Karthika Deepam కార్తీకదీపం సీరియల్‌లో ఊహించని ట్విస్టు.. హిమ గురించి శౌర్య అలా..
నా జీవితాన్ని క్షణంలో తారుమారు చేసిన శత్రువును వదలనంటే వదలను అంటూ శౌర్య అలియాస్ జ్వాలా ఆవేశంగా అంటుండగా హిమ జ్వాలానే తన సోదరి అని తెలుసుకొన్నది. దాంతో అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతుంటే.. ఏంటి తింగరి ఎక్కడికి వెళ్తున్నావు అని శౌర్య ఆపింది. దాంతో నీకు నాపై ఇంకా కోపం తగ్గలేదా? శౌర్య అంటూ మౌనంగా మనసులో రోదించింది. శౌర్య ఏమిని అడుగుతున్నప్పటికీ అక్కడి నుంచి బాధగా ఇంటికి వచ్చి.. తన తల్లిదండ్రుల ఫోటోలు ముందు ఏడుస్తూ.. అమ్మా, నాన్న.. నేను శౌర్యను చూశాను.
మన శౌర్యను చూశాను. ఎన్నాళ్ల నుంచి.. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న శౌర్య నాకు కనిపించింది. ఈ జీవితానికి ఇక చాలు. శౌర్య కనిపించగానే గట్టిగా కౌగిలించుకోవాలని అనుకొన్నాను. కానీ శౌర్యకు నాపై రెండితలు పెరిగిపోయింది. చిన్నప్పుడు శౌర్య నన్ను బాగా చూసుకొనేది. కానీ ఆ ప్రేమ నాపై ద్వేషంగా మారిపోయింది. శౌర్యలో ఉన్న కోపాన్ని పొగొట్టడమే నా లక్ష్యం. ఆ కోపాన్ని ప్రేమగా మార్చడమే నా లక్ష్యం. అందుకు పై నుంచి నాకు దీవెనలు ఇవ్వండి హిమ వేడుకొన్నది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1322లో ఇంకా ఏం జరిగిందంటే?

అమ్మలానే శౌర్య కూడా కష్టపడుతూ..
ఒసేయ్ శౌర్య.. నేను మీ హిమను. నీ తింగరినే హిమను అని చెప్పి శౌర్యకు దగ్గరకావాలని కోరుకొంటున్నాను. డాడీ.. చిన్నప్పుడు వంటలు చేస్తూ కష్టపడినట్టుగానే ఆటో నడుపుతూ.. వంటలు చేయిస్తూ కష్టపడుతన్నది. ఇంట్లో నుంచి శౌర్య వెళ్లిపోవడానికి నేనే కారణం కదా. నేను ఇక్కడ హాయిగా ఉంటే.. తను అక్కడ ఇబ్బందులు పడుతున్నది. నా ఆస్తిలో సంతోషంలో భాగం ఉంది కదా. తనకు ఏ కష్టం.. ఇబ్బంది రాకుండా చూసుకొంటాను. శౌర్యను నేను కాపాడుకోవడం ఏమిటి? తనే నన్ను ఇలా ఉండాలి.. ఇలా ఉండాలి అని నడిపిస్తున్నది. డాడీ నన్ను దీవించండి. ఈ తింగరి ఒంటరి కాదు. నాకు శౌర్య ఉంది. నాకు ఒక అక్క ఉంది. ఎన్నో ఏళ్లు ఆమె కోసం ఎదురు చూశాను. శౌర్యలో కోపాన్ని మార్చేందుకు ఎదురు చూస్తా అని హిమ తల్లిదండ్రుల ఫోటోల ముందు చెప్పింది.

నా ఇంట్లో స్థానం లేదు అంటూ
సౌందర్య, ఆనందరావు తన కూతురు స్వప్న ఇంటికి వెళ్లారు. గుమ్మంలో సౌందర్య అడుగుపెడుతుండగానే.. తల్లిని నా ఇంట్లో అడుగుపెట్టవద్దని అరిచింది. దాంతో సౌందర్య ఆవేదన చెంది.. ఏంటండి.. కూతురు ఇంట్లోకి వెళ్లడానికి కూడా జైలులో ఖైదీని కలిసినట్టు వెళ్లాల్సి వస్తున్నది అంటుండగానే.. కూతురు స్వప్ప గేటు వద్దకు వచ్చి.. నాన్న నీవు ఉండాలంటే నా వద్ద ఉండు. కానీ సందర్శకులకు నా ఇంట్లో స్థానం లేదు. కావాలంటే ఇంటి ముందు బోర్డు తగిలించాలంటే తగిలిస్తాను అని అంటుంటే.. అంతలోనే డాక్టర్ నిరుపమ్ వచ్చాడు.

