India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam ఆ ఇద్దరిని పోలీసులకు పట్టించిన జ్వాలా.. ధైర్య సాహసాలకు అవార్డు లభించడంతో..

  |

  డాక్టర్ నిరుపమ్ తన ప్రేమను రిజెక్ట్ చేయడంతో తీవ్ర నిరాశకు గురైన జ్వాలా అలియాస్ శౌర్య కఠిన నిర్ణయం తీసుకొన్నది. నా పిన్ని, బాబాయ్ వచ్చిన తర్వాత నేను ఈ ఊరు వదిలి వెళ్లిపోతాను అని చెప్పడంతో ఆనందరావు, సౌందర్య షాక్ తిన్నారు. నీవు ఊరు వదిలిపోతే మేము ఏం కావాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమలో విఫలం చెందినంత మాత్రాన నీవు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఇంకా చాలా జీవితం ఉంది కదా అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. నేను వెళ్లిపోతానంటే.. ఇంత టెన్సన్ పడుతున్నారు. నేను శౌర్య అనే విషయం తెలిసి.. నాటకం ఆడుతున్నారా? అని మనసులో అనుకొన్నది. నేను వెళ్తానంటే మీరు కంగారు ఎందుకు పడుతున్నారు. నాపై మీకు ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్. నేను ఎవరో.. మీరు ఎవరో కదా.. మనం అనుకోకుండా కలిశాం. ఏదో రైల్లో ప్రయాణం చేసినట్టు ఫ్రెండ్‌షిప్ జరిగింది. ఎవరి స్టేషన్ రాగానే వాళ్లు దిగిపోవాలి. జీవితం కూడా అంతే అని జ్వాలా అంది. జ్వాలా మాటలకు స్పందిస్తూ.. అనుకోకుండా కలిసి మనం బాగా కలిసిపోయాం. నిన్ను చూస్తుంటే.. మా కుటుంబంలో ఒక సభ్యురాలిగా అనిపిస్తున్నది అని సౌందర్య అంటే.. నేను ఎవరో వీళ్లకు తెలిసిపోయిందా? అని జ్వాలా మనసులో అనుకొన్నది. కార్తీకదీపం సీరియల్‌ 1395 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  రౌడీలను పోలీసులకు పట్టించి..

  రౌడీలను పోలీసులకు పట్టించి..

  ప్యాసింజర్స్ కోసం జ్వాలా ఆటోతో వెయిట్ చేస్తుంటే.. ఇద్దరు వచ్చి మంగళ్ హాట్‌కు వెళ్లాలని అడిగారు. అయితే ఆ ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తుంటే.. వాళ్లు చేసిన ఐదు లక్షల దొంగతనం గురించి మాట్లాడుకోవడం విన్న జ్వాలా వారిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించింది. పోలీస్ ఇన్స్‌పెక్టర్‌తో జ్వాలా మాట్లాడుతూ.. సార్..వీళ్లిద్దరు దొంగతనం చేసి కోల్‌కత్తాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే వీరిని పట్టి తీసుకొచ్చాను అని చెబితే.. జ్వాలాను పోలీసు అధికారి అభినందించారు. అయితే తమను పట్టించిన జ్వాలాపై ఇద్దరు రౌడీలు కోపంగా చూస్తూ ఉండిపోయారు.

  జ్వాలా, నిరుపమ్ ఒక్కటైతే..

  జ్వాలా, నిరుపమ్ ఒక్కటైతే..

  పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన జ్వాలా మరో ప్యాసింజర్‌ను ఎక్కించుకొని వేరే చోటికి బయలుదేరింది. ప్యాసింజర్ దిగిపోతూ 500 నోటు ఇవ్వగా.. చిల్లర లేదని చెప్పింది. అయితే పక్కనే ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి చిల్లర కోసం అడుగగా.. ఆ వ్యక్తి నిరుపమ్ కావడంతో జ్వాలా ఎమోషనల్ అయింది. అయితే 500 నోటుకు నిరుపమ్ చిల్లర ఇవ్వడంతో ఎమోషనల్ అయింది. డబ్బు తీసుకొంటుంటే.. ఏదో అద్బుతం జరిగి నిరుపమ్, జ్వాలా ఒక్కటైతే బాగుండు అని హిమ మనసులో అనుకొన్నది. డబ్బు తీసుకొని థ్యాంక్స్ అనుకొంటూ జ్వాలా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

