Karthika Deepam బోనం ఎత్తిన సౌందర్య, హిమ, శౌర్య.. అమ్మా బైలిళ్లినాదే తీన్మార్ డ్యాన్సులతో
బోనాలు పండుగ కోసం షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ప్రేమ్ ప్లాన్ వేసి.. నిరుపమ్, శౌర్యను ఒకే కారులో ప్రయాణించేలా చేశాడు. ఒకే కారులో ప్రయాణిస్తున్నప్పటికీ నిరుపమ్, శౌర్య మధ్య మౌనం రాజ్యమేలింది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపమ్ తన మనసులో మాట్లాడుకొంటూ.. పాపం శౌర్య మనసులో బాధ ఉండవచ్చు. నా వైపు నుంచి ఎలాంటి తప్పు చేయలేదు అని అనుకొన్నాడు. అదే సమయంలో నేను ఎవరిని మోసం చేయలేదు. నేను ఎందుకు బాధపడాలి అని శౌర్య అనుకొని.. కాస్త హుషారును తెచ్చుకొని తన ఫ్రెండ్ సుమతికి ఫోన్ చేసింది. కార్తీకదీపం సీరియల్ 1410 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

నిరుపమ్‌ను రెచ్చగొట్టేలా శౌర్య
సుమతితో శౌర్య ఫోన్‌లో మాట్లాడుతూ.. మా బాబాయ్ ఎప్పుడూ చెబుతుంటే వాడు. మనిషి కంటే కాలం చాలా బలమైంది. మన టైమ్ బాగుంటే.. అన్నీ బాగుంటాయి. మన టైమ్ బాగలేకపోతే.. అన్నీ బాగుండవు. ఈ రోజు ఆటో డ్రైవర్ కావొచ్చు. కాలం కలిసి వస్తే.. మనం కారు ఓనర్ కావొచ్చు. ఇప్పుడు కారు ఓనర్.. మనకు డ్రైవర్ కావొచ్చు. కాబట్టి ఆటో నడుపుతున్నానని బాధపడకు అని అంది. శౌర్య మాటలను విన్న తర్వాత ఆమె ఏమిటి? ఇలా మాట్లాడుతున్నది అని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు. ఇక మనసులో ఉన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చి శౌర్యతో.. ఏమిటి నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు.

ముందు, వెనుకా చూసుకో అంటూ
డాక్టర్ సాబ్.. నేను నిన్ను ఏమీ అనడం లేదు అని శౌర్య అంటే.. నేను కారు నడుపుతుంటే.. దర్జాగా వెనుక సీట్లో కూర్చొని నాపై సెటైర్లు వేస్తున్నావా అని నిరుపమ్ అన్నాడు. దాంతో నా స్థాయి కారు కాదని చెబుతున్నావా? కావాలంటే నేను దిగిపోతాను. ప్రేమ్ బలవంతం మీద నేను కారు ఎక్కానే తప్ప.. నా అంతట నేను ఎక్కలేదు అని శౌర్య చెప్పింది. అయితే ఉన్నట్టుండి కారు ఆగిపోవడంతో.. నన్ను దిగిపొమ్మని చెబుతున్నావా అంటూ కారు డోర్ తీసి కాలు బయటపెట్టింది. తీరా చూస్తే.. తన ఇంటికి వచ్చేసినట్టు స్పష్టంగా అర్దమైంది. దాంతో ఇంటికి వచ్చేశామా? నేను చూసుకోలేదు అంటే..అవును.. అందుకు వెనుకా? ముందు చూసుకొని మాట్లాడాలి అని శౌర్యకు నిరుపమ్ క్లాస్ పీకాడు.

నిరుపమ్‌కు ఫోన్ తిరిగి ఇచ్చేసిన శౌర్య
షాపింగ్ ముగించుకొని అందరూ ఇంటికి రావడంతో.. ప్రేమ్‌ను ఉద్దేశించి.. అరేయ్ వచ్చేయ్.. ఇంటికి వెళ్దాం అంటే.. కాసేపు ఆగి వెళ్దాం అని ప్రేమ్ సమాధానం ఇచ్చాడు. సౌందర్య కూడా కాసేపు ఆగి వెళ్లు అంటే.. లేదు.. నాకు చాలా పని ఉంది అని నిరుపమ్ చెబుతుంటే.. డాక్టర్ సాబ్.. అని పిలిచి దగ్గరగా వెళ్లింది. నిరుపమ్ చేతిని తన చేతిలోకి తీసుకొని.. చూస్తుండగా.. హిమ ఇతర కుటుంబ సభ్యులు శౌర్య ఏం చేస్తుందని ఊపిరి బిగపట్టుకొని చూస్తున్నారు. ఆ సమయంలో తన చేతిలోని ఫోన్ తీసి.. నిరుపమ్ చేతిలో పెట్టి.. నీవు ఇచ్చిన గిఫ్టు.. ఎప్పటి నుంచో ఇద్దామని అనుకొంటున్నాను. ఇప్పుడు ఇలా కుదిరింది. మీ ఫోన్ మీరు తీసుకొండి అని శౌర్య ఘాటుగా చెప్పింది. ఆ సంఘటనను చూసి.. వీళ్లిద్దరిని కలపడం చాలా కష్టమే అని ప్రేమ్ అనుకొన్నాడు. దేవుడా.. శౌర్య ఇంత కోపంగా ఉందేమిటి అని హిమ మనసులో అనుకొన్నది.