విడిపోతే ఒంటరి అయిపోతాం అంటూ నిరుపమ్
అమ్మమ్మ, నాన్నమ్మలు గేట్ వద్ద కనిపించగానే.. అమ్మమ్మ ఎప్పుడు వచ్చావు? రండి లోపలికి వెళ్దాం అని నిరుపమ్ అంటే. ఈ ఇంట్లోకి ఎవరు రావాలో.. ఎవరు రావొద్దో నాకు తెలుసు. నన్ను కష్టపెట్టిన వాళ్లు.. నా మనసుకు క్షోభ పెట్టిన వాళ్లకి.. ఈ ఇంట్లోకి ప్రవేశం లేదు నిరుపమ్ అని స్వప్ప అంటే.. కలిసి ఉండాలి కాని.. విడిపోవాలనుకొంటే.. ఒంటరి అయిపోతాం అని అంటే.. నీవు నాకు పాఠాలు చెప్పనక్కర్లేదు అని నిరుపమ్‌కు స్వప్న జవాబిచ్చింది. ఎప్పుడో ఏదో జరిగిందని.. ఇప్పుడు ఇలా బిహేవ్ చేయడం నచ్చడం లేదు అని నిరుపమ్ అంటే.. ఒకవేళ నీకు నచ్చితే.. నీవే వెళ్లి చూసిరా.. అని చెప్పేసి వెళ్లిపోయింది.

నా తల్లిదండ్రులు కూడా మరణించడానికి..
తన చేతిపై ఉన్న హెచ్ అనే పచ్చబొట్టును చూస్తూ బాధపడిపోయింది. శౌర్యను చూసిన చంద్రమ్మ.. ఏమిటి అలా ఆలోచిస్తున్నావు అని అడిగితే.. ఆలోచించేది కూడా చెప్పాలా? అంటూ శౌర్య బదులిచ్చింది. పక్కనే స్టీలు గ్లాస్‌లో మందు పోసుకొని తాగుతున్న భర్త ఇంద్రుడిని చూసి గ్లాస్ లాగేసుకొన్నది. దాంతో శౌర్య వచ్చి ఏంటి బాబాయ్.. ఎందుకలా మందు తాగుతున్నావు అని అడిగి.. చిన్నప్పుడు నా తల్లిదండ్రులు మరణించడానికి ముందు కూడా ఇలానే మందు తాగి ఎంజాయ్ చేశారు. అదే వాళ్లకు చివరి డ్యాన్స్ అయింది అని శౌర్య బాధపడింది. అంతలోనే హిమ గుమ్మం ముందు ఉండటంతో ఏంటి తింగరి ఇలా వచ్చావు అని అడిగింది.

నీ పేరు ఏమిటని హిమను అడిగితే..
అయితే హిమను చూస్తూ చీకట్లో రావడానికి భయపడలేదా? అని శౌర్య అడిగితే.. నా భయాన్ని నీవు పొగొట్టావు కదా.. ఇక నాలో భయం లేదు. ఇక నుంచి నా ధైర్యం నువ్వే.. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది అని హిమ అంది. దాంతో ఇల్లు ఎలా తెలుసుకొన్నావు అని అడిగితే.. చాలా కష్టపడ్డాను అని సమాధానం చెప్పింది. శౌర్యతోపాటు ఇంట్లో ఇంద్రుడు, చంద్రుడిని చూసిన హిమ.. చిన్నతనంలో తనను కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకొన్నది. అంతలోనే నీ పేరు ఏమిటని చంద్రమ్మ అడిగితే.. నా పేరు అంటూ సంశయించింది. అంతలోనే నీ పేరు చెప్పకు. ఒకవేళ చెబితే.. నేను తింగరి అని పిలువను అని శౌర్య అనగానే.. తన అక్క చేతిని తన చేతిలోకి తీసుకొని ఆనందపడిపోయింది.

లేటేస్ట్ ప్రోమో మరింత ఎమోషనల్‌గా
ఇక తాజా ప్రోమోలో మరిన్ని ఫీల్‌గుడ్ అంశాలు కనిపించాయి. ఇంద్రుడు, చంద్రుడు, హిమ, శౌర్య కలిసి భోజనం చేస్తూ కనిపించారు. శౌర్య పక్కనే హిమ కూర్చొని.. నీ పక్కన కూర్చోవాలని ఎన్ని రోజుల నుంచి కలలు కంటున్నానో అని మనసులో అనుకొన్నది. దాంతో నీకు ఏం ఇష్టం అంటే.. దోసకాయ పచ్చడి అంటూ సమాధానం చెప్పగానే.. తన తల్లిని గుర్తు చేసుకొన్నది. వెంటనే నాకు ఆ పచ్చడి అంటే ఇష్టం ఉండదు అని శౌర్య అంటే.. నాకు నచ్చని వాళ్లకు ఆ పచ్చడి ఇష్టం అని చెప్పింది. దాంతో హిమ బాధ పడుతూ కన్నీరు పెట్టింది. దాంతో ఏం తింగరి.. కారం ఎక్కువైందా? ఉండు.. అన్నం మంచిగా కలుపుకొని తినాలి. ఉండు నేను తినిపిస్తాను అంటూ ప్లేట్ తీసుకొని ముద్దలు పెట్టింది. శౌర్య, హిమ ప్రేమను చూసి.. వీళ్లిదరిని చూస్తే.. అక్కా చెల్లెల్లుగా అనిపిస్తుంది కదా అని పిన్ని అనగానే.. శౌర్య సీరియస్‌గా ఒక లుక్ వేసింది.

కార్తీకదీపం 13వ వారం రేటింగ్
కార్తీకదీపం సీరియల్ కొన్నేళ్లుగా టాప్ రేటింగ్‌తో సాగుతున్నది. ప్రస్తుతం డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ముగిసినా.. ఈ సిరియల్ అదే జోష్ కొనసాగిస్తున్నది. ఈ ఏడాది 13వ వారంలో ఈ సీరియల్ 12.61 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్‌లో 13వ వారంలో 10.24 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











