Karthika Deepam మోనిత కొడుకు గుట్టు వీడింది.. కార్తీకదీపంలో మరో ట్విస్టు!

డాక్టర్ నిరుపమ్, ప్రేమ్ తల్లి స్వప్నకు, శౌర్య అలియాస్ ఆటోడ్రైవర్ జ్వాలాకు మధ్య వాగ్వాదం జరిగింది. మంచి చెప్పడానికి స్థాయి అవసరం లేదు. మంచి ఎవరు చెప్పినా మంచే అని శౌర్య జవాబిచ్చింది. దాంతో జ్వాలా చెప్పిన దాంట్లో తప్పేమిటి? అని స్వప్న భర్త సత్యం అంటే.. నువ్వు ఊరుకో అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. మీరు మాట్లాడే అవకాశాన్ని ఎప్పుడు కోల్పోయారు.

ఎవరో అనామకురాలు వండిపెడితే... తింటున్నావు అని స్వప్న అంటే.. హలో మేడమ్.. నీవు వండిపెడితే.. మేము వండి పెట్టాల్సిన అవసరం ఉండదు అని జ్వాలా బదులిచ్చింది. దాంతో నోర్మూయ్ అంటూ జ్వాలాపై స్వప్న చేయిలేపింది. దాంతో నిరుపమ్ మధ్యలోకి వచ్చి అడ్డుకొన్నాడు. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1329 లో ఏం జరిగిందంటే..

జ్వాలాపై స్వప్న ఆగ్రహం

జ్వాలాపై స్వప్న ఆగ్రహం

తల్లి స్వప్న చేయిపట్టుకొని ఏంటి? అమ్మా.. అని అంటే.. ఆమె ఏం అన్నదో విన్నావా? ఎవరైనా ఏదైనా, నోటికి ఇష్టం వచ్చినట్టు కూస్తే నేను ఊరుకోను అని స్వప్న అంటే.. నేను పెద్ద ఘోరం జరిగినట్టు మాట్లాడలేదు అని జ్వాలా బదులిచ్చింది. ఆ రోజు గుడిలో మాట్లాడినప్పుడే నీ గురించి తెలిసింది అంటూ స్వప్ప మాట్లాడగానే అందరూ షాక్ అయ్యారు.

ఆ రోజే నీ చెంప పగలకొట్టి ఉంటే.. ఇంత వరకు వచ్చి ఉండేది కాదు అని స్వప్న అంది. దాంతో ప్రేమ్ జోక్యం చేసకొంటూ.. ఏంటి గొడవ మమ్మీ అంటే.. నీకు గొడవ మాదిరిగా కనిపిస్తుందా అంటూ స్వప్ప కోపంతో ఊగిపోయింది.

నీ బతుకెంత అంటూ...

నీ బతుకెంత అంటూ...

ప్రేమ్, నిరుపమ్‌పై కోపగించుకొంటూ.. మీరందరూ ఇచ్చిన చనువు వల్లే అది అలా రెచ్చిపోతున్నది. నిన్ను ఆటోలో తిప్పింది.. దాన్ని ఆటోలో తిప్పుతున్నది. ఛీఛీ అంటూ స్వప్న అంటే.. ఏంటి ఛీఛీ.. ఆటోలో తిరిగితే తప్పేంటి? అని జ్వాలా ఘాటుగా స్పందించింది. దాంతో మధ్యలో ఆగు ఆగు.. అని డాక్టర్ నిరుపమ్ జోక్యం చేసుకోబోగా.. నా కుటుంబాన్ని నీ గుప్పిట్లో పెట్టుకోన్నావు కదవే.. అని స్వప్ప అంది.

దాంతో అక్కడ కొందరు.. ఇక్కడ కొందరు ఉంటే కుటుంబం అనరు అంటూ జ్వాలా బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. తనను టార్గెట్ చేసి ఆ మాట అనడంతో నన్నే అంటావా? నీవెంత.. నీ బతుకెంత అని స్వప్న వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఏం చేస్తావో తెలుసుకోవచ్చా? అని జ్వాలా ఇక్కడ.. జ్వాలాకు భయపడటం తెలియదు.. ఏం చేస్తావు అని జ్వాలా అంటే.. ఏం చేస్తానో చూడు అంటూ స్వప్న వెళ్లి.. జ్వాలా ఆటోను తగులపెట్టింది. దాంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 నాతో పెట్టుకొంటే.. నీ ఆటోకు పట్టిన గతే నీకు..

నాతో పెట్టుకొంటే.. నీ ఆటోకు పట్టిన గతే నీకు..

ఆటోను తగలబడిపోతుంటే.. ఇప్పుడు చెప్పు.. మండిపోయే జ్వాలను చూడు.. అది ఆరిపోయే వరకు ఇంటికి వెళ్లి ఏడువు. నాతో పెట్టుకొంటే ఇలానే ఉంటుంది అని జ్వాలాకు స్వప్న వార్నింగ్ ఇచ్చింది. అక్కడి నుంచి వెళ్తూ.. ఇదే నీకే కాదు.. నా జోలికి ఎవరు వచ్చినా ఇలానే ఉంటుంది. జాగ్రత్త అంటూ స్వప్న హెచ్చరించింది. అయితే జ్వాలా ఆటో తగలపడి పోతుండటంతో.. నన్ను తీసుకొచ్చి తప్పు చేసిందా అంటూ సత్యం.. నేను నాన్నను తీసుకురమ్మని తప్పు చేశానా? అంటూ డాక్టర్ నిరుపమ్ ఆవేదనకు గురయ్యారు.

