Karthika Deepam నాపై ప్రేమ ఉంటే.. పెళ్లి క్యాన్సిల్ చేసుకో.. నిరుపమ్‌కు షాక్

డాక్టర్ నిరుపమ్‌తో హిమ కలిసి ఉండటాన్ని చూసిన శౌర్య కోపంతో ఊగిపోయింది. తనకు, డాక్టర్ సాబ్‌కు పెళ్లి చేస్తానని చెప్పి తనను మోసగించిందనే కారణంతో ఇంటికి వచ్చిన శౌర్య.. ఎదురుగా ఉన్న ఫోటోపై బాణాలను విసిరికొట్టడం చూసిన హిమ.. నాపై కోపం ఉంటే.. ఫోటోపై ఎందుకు కొట్టడం డైరెక్టుగా నాపైనే బాణం పుల్లలను విసురు అని హిమ కంటతడి పెట్టింది. దాంతో ఏంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ప్లాన్‌లో భాగమేనా? అని శౌర్య అంటే.. ప్లాన్స్ ఏమీ లేవు. నేను నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంటే.. నీవు వినడం లేదు.

నీకు నచ్చకపోతే.. నీకు కోపం తగ్గుతుందనుకొంటే.. నన్ను చంపేయ్ అంటూ హిమ ఆవేదన వ్యక్తం చేసింది.హిమ మాటలను మధ్యలోనే ఆపేస్తూ నీ మాదిరిగా మనుషుల ప్రాణాలను తీయడం నాకు చాతకాదు. చేసిందంతా చేసి.. ఇప్పుడు ప్రాణాలు తీయమంటున్నావా? నాకు ప్రాణాలు తీసేంత క్రూరత్వం లేదు. క్షమించేది లేదు అని హిమతో శౌర్య అనడం చూసి సౌందర్య, ఆనందరావు బాధపడ్డారు. ఇంకా కార్తీకదీపం సీరీయల్ తాజా ఎపిసోడ్ 1406 ఏం జరిగిందంటే?

శౌర్య.. నా మాటలను అర్ధం చేసుకో

శౌర్య.. నా మాటలను అర్ధం చేసుకో

అయితే శౌర్య మాటలకు బాధపడుతూ హిమ.. శౌర్య ఇంటికి వచ్చిన ఆనందం తప్ప.. కోపం తగ్గలేదనే బాధ ఎక్కువగా ఉంది. అమ్మ, నాన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి శౌర్యకు మంచి జీవితం ఇవ్వాలని అనుకొన్నాను. తాను కోరుకొన్న బావతో శౌర్య పెళ్లి చేయాలని అనుకొన్నాను. కానీ శౌర్య నన్ను అర్దం చేసుకోవడం లేదు అని శౌర్య బాధపడుతుంటే.. హాస్పిటల్‌లో ఓ పేషెంట్ వచ్చి.. మమల్ని గుర్తుపట్టావా? ఈ పాప ప్రాణాలు మీరే కాపాడారు అని చెప్పింది.

అంటే.. ఆ సంఘటనను గుర్తు చేసుకొని.. అవును.. అవును అని హిమ సమాధానం ఇచ్చింది. ఈ పాపను బతికించడమే కాకుండా శౌర్య అని పేరు పెట్టారు. ఈ పాప మొదటి బర్త్ డేకు నీవు రావాలి అని ఆహ్వానించారు. అయితే తనకు రావడం కుదరదని.. కొన్ని పనుల వల్ల రాలేకపోతున్నానని చెప్పి కొంత డబ్బు వారికి ఇచ్చి గిఫ్టు కొనమని చెప్పింది.

నేనంటే నీకు ద్వేషం

నేనంటే నీకు ద్వేషం

శౌర్య నీవంటే నాకు ప్రాణం. మనిద్దరం చిన్నప్పటిలా కలిసి ఉండాలని కోరిక. కానీ నేనంటే నీకు ద్వేషం. నీ మనసు ఎప్పుడు మారుతుంది. నన్ను ఎప్పుడు అర్ధం చేసుకొంటావు అని శౌర్య ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడి.. అమ్మా.. నా జీవితం ఎలా అయిందో చూశావా? నా ఇంట్లోనే నేను పరాయిదానిగా బతుకుతున్నాను. నేను కోరుకొన్నవని నాకు దక్కడం లేదు. చివరకు డాక్టర్ సాబ్ కూడా అని శౌర్య బాధపడింది. నిరుపమ్ ఇచ్చిన ఫోన్ చూసి.. ఈ ఫోన్ నేను ఎందుకు వాపసు ఇవ్వలేదు అని శౌర్య బాధపడింది.

నా మీద నీకు కోపమా?

నా మీద నీకు కోపమా?

అయితే శౌర్య ఇలా బాధపడుతుంటే..డాక్టర్ నిరుపమ్ వెనుక నుంచి వచ్చి..తన ముందు కూర్చున్నది హిమ అనుకొని.. నా మీద నీకు కోపమా? అని పలకరించాడు. దాంతో ఇది డాక్టర్ సాబ్ గొంతు కదా.. అని శౌర్య మనసులో అనుకొన్నది. అయితే తన ముందు ఉండి ఏం మాట్లాడకపోవడంతో.. నీ కోపం పోవాలంటే నేను ఏం చేయాలి అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు. దాంతో శౌర్య సంబరపడిపోతుంటే.. నిరుపమ్ ఐ లవ్ యూ అనడంతో తిరిగి చేసింది. తన ముందు ఉన్నది హిమ కాదు.. శౌర్య అని తెలుసుకొని.. సారీ జ్వాలా.. శౌర్య అని తడబడుతూ.. నేను హిమ అనుకొని.. మాటల్నీ ఆపేశాడు. సారీ శౌర్య.. హిమ కూడా ఇలాంటి డ్రస్‌లోనే.. హిమ అనుకొని.. అంటూ మాటల్ని మింగాడు. దాంతో హిమ ఎక్కడ.. లోపల ఉన్నారా అని అడిగితే.. శౌర్య మౌనంగా ఉండిపోయింది. దాంతో అక్కడి నుంచి నిరుపమ్ వెళ్లిపోయాడు.

