twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఐ లవ్ యూ చెప్పిన నిరుపమ్.. ఆనందంతో హిమను కౌగిలించుకొన్న శౌర్య.. అసలేం జరిగిందంటే?

    |

    భోజనం చేయడానికి సిద్దమైన సమయంలో టేబుల్‌పై ఆనందరావు, సౌందర్య, శౌర్య తినడానికి సిద్దమవుతుంటే.. హిమ పక్కకు వెళ్తూ తర్వాత తింటానని చెప్పింది. అయితే అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మంటే.. లేదు.. మీరు తినండి అంటూ వెళ్లిపోతుంటే.. హిమకు నా ముందు కూర్చొనే ధైర్యం లేదనుకొంటా, అందుకే తర్వాత తింటానని అంటున్నది అని మనసులో శౌర్య అనుకొంది. ఫర్వాలేదు. వచ్చి కూర్చొని తినమని చెప్పండి.. నా ఎదురుగా కూర్చొని తినమని చెప్పండి. నా కళ్లలోకి చూస్తూ తింటూ నాకు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకోమని చెప్పండి అని శౌర్య ఘాటుగా స్పందించింది. శౌర్య మాటలకు సౌందర్య, హిమ, ఆనందరావు ఆశ్చర్యపోయారు. నన్ను చూస్తుంటే.. ఆ ద్రోహం గుర్తుకు రావాలి. తినే ప్రతీ ముద్దకు నా కడుపు నిండాలి. చూసే ప్రతీసారి నా కడుపు మంట తెలుస్తుంది అని శౌర్య తనలోని కోపాన్ని వెళ్లగక్కింది. కార్తీకదీపం సీరియల్ 1405 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

     చిక్కు ముడులన్నీ నీవే విప్పాలి అంటూ

    చిక్కు ముడులన్నీ నీవే విప్పాలి అంటూ

    ఇక జ్వాలానే శౌర్య అని తెలిసిన నిరుపమ్‌లో రకరకాల ఆలోచనలు వచ్చాయి. నిన్ను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదు. మొదటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు. ఎంగేజ్‌మెంట్ రోజున పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోయింది. కానీ మనసు చంపుకొని ఇప్పుడు జ్వాలాను పెళ్లి చేసుకోమంటున్నావు. ఎందుకిదంతా చేస్తున్నావు. జ్వాలానే శౌర్య అని ఇప్పుడే తెలిసిందే. నీ మనసులో ఏముందో తెలుసుకొంటాను. ఈ గందరగోళం ఏమిటో అర్దం కావడం లేదు. శుభలేఖల వరకు వచ్చిన ఈ పెళ్లిని పీటల వరకు తీసుకెళ్లడం కష్టం కాదు. కానీ ఈ చిక్కు ముడులన్నీ నువ్వే విప్పాలి అని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు.

     క్యాన్సర్ అని నాటకం

    క్యాన్సర్ అని నాటకం


    శౌర్య నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టడం గొప్ప ఆనందం. కానీ నీ కోపం ఎప్పుడు తీరుతుందో అర్ధం కావడం లేదు. నీ చూపులను తట్టుకోవడం కష్టం అవుతుంది. చిన్నప్పుడు ఎంత బాగా కలిసి ఉండేవాళ్లం. ఇప్పుడు ఇలా అయ్యాం. జ్వాలాతో పెళ్లి చేయడానికి నాకు క్యాన్సర్ అని నాటకం ఆడాను. కానీ ఆ విషయం నీకు తెలియడం లేదు. నేను బావను నేను పెళ్లి చేసుకొంటానని అనుకొంటున్నావు. నీకు నిజం చెప్పాలి. నీ మనసులో ఉన్న కోపాన్ని నేనే తగ్గించాలి అని హిమ అనుకొన్నది. ఇదిలా ఉండగా, హిమ, శౌర్య మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుంది సౌందర్య అంటూ ఆనందరావు అంటే.. ఇంట్లోకి రాగా ఎలాంటి ప్రయత్నాలు చేయకండి అని సౌందర్య సూచించింది.

     డ్రస్సులు వేసుకొన్నంత మాత్రన..

    డ్రస్సులు వేసుకొన్నంత మాత్రన..


    హిమ, శౌర్యలకు ఒకే కలర్ డ్రస్‌ను ఆనందరావు, సౌందర్య ఇచ్చారు. వాటిని వేసుకొని వచ్చిన శౌర్య, హిమ ఒకరినొకరు చూసుకొన్నారు. శౌర్యకు కోపం వస్తే ఎలా హిమ అనుకొని వెళ్లిపోతుంటే.. ఆగు.. నానమ్మ ఏంటి? అని అడిగితే.. మీ డ్రస్‌లు వాషింగ్‌కు ఇచ్చాం. ఇద్దరికి కొత్త డ్రస్సులు ఇచ్చాం అని ఆనందరావు సమాధానం చెప్పారు. అయితే డ్రస్సులు కొత్తవి అయినంత మాత్రాన మనసులు కలుస్తాయా? అవి ఒకటి అవుతాయని ఎలా అవుతాయని అనుకొంటారు. ఇందతా నీ ప్లానేనా అని హిమపై శౌర్య అరిచింది. అయితే హిమ ఏదో చెప్పబోగా.. నీవు మాట్లాడొద్దు.. నేను మాట్లాడితే వినాల్సిందే. ఇలాంటి పిచ్చి పనులు చేయకు.. నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని శౌర్య వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. శౌర్య వార్నింగ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే.. హిమకు నిరుపమ్ నుంచి కాల్ వచ్చింది. నేనే మిమ్మల్ని కలువడానికి వస్తున్ానను అని హిమ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