ఒళ్లు మండింది.. ఆటో తగులపెట్టా అంటూ స్వప్న

ఒళ్లు మండింది.. ఆటో తగులపెట్టా అంటూ స్వప్న

అయితే గొడవ తర్వాత ఇంటికి చేరుకొన్న స్వప్న ఇంటికి వెళ్లిన సౌందర్య తీవ్రంగా కోపగించుకొన్నది. నువ్వు మనిషివేనా అంటూ గట్టిగా అరిచింది. ఇలా తయారయ్యావేంటి? అని సౌందర్య అంటే.. నీవు నా ఇంట్లోకి వచ్చి అంటూ స్వప్న ఏదో అనబోతుంటే.. ఆగు.. నీవు ఆటోను తగలపెట్టినట్టు నన్ను తగులబెడుతావా? అని సౌందర్య అనగానే... పక్కనే ఉన్న ఆనందరావు షాక్ తిన్నాడు.

ఆటో తగులబెట్టావా? అని ఆనందరావు అడిగితే.. అవును ఒళ్లు మండినందుకు.. తగలపెట్టాను అని స్వప్న అరిచింది. దాంతో ఆపు.. నిన్ను కన్నపాపానికి.. ఏదో ఒక అన్నాను.. అప్పటి నుంచి నీవు శాపనార్థాలు పెట్టావు. దాని ఫలితమే కొడుకు, కోడలను పోగట్టుకొన్నాను.. మనవరాలి దూరంగా వెళ్లిపోయింది. రోజు పొట్ట నింపుకొనే అమ్మాయి ఆటోను తగలబెడుతా అంటూ సౌందర్య చెడామడా తిట్టింది.

జ్వాలా కోసం ఏదైనా చేయాలి..

జ్వాలా కోసం ఏదైనా చేయాలి..

జ్వాలా ఆటోను తన తల్లి తగులపెట్టడంపై డాక్టర్ నిరుపమ్ బాధలో మునిగిపోయడు. నా వాళ్ల జ్వాలా నష్టపోయింది. నాకే ఇంద బాధ ఉంటే.. జ్వాలాకు ఎంత బాధ ఉందో. జ్వాలాకు ఏదైనా చేయాలి అంటూ డాక్టర్ నిరుపమ్ ఆవేదన చెందాడు. అయితే తన ఆటోను తగలపెట్టడంపై జ్వాలా కంటతడి పెట్టింది. నా పిన్ని, బాబాయ్ చేత దొంగతనం మాన్పించాను. ఇప్పుడు ఆటో తగలపడిపోవడంతో రేపట్నుంచి నేను ఏం చేయాలి.. ఎలా బతకాలి అంటూ జ్వాలా బాధపడిపోయింది. జ్వాలా ఆటో తగలపడిపోవడంపై హిమ కూడా కంటతడి పెట్టింది. రేపట్నుంచి మీ పరిస్థితి ఏమిటో అని హిమ అనుకొన్నది.

మోనిత, కార్తీక్ కొడుకు రవ్విడ్లీ

మోనిత, కార్తీక్ కొడుకు రవ్విడ్లీ

ఇదిలా ఉండే... రవ్విడ్లిగా పిలిచే హోటల్‌లో పనిచేసే అబ్బాయి.. మోనిత ఇంటికి వెళ్లి.. అమ్మా, నాన్న మీ పేర్లు తెలియవు. కానీ మీ ఇద్దరు డాక్టర్లు అని విన్నాను. అయితే నా పేరు కూడా తెలియదు. మీ గురించి అడిగితే.. పెద్దమ్మ చిరాకుపడుతుంది. నేను నష్ట జాతకుడిని కాను అని నిరూపిస్తాను. అందరికి అమ్మా, నాన్న, అక్కా తమ్ముడు, అన్న అనే బంధాలు ఉన్నాయి. నాకు ఎవరు ఉన్నారో తెలియదు. గొప్ప డాక్టర్ కావాలని పై లోకం నుంచి దీవించండి అంటూ మోనిత కొడుకు ఆనంద్ కన్నీరు పెట్టుకొన్నాడు.

 కార్తీకదీపం టాప్ రేటింగ్‌తో

కార్తీకదీపం టాప్ రేటింగ్‌తో

కార్తీకదీపం సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నద.ి ఈ టెలివిజన్ సీరియల్ ర్యాంకింగ్ పరంగా, రేటింగ్ పరంగా నాలుగేళ్లుగా టాప్‌లో కొనసాగుతున్నది. గతేడాది మాదిరిగానే.. 2022లోని 14వ వారంలో కూడా అదే జోష్ కొనసాగించింది. తాజాగా 12.52 రేటింగ్‌ను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X