పెళ్లి క్యాన్సిల్ చేసుకొందాం

పెళ్లి క్యాన్సిల్ చేసుకొందాం

హిమ అంటూ అరుస్తూ.. ఇంట్లోకి నిరుపమ్ వెళ్లాడు. నువ్వు అనుకొని శౌర్యతో మాట్లాడాను. మీరిద్దరూ ఏంటి ఒకే డ్రస్ వేసుకొన్నారు. ఏమైనా ప్లాన్ చేసుకొన్నారా? అని అడిగితే.. తాత, నానమ్మ ముచ్చటపడ్డారు అని హిమ సమాధానం చెప్పింది. నిరుపమ్ మూడ్ బాగుండటంతో శౌర్య గురించి ప్రస్తావించింది. మన పెళ్లి క్యాన్సిల్ గురించి ఏమైనా ఆలోచించావా? అని అనగానే నిరుపమ్ షాక్ తిన్నాడు. వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేశాం. అందర్నీ ఆహ్వానించాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయమంటే ఎలా అని అంటే.. అదే ముహుర్తానికి శౌర్యను పెళ్లి చేసుకో అని జవాబు ఇచ్చింది.

 ప్రేమ ఉంటే.. పెళ్లి క్యాన్సిల్ చేయాలా?

ప్రేమ ఉంటే.. పెళ్లి క్యాన్సిల్ చేయాలా?

హిమ మాటలకు ఆశ్చర్యపోయిన నిరుపమ్.. పెళ్లి సరే.. ప్రేమను ఎలా బదిలిచేస్తావు. శౌర్యకు నీవంటే ఇష్టం. ప్రాణం బావ.. అని హిమ అంటే.. నీవంటే నాకు ఇష్టం. ఏం కావాలన్నా చేస్తాను కానీ.. ఏం తెచ్చి ఇవ్వమన్నా తెచ్చి ఇస్తాను. నీవు త్యాగం చేసి శౌర్యతో పెళ్లి చేయాలని అనుకొంటున్నావు. నా జీవితం, నా ఆనందం.. ప్రేమ గురించి ఆలోచించావా? అని నిరుపమ్ ప్రశ్నించాడు. నేను ఎలా సంతోషంగా ఉంటానని అనుకొన్నావు అని నిరుపమ్ అంటే.. నా మీద ప్రేమ ఉన్నప్పుడు ఇది చేయలేవా? అని హిమ అడిగింది. దాంతో నీ మీద ప్రేమ ఉంటే.. నిన్ను బాగా చూసుకొంటాను. గౌరవిస్తాను. అంతేగానీ.. నీ మీద ప్రేమ ఉంటే..వేరే వాళ్లను పెళ్లి చేసుకొంటే.. అది ప్రేమ ఎలా అవుతుంది? ఇలాంటి అనవసరం మాటలు మాట్లాడకు అని నిరుపమ్ కోపంగా అరిచాడు. ఈ మాటలన్నీ శౌర్య విని మౌనంగా వెళ్లిపోయింది.

నాకు మేనమామ పోలికలు

నాకు మేనమామ పోలికలు

కోపంగా వెళ్లిపోతున్న నిరుపమ్‌ను తాత, నానమ్మ ఆపేందుకు ప్రయత్నించారు. అయితే హిమతో గొడవ పడ్డావా అని అడిగితే.. తన మీద ఉన్న ప్రేమ కోసం శౌర్యను పెళ్లి చేసుకోమంటున్నది. నా పరిస్థితి ఏమిటో నాకే తెలియడం లేదు. అందరూ నాకు మేనమామ పోలికలు వచ్చాయని అంటారు. మేనమామ మాదిరిగానే డాక్టర్ అయ్యాను. పోలీకలే కాదు... ఆయన మాదిరిగానే తలరాత వచ్చిందా అనే భయం కలుగుతున్నది. అమ్మ కూడా ఇలాంటి భయాన్ని వ్యక్తం చేసింది. శౌర్యను పెళ్లి చేసుకోమంటుంది.. ఇదేలా సాధ్యం అని నిరుపమ్ అన్నాడు.

కార్తీకదీపం 27వ వారం రేటింగ్ ఇలా

కార్తీకదీపం 27వ వారం రేటింగ్ ఇలా

ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 26వ వారం అంటే.. జూన్ చివరి వారంలో ఈ సీరియల్ అర్బన్‌లో 11.10 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. జూలై ఫస్ట్ వీక్‌లో 11.16 రేటింగ్‌ను నమోదు చేసింది. రూరల్ ప్రాంతానికి సంబంధించిన రేటింగ్ విషయానికి వస్తే.. 26వ వారంలో 11.49 రేటింగ్, 27 వారంలో 11.49 రేటింగ్ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X