twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నేను చనిపోయిన తర్వాతైనా.. తాత మాటలతో శౌర్య షాకింగ్ నిర్ణయం

    |

    శౌర్య నిద్రలేచి నేను ఎక్కడున్నాను అంటూ కంగారుపడిపోయింది. తాను నానమ్మ, తాతయ్య ఇంటిలో ఉన్నానని తెలుసుకొన్న తర్వాత నాకు ఏమైంది అంటూ ఆందోళన చెందింది. అంతలోనే నానమ్మ, తాతయ్య, హిమ రావడంతో.. నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నించింది. దాంతో నువ్వు మా ఇంటికి వచ్చావు అని సౌందర్య చెప్పింది. నన్నెవరు మీ ఇంటికి తీసుకొచ్చారు అంటే.. ఇంకా పరాయివాళ్ల మాదిరిగా ఎందుకు చూస్తావు అని శౌర్య అంటే.. నీకు జ్వరం ఉంటే.. నీకు ట్రీట్‌మెంట్ చేసి హిమ ఇక్కడికి తీసుకొచ్చింది. మన మధ్య రక్త సంబంధం ఉందనే విషయం గుర్తు పెట్టుకో అని ఆనందరావు అంటే.. బంధాలు లేవు.. రక్త సంబంధాలు లేవు. నేనెవరో.. మీరెవరో. తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ చేసినందుకు డబుల్ ఫీజ్ ముఖాన కొడుతాను అంటూ శౌర్య ఘాటుగా స్పందించింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1401 ఇంకా ఏం జరిగిందంటే..

    ఫీజు ముఖానికి కొడుతావా అంటూ సౌందర్య

    ఫీజు ముఖానికి కొడుతావా అంటూ సౌందర్య

    శౌర్య మాటలకు అడ్డుపడుతూ.. ఏంటీ ఫీజు ముఖానికి కొడుతావా? నీకు ఓ డాక్టర్‌గా ట్రీట్‌మెంట్ చేయలేదు. సొంత చెల్లెలిగా చూసుకొన్నది. రాత్రంతా నీ పక్కనే ఉంటూ.. టెంపరేచర్‌ చెక్ చేసింది అని సౌందర్య అంటే.. అయిందా? ఇంకా ఏమైనా ఉందా? నువ్వు తెలివైన దానివని, మాటకారివని నాకు తెలుసు. నీ మాటలతో నన్ను ఇక్కడే ఉంచాలని ప్రయత్నిస్తున్నారు అని శౌర్య ప్రశ్నించింది. అయిందేదో అయిపోయింది. అన్నీ మరిచిపోయి ఇక్కడే ఉండిపో అని ఆనందరావు అంటే.. పోయింది రూపాయో ఏదో కాదు.. నా జీవితం, నేను ప్రేమను కోల్పోయాను. మీరంతా మోసం చేశారు. మిమల్ని చూస్తే కంపరం వేస్తున్నది అని శౌర్య అంటే.. జరిగిదేమిటో నీకు తెలియదు అని సౌందర్య అడ్డుపడింది.

    కల్లిబొల్లి కథలు చెప్పొద్దు అంటూ శౌర్య

    కల్లిబొల్లి కథలు చెప్పొద్దు అంటూ శౌర్య

    అయితే నాన్నమ్మ మాటలను పక్కన పెడుతూ.. జరిగిందేమిటో చెప్పి మీరు నన్ను కల్లిబొల్లి కథలు చెప్పవద్దు. చిన్నప్పుడు మీరు బంగారు కడియం..పులి కథ చెప్పావు కదా.. ఈ కథలో హిమ పులి.. నేను ఆమెకు బలి అయ్యాను. నా అమ్మ, నాన్నలను బలితీసుకొన్నది. దాన్ని ఎలా మరిచిపోతాను. ఇప్పుడు జ్వరం వస్తే.. అన్నీ మరిచిపోయి కలిసిపోవాలా? అని అంటే.. ఇవన్నీ మరిచిపోయి కలిసిపోదాం. నీవు అమ్మ, నాన్నలను పొగొట్టుకొని నీవు బాధపడుతున్నావు. కానీ చనిపోయింది నా కొడుకు. నేను ఎంత బాధపడాలి. నీ వైపు నుంచే కాదు.. మా వైపు నుంచి కూడా ఆలోచించు. ఒకసారి మా గురించి కూడా ఆలోచించు అంటూ సౌందర్య, ఆనందరావు అన్నారు. అయితే నేను జీవితంలో మళ్లీ మళ్లీ మోసపోను అంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది.