     శౌర్యను ఇన్వాల్వ్ చేయకు..

    శౌర్యను ఇన్వాల్వ్ చేయకు..


    హిమ, నిరుపమ్ ఒక హోటల్లో కలుసుకొన్నారు. అయితే హిమ మాట్లాడటానికి భయపడుతుంటే.. నిరుపమ్ జోక్యం చేసుకొంటూ.. హిమ నీ మనసులో ఏముందో తెలియదు కానీ.. కానీ నేను చెప్పేది విను. హిమ నా పెళ్లి నీతోనే జరుగుతుంది. వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేశాం. కార్డులు డిస్టిబ్యూషన్ చేశాం. కానీ మళ్లీ నీవు శౌర్య టాపిక్ తెస్తున్నావు. ఇంకోసారి పెళ్లి విషయంలో నీవు శౌర్యను ఇన్వాల్వ్ చేయకు హిమ అని నిరుపమ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే బావ మూడ్ బాగాలేదనుకొంటా. ఇప్పుడు బావకు కోపం రాకుండా చూసుకోవాలి. కోపం వచ్చి పెళ్లిని క్యాన్సల్ చేసే ప్రమాదం ఉంది. అందుకే మూడ్ బాగాలేనప్పుడు చెప్పకపోవడమే మంచిది అని హిమ మనసులో అనుకొంటుంటే శౌర్య అక్కడికి వచ్చింది. నిరుపమ్‌తో హిమ కలిసి ఉండటాన్ని శౌర్య కోపంగా చూసి వెళ్లిపోయింది.

    డైరెక్టుగా చంపేయ్ అంటూ

    డైరెక్టుగా చంపేయ్ అంటూ


    ఇంట్లోకి విసురుగా వచ్చిన శౌర్య కోపంతో తన గదికి వెళ్లిపోబోయింది. అప్పడే వచ్చావు ఎందుకు అని నానమ్మ ప్రశ్నిస్తే. తొందరగా రావొద్దని రూల్ ఉందా; అయితే మీరు ఒక ఎస్సెమ్మెస్ పంపండి.. అప్పుడే వస్తాను అని కోపగించుకొన్నది. ఇంట్లోకి వెళ్లి శౌర్య ఫోటోపై బాణాలు విసురుతూ కోపాన్ని ప్రదర్శించింది. అయితే కోపం ఉంటే నన్ను డైరెక్టుగా చంపేయ్.. అలా బాణాలు విసిరితే నీ కోపం చల్లారుతుందా అని హిమ నిలదీసింది.

    ఇష్టం కాదు.. ప్రాణం బావ అంటూ నిరుపమ్‌తో

    ఇష్టం కాదు.. ప్రాణం బావ అంటూ నిరుపమ్‌తో


    అయితే తాజా ప్రోమోలో హిమ, శౌర్య కలిసిపోవడం మరో ట్విస్టుగా మారింది. అయితే ఒకే కలర్ డ్రస్‌ వేసుకొన్న హిమ, శౌర్య విషయంలో నిరుపమ్ పొరపడ్డారు. హిమ అనుకొని వెనుక నుంచి వెళ్లి శౌర్యకు ఐలవ్ యూ చెప్పాడు. అయితే శౌర్యను చూసి షాక్ అయ్యాడు. అయితే నీవు అంటే శౌర్యకు ఇష్టం కాదు బావ.. ప్రాణం అని హిమ చెబితే..నేను పెళ్లి చేసుకొంటే శౌర్య సంతోషపడుతుందో ఏమో.. కానీ నా సంతోషం మాట ఏమిటి అని నిరుపమ్‌ ఘాటుగా స్పందించాడు.నా మీద ప్రేమ ఉంటే.. ఆ మాత్రం చేయవా అని అంది. అయితే నిరుపమ్ బావతో ఎలాగైనా జ్వాలా పెళ్లి చేస్తాను అని నానమ్మకు హిమ సమాధానం చెప్పింది. అయితే నిరుపమ్‌తో పెళ్లికి ప్రయత్నిస్తున్న హిమను అర్ధం చేసుకొన్నది. వెంటనే వెళ్లి హిమను, శౌర్య కౌగిలించుకొన్నది.

    English summary
    Karthika Deepam July 15th Episode number 1405.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X