బొనం ఎత్తుకొంటే.. నీ నా పక్కన ఉండేలా
శౌర్య, నిరుపమ్ మధ్య జరిగిన సంఘటనను చూసి ఆనందరావు కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. భర్త ఏదో బాధలో ఉన్నాడని గ్రహించిన సౌందర్య.. ఏంటండి ఇలా ఉన్నారు అని అడిగితే.. నా పేరు ఆనందరావు అని పెట్టారు కానీ.. నా జీవితంలో ఆనందమే లేదు అని అన్నాడు. అయితే ఎందుకు అలా బాధపడుతారు.. ఎప్పుడో పోయిన శౌర్య ఇంటికి తిరిగి వచ్చింది కదా.. ఇప్పుడు మీరు ఎందుకలా బాధపడుతారు అంటే.. పెద్ద కొడుకు, కోడలు గుర్తుకు వచ్చారు. శౌర్య వచ్చిందని ఆనందపడాలో.. హిమతో గొడవ పడుతున్నదని బాధపడాలో తెలియడం లేదు అని ఆనందరావు అన్నాడు. దాంతో బాధలు పక్కన పెట్టి.. బోనాలు పండుగ చేసుకొందాం. నేను బోనం ఎత్తితే.. నా పక్కన నిలబడాలి. మనం వెళ్లే అమ్మవారి ఆలయం శక్తిమంతమైనది. అంతా మంచి జరుగాలని కోరుకొందా అని సౌందర్య చెప్పడంతో ఆనందరావు హ్యాపీగా ఫీలయ్యాడు.

నేను అందరితో కలువలేను అంటూ
ఇక సౌందర్య ఇంటిలో బోనాల పండుగ జోష్ కనిపించింది. అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి .. పొయ్యి.. పొయ్యిపై అలకరించిన బోనం కుండను పెట్టి.. ప్రతీ ఒక్కరితో బియ్యం పోయించి మొక్కించింది. ఆ తర్వాత బోనం ఎత్తుకొని బయలుదేరగా.. శౌర్య బాబాయ్ తీన్మార్ డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా అమ్మవారి ఆలయానికి చేరిపోయారు. అయితే బోనం ఎత్తుకొని వెళ్తుండగా.. నిరుపమ్, శౌర్యను ఒకే ఫ్రేమ్‌లో బంధించడానికి ప్రేమ్ రకరకాలుగా ప్రయత్నించాడు. అయితే శౌర్య ముఖంలో కోపం చూసి నిరుపమ్ దూరంగా నడుస్తూ కనిపించాడు. దాంతో నువ్వెంటిరా.. దూరంగా ఉంటావు.. దగ్గరగా రారా అని ప్రేమ అంటే.. కొన్ని పనులు నాతో కావురా.. నేను అందరితో కలువలేను అని నిరుపమ్ చెప్పాడు. దాంతో నిన్ను, శౌర్యను ఎలా కలుపాలో మేము చూసుకొంటాం అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు.

మీరు మనసులో కోరికను కోరుకొంటే..
బోనం ఎత్తుకొని సౌందర్య, హిమ, శౌర్య అమ్మవారి ఆలయానికి చేరుకొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి పూజారి దీవెనలు అందుకొన్నారు. ఈ అమ్మవారు శక్తి కలిగిన వారు. ఇక్కడ ఆచారం ప్రకారం.. మనసులో ఏదైనా కోరుకొని చీటిపై రాసి కుండలో వేస్తే.. అది తప్పకుండా నెరవేరుతుంది అని అందరూ నమ్ముతుంటారు. కాబట్టి మీరు చీటీలపై ఏవైనా కోరికలు ఉంటే.. మీరు కోరుకోండి అని పూజారి చెబితే.. నా జీవితంలో కోరుకోవడానికి ఏమీ మిగిలి ఉంది అని శౌర్య అనుకొన్నది. హిమ, శైర్యను కలపడమే నా కోరిక అంటూ సౌందర్య మనసులో అనుకొన్నది.

కార్తీకదీపం తాజా ప్రోమోలో
తాజా ప్రోమోలో సౌందర్యతోపాటు అందరూ చీటీలను తీసుకొని తమ మనసులోని మాటను రాసి కుండలో వేశారు. శౌర్య, బావ పెళ్లి చేసుకోవాలి అంటూ హిమ చీటిపై రాసి కుండలో వేసింది. ఆ తర్వాత శౌర్య రాసి అందులో వేసింది. అయితే ఆ కుండలోని చీటిని చూసి చదివిన హిమ షాక్ గురైంది. అలా షాక్ గురి చేసిన విషయం ఏమిటనేది తెలియాలంటే.. తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











