Karthika Deepam వంటలక్కకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన మోనిత.. కార్తీక్ ఎదురుగానే..!
కార్తీక్ తనపై అసహనం వ్యక్తం చేయడంపై మోనిత ఆలోచనల్లో పడింది. గత నెల రోజుల్లో కార్తీక్ ఇలా ఎన్నడూ కోపగించుకోలేదు. నేను కోపాన్ని కంట్రోల్ చేసుకొన్నా కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద గొడవకు దారి తీసి ఉండేదో. పైగా దీప అని అన్నాడు. ఇలాగైతే కష్టమే. మనిషిని, మనసును, ఆలోచనలను నా గుప్పిట్లోకి తెచ్చుకొంటే తప్పా.. కార్తీక్ నా గుప్పిట్లో ఉండడు. ఎన్నేళ్లుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఛాన్స్ రాలేదు. ఇప్పుడు అవకాశం ఉంది. దీనిని వదిలేది లేదు అని మోనిత తన ప్లాన్ వేసుకొన్నది. అయితే తలనొప్పిగా ఉంది మంచి కాఫీ తాగితే మంచింది అంటూ రెస్టారెంట్‌లోకి వెళ్లింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1443 లో ఇంకా ఏం జరిగిందంటే?

రెస్టారెంట్‌లో మోనితను చూసిన సౌందర్య
రెస్టారెంట్‌లోకి మోనిత వెళ్లగానే అక్కడ సౌందర్య, హిమ, ఆనందరావు అక్కడే ఉన్నారు. అయితే ముందుగా మోనితను హిమ చూసి నాన్నమ్మకు చెప్పింది. మోనిత అంటీ అని హిమ అంటే.. అది ఇక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించింది. అయితే పక్కకు తిరిగి చూడగానే మోనిత కనిపించగానే సౌందర్య దంపతులు షాక్‌కు గురయ్యారు. మోనిత కూడా చూసి దగ్గరకు వెళ్లి.. హిమ ఎలా ఉన్నావు.. డల్‌గా కనిపిస్తున్నావు అంటే.. మెడిసిన్స్ రాసిస్తాను. వేసుకో తగ్గిపోతుంది అని చెప్పి చిట్టీపై రాసి బేరర్‌కు ఇచ్చింది. ఆ తర్వాత హిమను ఫ్రెష్ అవ్వమని పక్కకు పంపించింది.

తెల్ల చీర కట్టుకొంటే..
ఆ తర్వాత మోనితను చూసి నువ్విక్కడ ఉన్నావేంటి అని అంటే.. చిన్న పని మీద వచ్చాను అని చెప్పింది. దాంతో నీవు పెళ్లి చేసుకొన్నావా? అని అంటే.. కార్తీక్ పోయిన తర్వాత పెళ్లి ఏమిటి అని మోనిత సమాధానం చెప్పింది. అయితే అప్పుడు తెల్ల చీర కట్టుకొని వెళ్లావు. ఇప్పుడు రంగు చీర కట్టుకొన్నావు ఏంటి అని సౌందర్య నిలదీస్తే.. తెల్ల చీరలో ఉంటే.. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. అందుకే రంగు చీర కట్టుకొన్నాను అని మోనిత సర్ది చెప్పుకొన్నది.

మీకు బాధలేదేంటి అంటూ
సౌందర్యను ఉద్దేశించి కానీ మీరేంటి? కొడుకు, కోడలు పోయిన బాధ మీకు లేదు అని మోనిత ఎదురు ప్రశ్న వేసింది. దాంతో మోనిత ఏయ్ అంటూ గట్టిగా అరిచింది. దాంతో బాధ మనసులో ఉంటుంది. ముఖంలో ఉండదని మోనిత ఎదురు సమాధానం చెప్పింది. అంతలోనే కార్తీక్ ఫోన్ రావడంతో కంగారు పడింది. ఏంటీ కార్తీక్ పదేపదే ఫోన్ చేస్తున్నాడు. వాళ్ల ముందు ఫోన్ ఎత్తితే.. అసలు విషయం గుర్తుపడుతారు అని .. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. వెళ్తాను కంగారు పరుగులు పెట్టింది. దాంతో మోనితపై సౌందర్య, ఆనందరావుకు అనుమానం వచ్చింది.

మోనితకు కార్తీక్ ఫోన్
ఇంటి వద్ద మోనిత కోసం చిరాకుగా కార్తీక్ ఎదురు చూస్తున్నాడు. మోనిత కారులో వస్తూ.. సౌందర్య తనను వెంబడిస్తున్నారా? అంటూ అనుమానంతో కారు దిగింది. అయితే ఏంటి.. ఫోన్ చేస్తుంటే.. ఎందుకు ఎత్తడం లేదు. ఫోన్ చేశాడంటే అర్జెంట్ అని తెలియదా అంటే.. నేను మీటింగ్‌లో ఉన్నాను. అందుకే ఫోన్ మాట్లాడటం కుదర్లేదు అని మోనిత అంటే.. పదే పదే చేశానంటే.. అర్జెంట్ అని తెలియదా అని కార్తీక్ అడిగాడు. దాంతో నీవు కాల్స్ చేసి టార్చర్ చేయకు అని మోనిత అంటే.. నేను బయటకు పోయినప్పుడు నాకు కాల్స్ చేసి విసిగిస్తావు కదా.. దానిని ఏమంటావు అని కార్తీక్ అన్నాడు.

హైదరాబాద్‌కు వెళ్దాం అంటూ కార్తీక్
అయితే తాను ఫోన్ చేసింది ఎందుకంటే.. హైదరాబాద్‌కు వెళ్లిపోదాం అని కార్తీక్ అనగానే... మోనిత కంగారు పడింది. ఎందుకు.. ఇక్కడ బోటిక్ ఉంది కదా అని అంటే.. హైదరాబాద్‌లో బోటిక్ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఉంది. అందుకే అక్కడికి వెళ్దాం అని కార్తీక్ అన్నాడు. దాంతో మోనిత మరింత కంగారుపడింది. హైదరాబాద్‌లో చాలా పొల్యూషన్ ఉంది. ఇక్కడే ఉందాం అని మోనిత చెప్పింది. కార్తీక్ హైదరాబాద్‌కు వెళితే.. ప్రతీ ఒక్కరు గుర్తుపడుతారు. అప్పుడు ఇంకా డేంజర్ ఉంటుంది అని మోనిత చెప్పింది.

మోనిత బండారం బయటకు
ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో మరో ట్విస్టు ఇచ్చారు. కార్తీక్ కోసం వెతుకుతున్న దీపకు రోడ్డుపై డాక్టర్ బాబు కనిపించాడు. దాంతో కార్తీక్ కారును వెంబడించి.. కార్తీక్ ఉన్న బోటిక్ వద్దకు వెళ్లింది. డాక్టర్ బాబు అంటూ పరుగులు పెట్టింది. అయితే ఎవరు మీరు అంటూ డాక్టర్ బాబు కంగారు పడ్డారు. అంతలోనే ఏం జరుగుతుంది అని మోనిత అక్కడకు వచ్చింది. మోనితను చూడగానే దీప షాక్ గురైంది.


Click it and Unblock the Notifications











