Karthika Deepam లో భారీ ట్విస్టు.. తప్పిపోయిన సొంత తమ్ముడు శౌర్య, హిమకు దొరికాడా?

జ్వాలా అలియాస్ శౌర్యతో బైక్‌పై వెళ్తున్న తనను నానమ్మ సౌందర్య చూడటంతో హిమ కంగారు పడిపోయింది. నానమ్మను తప్పించుకోవడానికి స్పీడ్‌గా వెళ్లమని హిమ తొందరపెట్టింది. అయితే బైక్‌పై ఎవరితోనో వెళ్తున్న హిమను సౌందర్య వెంటాడింది. అయితే అలా రోడ్డుపై ఒకరివెనుక మరొకరు స్పీడ్‌గా రేస్ సాగింది. కారు వేగంగా నడుపుతూనే.. హిమలో సడెన్‌గా మార్పు కనిపిస్తున్నది. ఆ మార్పుకు కారణం ఏమిటో తెలియడం లేదు. ఇంతకు బైక్ నడిపేది ఎవరు? అంటూ పలు ప్రశ్నలను తనకు తానే వేసుకొన్నది. అయితే నాన్నమ్మను తప్పించుకోవడానికి హిమ ప్రయత్నించింది. అయితే సౌందర్య ప్రయాణిస్తున్న సడెన్‌గా ఆగడంతో ఓ చోట శౌర్యను ఆపి.. తనను పంపించింది. మోస్ట్ పాపులర్ కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1326 లో ఇంకా ఏమి జరిగిందంటే..

శౌర్య బైక్‌పై వేగంగా

శౌర్య బైక్‌పై వేగంగా

శౌర్యను బలవంతంగా పంపించి రోడ్డు పక్కన నిలబడి ఉండటంతో.. నీవు బైక్‌పై వెళ్లడం ఏమిటి? ఆమె ఎవరు అంటే.. తను జ్వాలా. ఆటో డ్రైవర్ అంటూ హిమ సమాధానం చెప్పింది. ఆటో డ్రైవర్‌తో వెళ్లడం ఏమిటి అంటే.. సడెన్‌గా పేషెంట్ వద్దకు వెళ్లాల్సి రావడంతో ఆటో డ్రైవర్‌ సహాయం తీసుకొన్నాను అని హిమ సర్ది చెప్పింది. అలాగే తనకు తల తిప్పుతుందని చెప్పడంతో కారులో ఇంటికి బయలుదేరింది.

 హిమ, సౌందర్య ఎమోషనల్‌గా

హిమ, సౌందర్య ఎమోషనల్‌గా


ఇంటికి చేరిన తర్వాత హిమను సౌందర్య నిలదీస్తూ.. నీవు బైక్ మీద వెళ్లడం ఏమిటి? నీలో చాలా మార్పు కనిపిస్తున్నది. చాలా దూకుడు ప్రదర్శిస్తున్నావు. నీకు అర్జెంట్ ఉంటే.. క్యాబ్‌ బుక్ చేసుకోవాల్సింది అని అంటే.. జ్వాలా మంచి అమ్మాయి. ఆ సమయానికి అక్కడ ఉంది. అందుకే ఆమెను తీసుకెళ్లాను అని చెప్పింది. అయితే శౌర్య ఉంటే.. నిన్ను బాగా చూసుకొనేది కదా.. అని సౌందర్య అంటే.. ఇప్పుడు నన్ను బాగా చూసుకొనేది శౌర్యనే అంటూ మనసులో అనుకొన్నది. నీకు నచ్చిన జ్వాలాను నాకు పరిచయం చేయవచ్చు కదా.. అంటూ అడిగితే హిమ కంగారు పడింది.

 శౌర్యతో ప్రేమ్ తండ్రి ఎమోషనల్‌గా

శౌర్యతో ప్రేమ్ తండ్రి ఎమోషనల్‌గా


ఇక ప్రేమ్ తండ్రి ఆకలితో ఉండి.. శౌర్య కోసం వేచి చూస్తుంటే.. అంతలోనే ఆమె అక్కడికి వచ్చింది. నీ గురించే అనుకొంటున్నాను. నీకు 100 ఏళ్ల ఆయుష్షు అంటే.. అందులో అమ్మా, నాన్నకు కొంత ఇచ్చి ఉంటే బాగుండు అని మనసులో ఎమోషనల్ అయింది. ఆకలిగా ఉంది. క్యారేజ్ ఏది అంటే.. నా అసిస్టెంట్ తీసుకు వస్తున్నారు అని శౌర్య సమాధానం చెప్పగానే.. అంతలోనే ప్రేమ్ అక్కడికి వచ్చాడు. ప్రేమ్ ఆటోలో ఫుడ్ తీసుకు రావడంతో ఏంటి నీవు ఆటోలో ఎందుకు వచ్చావు అంటే.. ఇప్పటికే అమ్మ షాంపూ లేకుండా తలంటింది అంటూ ప్రేమ్ తన తల్లితో జరిగిన విషయాన్ని చెప్పాడు.