  నా జీవితాన్ని లాగేసుకొన్నది అంటూ

  నా జీవితాన్ని లాగేసుకొన్నది అంటూ

  డాక్టర్ నిరుపమ్ ఇచ్చిన డబ్బును చేతిలో ఉంచుకొని.. ఇవి డాక్టర్ సాబ్ ఇచ్చిన డబ్బు.. డాక్టర్ సాబ్ మీ ప్రేమ గురించి ఎన్ని ఊహించుకొన్నాను. మీరు హాస్పిటల్‌కు వెళితే నేను కారు డ్రైవ్ చేద్దామని, నీవు అమెరికాకు వెళితే నీ వెంట రావాలని, డాక్టర్ సాబ్ భార్య అని చాలా సంబరపడ్డాను. తింగరి ఎలా మాట్లాడేది.. నా బాధ్యత అనేది. కానీ చివరకు నా జీవితాన్ని లాగేసుకొన్నది. ఈ నోట్లు డాక్టర్ సాబ్ ఇచ్చాడు. వీటిని నేను ఖర్చు పెట్టను అని వాటిని దేవుడు వద్ద పెట్టి జ్వాలా భావోద్వేగానికి గురైంది. డాక్టర్ సాబ్‌కు దూరంగా ఉండాలని అనుకొన్నాను. ఏమిటి నేను ఇలా ఆలోచిస్తున్నాను. డాక్టర్ సాబ్ నాతో మాట్లాడినవన్నీ అబద్దాలు అయితే బాగుండేది అని జ్వాలా మనసులో అనుకొన్నది.

  ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి

  ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి


  జ్వాలాను నిరుపమ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొన్నాను. కానీ నేను అనుకొన్నది చేయలేకపోతున్నాను అని హిమ మనసులో ఆవేదన చెందుతుంటే.. నిరుపమ్ వచ్చి బయటకు వెళ్దాం పద అంటూ అడిగాడు. అయితే ఎందుకు అని హిమ అంటే.. పెళ్లి షాపింగ్ చేద్దాం పద అని అన్నాడు. నీవు ఎలాంటి ఆందోళన మనసులో పెట్టుకోకు. నీకు మంచి జీవితం అందిస్తాను అంటూ హిమతో నిరుపమ్ అని షాపింగ్‌కు తీసుకెళ్లాడు. అయితే హిమ నిరాశగా కనిపిస్తే.. నీలో ఉత్సాహం చూడాలనుకోవడం తప్పే. మీ క్యాన్సర్ గురించి ఆలోచించడం లేదు.నీవు ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి అని నిరుపమ్ అంటే.. జ్వాలాతో పెళ్లి జరిగితేనే నాకు సంతోషం అని హిమ అనుకొన్నది.

  జ్వాలా ధైర్య సాహసాలకు అవార్డు

  జ్వాలా ధైర్య సాహసాలకు అవార్డు

  ఇదిలా ఉండగా.. జ్వాలా ఇంటికి ఇద్దరు వచ్చి.. మీ వివరాలు కావాలని అడిగారు. మేము క్లబ్ నుంచి వచ్చాం. మీ గురించి పోలీస్ స్టేషన్‌లో చెప్పారు. మీరు ధైర్యం చేసి దొంగలు పట్టించారు. మీరు ధైర్య సాహసాలు చూపించే వారికి హైదరాబాద్ క్లబ్ వాళ్లు మీకు అవార్డు ఇవ్వాలని అనుకొంటున్నది. అయితే నాకు అవార్డు ఎందుకు అని అంటే.. మీ నుంచి స్పూర్తి పొందడానికి అవార్డుల ఇస్తాం. ఇందులో వివరాలు ఉన్నాయి. మీరు అక్కడికి రండి అంటూ ఇన్విటేషన్ ఇచ్చి వెళ్లారు.

  English summary
  Karthika Deepam July 3rd Episode number 1395.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X