twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఆ రెండు రోజులు కన్నీళ్లే కదా.. తాతయ్యను అలా ఇబ్బంది పెట్టిన శౌర్య

    |

    మన పెళ్లి క్యాన్సిల్ చేయండి. అదే ముహుర్తానికి శౌర్య మెడలో తాళి కట్టండి బావ అని హిమ చెప్పిన మాటల గురించి నిరుపమ్ ఆలోచనల్లో పడ్డాడు. హిమ నీపై ఎంత ప్రేమ ఉందో చెప్పినా గానీ.. నీకు ఎందుకు అర్ధం కావడం లేదో నాకు తెలియడం లేదు అని మనసులో అనుకొంటుంటే.. తల్లి స్వప్న వచ్చి ఎందుకు రా అలా ఆలోచిస్తావు. ఆ హిమ గురించేనా అని అంటే.. ప్రతీ మనిషికి పర్సనల్ స్సేస్ ఉంటుంది. అన్ని నీకు చెప్పాలా? అని నిరుపమ్ బదులిచ్చాడు. దాంతో నీ పెళ్లిని నేను ఒప్పుకోవడం తప్పు అని స్వప్న అంటే.. పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి వ్యక్తిగతమైన చాయిస్. దానిపై రాద్దాంతం చేయకు మమ్మీ అని నిరుపమ్ జవాబిచ్చాడు. అయితే నేను రాద్దాంతం చేస్తున్నానా. నీ మంచి కోసమే చెబుతున్నాను కదా..హిమ అక్కడ బాగానే ఉంటుంది. నీవు ఇక్కడ బాధపడటం ఎందుకు? అంటూ స్వప్న ప్రశ్నించింది. దాంతో హిమ మంచిది.. ప్రతీసారి హిమను తిట్టడం ఆపేయ్ అని నిరుపమ్ ఘాటుగా స్పందించాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1408లో ఇంకా ఏం జరిగిందంటే?

    విత్తనం నాటిన రోజే.. అంటూ సౌందర్య

    విత్తనం నాటిన రోజే.. అంటూ సౌందర్య

    తనపై కోపగించుకొన్న శౌర్య గురించి తనలోతాను ఆలోచించుకొంటు హిమ కనిపించింది. శౌర్య కోపం తగ్గించలేనా? బావ మనసు మారదు. శౌర్య కోపం తగ్గదు అంటూ హిమ ఆవేదన చెందింది. అంతలోనే నానమ్మ సౌందర్య వచ్చి.. ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే.. శౌర్య కోపం తగ్గదా? అని అడిగితే.. ఈ రోజు నాటిన విత్తనం ఈ రోజే పెరగాలి అనుకొంటే.. కుదరదు కదా.. కొన్ని సంవత్సరాలుగా మనసులో ఉన్న కోపం ఒక్క రోజులో తగ్గదు కదా అని సౌందర్య చెప్పింది. బాధ ఉంటే.. భోజనం చేయకుండా ఉండకూడదు. డాక్టర్‌వు నీవే.. ఇలా చేస్తే. ఎలా అని సౌందర్య చెప్పింది.

    ఒక్క రోజు భోజనం మానేశారా?

    ఒక్క రోజు భోజనం మానేశారా?

    ఇక ఒంటరిగా కూర్చొన్న శౌర్య వద్దకు ఆనందరావు వెళ్లి భోజనం చేద్దామా అంటే.. నాకు ఆకలి లేదు అని అంటే.. నీవు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రతీ రోజు భోజనం చేసే ముందు నీవు ఎలా ఉన్నావో అని తలచుకొనే వాళ్లం అని ఆనందరావు అంటే.. నేను ఇంటిలో నుంచి వెళ్లిన తర్వాత ఒక్కరోజు భోజనం మానేసి ఉంటారు. రెండు రోజులు కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు అని శౌర్య ఘాటుగా స్పందించింది. దాంతో శౌర్య, హిమను కలిపేందుకు సౌందర్య, ఆనందరావు అనాధశ్రమంకు వెళ్లాలని డ్రామా ఆడారు. అయితే అనాధశ్రమానికి వెళ్లకుండా ఉండేందుకు హిమ, శౌర్య భోజనం చేసేందుకు అంగీకరించారు.

    డాక్టర్ శోభలో అలాంటి కంగారు

    డాక్టర్ శోభలో అలాంటి కంగారు

    ఇక నిరుపమ్ పెళ్లి సమీపిస్తుండటంతో డాక్టర్ శోభలో కంగారుపడిపోయింది. నిరుపమ్ పెళ్లిని ఆపడంలో స్వప్న ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. నా కళ్లముందే నిరుపమ్, హిమ పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లిపోతారేమో అని శోభ అనుకొంటుండగా.. బ్యాంక్ రికవరీ టీమ్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు అప్పులు, వడ్డీ చెల్లించకపోతే నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం అని బెదిరించారు. దాంతో అనుకొన్న పనులు అనుకొన్నట్టు జరగడం లేదు. త్వరలోనే మీ రుణాన్ని చెల్లిస్తా అని శోభ చెప్పింది.

    బోనాల పండుగ కోసం

    బోనాల పండుగ కోసం

    సౌందర్య, ఆనందరావు ఇంటికి శౌర్యను చూసేందుకు పిన్ని వచ్చింది. తన పిన్నిని చూడగానే ఆనందంగా వచ్చి శౌర్య కౌగిలించుకొన్నది.అయితే తాము బోనాలు చేస్తున్నాం.మీరంరదూ మా ఇంటికి రావాలి అని శౌర్య పిన్ని చంద్రం ఆహ్వానించింది. దాంతో మీ ఇంట్లో జరిగే బోనాల పండుగలో మేము భాగమవుతాం అని సౌందర్య చెప్పింది. అయితే బోనాల ఏర్పాట్లు మేము చేస్తాం. కానీ మీరు అమ్మవారికి చీరె తీసుకు రావాలి అని చెప్పింది. ఆషాడం మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది. కాబట్టి అన్నం, నైవేద్యం సమర్పించుకోవాలి అని చంద్రుడు చెప్పింది. దాంతో అమ్మవారికి మేమే చీరె సమర్పిస్తాం అని సౌందర్య చెప్పింది.

    బోనాల షాపింగ్ కోసం

    బోనాల షాపింగ్ కోసం


    ఇక బోనాల వేడుకలో పాల్గొనేందుకు సౌందర్య కుటుంబం ఏర్పాట్లలో సిద్దమైంది. బోనాలకు సంబంధించిన షాపింగ్ కోసం అందరం కలిసి వెళ్దాం అంటే.. హిమ వస్తుండటంతో శౌర్య రానని మొండికేసింది. బోనాల పండుగ కోసం ఇలా బెట్టు చేయవద్దని సౌందర్య చెప్పడంతో.. చివరకు సరే ఒప్పుకొన్నది. అయితే బోనాల పండుగలో ఇద్దరు మనవరాళ్లతోపాటు ఇద్దరు మనవళ్లు కూడా ఉంటే.. బాగుండేది కదా సౌందర్య అని ఆనందరావు అంటే.. వారిని నేను ఆహ్వానిస్తానని హిమ చెప్పింది. ప్రేమ్‌కు ఫోన్ చేసి బోనాల పండుగకు రావాలని చెప్పింది.

    English summary
    Karthika Deepam July 19th Episode number 1408.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X