంటతడి పెట్టుకొన్నది.

    నాటకాలు ఆపు మోనిత అంటూ

    నాటకాలు ఆపు మోనిత అంటూ

    అయితే మోనిత మాటలకు అడ్డుపడుతూ ఆమె గొంతు పట్టుకొని నీ నాటకాలు ఆపు. నీవు తప్ప ఎవరు తీసుకెళ్తారు. నీ గురించి నాకు బాగా తెలుసు అని దీప అంటే.. కార్తీక్ నా వద్దే ఉంటే.. నేను ఇలా ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతాను. కార్తీక్ నా వద్ద ఉంటే.. ఇలా బాధలో ఉంటానా? నాపై నీకు ఎందుకు అనుమానం. ఇంతకు కార్తీక్‌ను ఎవరు తీసుకెళ్లారో.. నా కార్తీక్ ఎక్కడ ఉన్నాడో.. అంటూ పక్కనే ఉన్న వాళ్లను ఇతడిని చూశారా అంటూ అడగడం మొదలుపెట్టింది. అది చూసి మోనిత అనేక ఆలోచనల్లో పడింది.

    ఆమె నా భార్య కానే కాదు..

    ఆమె నా భార్య కానే కాదు..

    ఇక కార్తీక్ కారులో నుంచి దిగి గట్టిగా కారును తన్ని అసహనం వ్యక్తం చేసింది. ఏంటి సార్.. కారును అలా తన్నుతున్నారు. మీరు కారును తన్నడం కాదు. మీకు ఏమైనా అవుతుందని నా బాధ అని డ్రైవర్ అంటే.. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నా భార్య కాదు అని కార్తీక్ అన్నాడు. ఏంటి సార్ ఆమెను భార్య కాదని అంటున్నారు. మా పేర్లు మరిచిపోయినట్టు.. మీ భార్యను భార్య కాదనడం ఏమిటి సార్ అని డ్రైవర్ అన్నాడు. పెళ్లాం అంటే సపోర్టింగ్‌గా ఉండాలి. కానీ నా భార్య అక్కడికి వెళ్లొద్దు. ఇక్కడికి వెళ్లొద్దని కండిషన్లు పెడుతుంది. నేనేదో పారిపోయేటట్టు బయటకు వెళ్లొద్దని చెబుతుంది. అసలు వాకింగ్‌కు కారు వేసుకొని వస్తాడా? అని కార్తీక్ విసుక్కొన్నాడు. అంతలోనే ఫోన్ రావడంతో డ్రైవర్ మాట్లాడి.. అమ్మగారు రమ్మంటున్నారు అంటే.. ఇప్పుడే కదా వచ్చాం.. ఇదేంటి టార్చర్.. ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది అని కార్తీక్ అన్నాడు.

    నీవు ఓవరాక్షన్ చేయకు.. అంటూ

    నీవు ఓవరాక్షన్ చేయకు.. అంటూ


    డ్రైవర్‌కు మళ్లీ ఫోన్ రావడం.. అయితే మేడమ్ మిమ్మల్ని టెన్షన్ పడొద్దని చెప్పారు అని చెప్పాడు. అయితే నన్ను కంట్రోల్ చేసి.. నా ఎమోషన్స్ కంట్రోల్ చేస్తున్నది. నన్ను ఏం చేద్దామని అనుకొంటున్నది. నాకు కాళ్లు, చేతులు పనిచేస్తున్నాయి. మీ మేడమ్ కంటే నీవే ఓవరాక్షన్ చేస్తున్నావు. తీసుకెళ్లి మీ మేడమ్ ముందు పడేయ్ అని కార్తీక్ విసుక్కొన్నాడు. అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోయాడు.

    కార్తీకదీపం సీరియల్‌లో మరో ట్విస్టు

    కార్తీకదీపం సీరియల్‌లో మరో ట్విస్టు


    కార్తీకదీపం సీరియల్‌లో మరో ట్విస్టు కనిపించింది. మోనితపై అనుమానం పెంచుకొన్న దీప.. ఆమెను వెంబడించింది. మోనిత కారు ఓ ఇంటిలోకి ప్రవేశించగానే.. ఆమె వెంటనే వచ్చిన దీప.. ఆటో దిగింది. మోనితను నమ్మలేను. కార్తీక్ మోనిత వద్దే ఉండి ఉంటాడు. ఒకవేళ అదే జరిగితే.. మోనితను చంపైనా కార్తీక్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అని దీప అనుకొంటూ.. ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లోకి ప్రవేశించిన దీపకు చూడకూడదనిదేదో చూసి.. షాక్‌కు గురైంది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచింది.

    English summary
    Karthika Deepam 24th August Episode number 1439.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X