 తల్లిని మెప్పించేందుకు డాక్టర్ నిరుపమ్

తల్లిని మెప్పించేందుకు డాక్టర్ నిరుపమ్


డాక్టర్ నిరుపమ్ ఇంటికి రావడంతో తల్లి స్వప్న ఎదురుపడి.. త్వరగా ఫ్రెష్ అవ్వు.. భోజనం వడ్డిస్తా అంటే.. భోజనం తర్వాత చేద్దా కానీ.. ఇలా రా అంటూ.. నేనెంటో.. నువ్వేంటో నాకు తెలుసు. నేనంటే నీకు చాలా ప్రేమ.. కానీ ఎదుటివాళ్లతో ఎందుకు కోపంగా ఎందుకు ఉంటావు అని నిరుపమ్ అంటే.. ఎదుటి వాళ్లను బట్టి నా ప్రవర్తన ఉంటుంది అని స్వప్న జవాబిచ్చింది. అయితే నిన్ను ఒక కోరిక కోరుతాను. ప్రేమ్ పెట్టే ఫోటో ఎగ్జిబిషన్‌కు నాన్నను పిలుద్దాం అంటే.. స్వప్న సీరియస్ అయింది. ఎగ్జిబిషన్ వంకతో బంధాలు, అనుబంధాలు కలుపుతున్నావా.. ఒకవేళ నేను ఎగ్జిబిషన్‌కు రావాలంటే.. నన్ను పిలువకు అంటూ స్వప్న సీరియస్ అయింది.

 డాక్టర్ కార్తీక్ ఫోటోకు దండ వేయడంపై

డాక్టర్ కార్తీక్ ఫోటోకు దండ వేయడంపై


ఇదిలా ఉండగా.. శ్రీరాం నగర్ బస్తీకి ప్యాసింజర్‌ను శౌర్య ఆటోలో వెళ్లింది. కచ్చితంగా తాము నివసించిన ఇంటి ముందు ఆటో ఆగడంతో.. ప్యాసింజర్‌ను పంపి.. ఇంటిలోకి అడుగుపెట్టింది. ఇంటిలో తన తండ్రి ఫోటోకు ఫ్రెష్‌గా పూలదండలు వేసి.. ఇల్లు చాలా శుభ్రంగా ఉండటం చూసి శౌర్య అనుమాన పడింది. ఇంటిని మోనిత ఆంటీ శుభ్రం చేస్తుందా? లేక నా శత్రువు హిమ ఏమైనా వస్తుందా? అంటూ శౌర్య అనుమానపడింది. వెంటనే బయటకు రాగానే.. హోటల్‌లో పనిచేసే రవి ఇడ్లీ కనిపించడంతో ఏంటిరా ఇక్కడ అంటూ శౌర్య పలుకరించింది. నాతో వస్తావా అంటే.. సరే అని ఆటో ఎక్కాడు.

రవ్వ ఇడ్లీ సొంత తమ్ముడా?

రవ్వ ఇడ్లీ సొంత తమ్ముడా?


అయితే శౌర్య, రవ్వ ఇడ్లీ బయలుదేరే ముందు తాను ఇంట్లో ఫోన్ మరిచిపోయాననే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో రవ్వ ఇడ్లీని పంపించి ఫోన్ తీసుకు రమ్మని చెప్పింది. ఇంట్లోకి అడుగుపెట్టిన రవ్వ ఇడ్లీ.. డాక్టర్ కార్తీక్ ఫోటోను చూసి షాక్ తిన్నాడు. దాంతో ఈ సీరియల్‌లో మరో భారీ ట్విస్టు చోటుచేసుకొన్నది. డాక్టర్ కార్తీక్ ఫోటో చూసి రవ్వ ఇడ్లీ ఎందుకు షాక్ తిన్నాడనే విషయం మరింత ఆసక్తిని రేపింది. అయితే రవ్వ ఇడ్లీ నిక్ నేమ్‌తో హోటల్‌లో పనిచేసే అబ్బాయి హిమ, శౌర్యకు సొంత తమ్ముడా అనే అనుమానం అందరిలో కలుగుతున్నది.

కార్తీకదీపం రేటింగ్ షాకింగ్‌గా

కార్తీకదీపం రేటింగ్ షాకింగ్‌గా


ఇదిలా ఉండగా.. కార్తీకదీపం సీరియల్‌కు తెలుగు బుల్లితెరపైన ఎదురులేకుండా పోతున్నది. ఈ ఏడాది 14వ వారంలో కూడా టాప్ టీఆర్పీని సాధించింది. కానీ గతవారాల్లో పోల్చుకొంటే.. ఈ వారం గట్టిగానే తగ్గింది. గతవారం అంటే 13వ వారంలో 12.61 రేటింగ్ నమోదు చేసుకొంటే.. 14వ వారంలో 12.52 టీఆర్పీని సాధించింది. బహుశా ఐపీఎల్ టోర్ని కారణంగా సీరియల్స్‌పై భారీగా దెబ్బ పడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X