    నేను చనిపోయిన తర్వాతైనా

    నేను చనిపోయిన తర్వాతైనా

    ఇంటి నుంచి వెళ్లిపోతుంటే.. చేయి పట్టుకొని ఆపి.. ఒక్క నిమిషం నా మాట విను. కార్తీక్, దీప ఫోటోలను చూపిస్తూ.. ప్రతీ రోజు నేను ఇక్కడే గడుపుతాను. ప్రతీ రోజు మీ గురించి ఆలోచిస్తూ కంటతడి పెట్టుకొంటాను. చివరకు నీవే శౌర్య అని చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాను. త్వరలోనే వస్తావని, గుండెలకు హత్తుకొంటావని..నాతో కబుర్లు చెబుతావని అనుకొన్నాను. కానీ ఇలా మాట్లాడుతావని అనుకోలేదు. నీవు కనిపించనపుడు.. దేవుడా నా మనవరాలు మా ఇంటికి వచ్చేలా చేయమని కోరుకొనే వాడిని. ఇప్పుడు నేను పోయిన తర్వాత నా ఇంటికి వచ్చేలా చేయమని కోరుకొంటాను అని ఆనందరావు బాధపడ్డారు.

    నేను మీతోనే ఉంటాను అంటూ శౌర్య

    నేను మీతోనే ఉంటాను అంటూ శౌర్య

    అయితే తాతయ్య ఆనందరావు మాటలను పట్టించుకోకుండా.. నేను వెళ్తాను అని శౌర్య చెప్పింది. అయితే ఇన్ని చెప్పినా ఉండలేవా అంటే.. నేను వెళ్లి ఆటో తెచ్చుకోవాలి. నా సామాన్లు తెచ్చుకోవాలి కదా అని శౌర్య అంది. అయితే నేను నాలానే ఉంటాను. ఆటోను నడుపతాను. నా కోపం తగ్గదు అంటూ శౌర్య చెప్పింది. దాంతో ఆనందరావు, సౌందర్య, హిమ ఆనందంలో మునిగిపోయారు.

    హిమకు క్యాన్సర్ లేదనే విషయంపై

    హిమకు క్యాన్సర్ లేదనే విషయంపై


    ఇక శోభ, స్వప్న ఇద్దరిలో కంగారు మొదలైంది. నిరుపమ్ పెళ్లి తేది దగ్గరకు వస్తున్న సమయంలో వారిద్దరిలో ఏమీ తోచని పరిస్థితి ఎదురైంది. నేను చాలా డిస్టర్బ్‌గా ఉన్నాను. ఒక్క మాట అడుగుతా.. మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు నన్ను కోడలిగా చేసుకోవాలని మీకు ఉందా? అని శోభ అంటే.. అందులో ఎలాంటి అనుమానం లేదు అని స్వప్న సమాధానం ఇచ్చింది. అయితే హిమను నిరుపమ్ బతికించుకొంటానని అంటున్నాడు అని శోభ అంటే.. వాడి మాటలు అంతగా పట్టించుకోవద్దు. హిమ చనిపోతుందని సానుభూతితో మాట్లాడుతున్నాడు అని చెప్పింది. అయితే హిమ గురించి మీకు తెలియదు అంటే.. ఎవరు ఉంటారో.. ఎవరు చనిపోతారో మీకే తెలుస్తుందని ఓ రిపోర్టు చేతిలో పెట్టింది. ఆ రిపోర్టు చదివిన తర్వాత స్వప్న కోపంతో ఊగిపోయింది.

    శౌర్యలో కోపం తగ్గిస్తాను అంటూ

    శౌర్యలో కోపం తగ్గిస్తాను అంటూ

    దేవుడి పటాల ముందు పూజ చేస్తూ.. శౌర్య గురించి హిమ ఆలోచించింది. శౌర్యకు నా మీద కోపం ఉందని బాధపడాలా.. ఏదో తెలియడం లేదు. కానీ శౌర్యను ఇంటికి వరకు తీసుకొచ్చాను. ఇక నిరుపమ్, శౌర్య పెళ్లి గురించే ఆలోచించాలి. శౌర్యలో కోపం తగ్గించడమే కాకుండా మనసు మార్చాలి. తప్పకుండా మార్చుతానని తన తల్లిదండ్రుల పటాల ముందు మనసులో అనుకొన్నది. ఇక శౌర్యకు జరిగిందంతా చెప్పేస్తాను. నా తప్పేమీ లేదని చెబుతాను అంటే.. సమయం సందర్భం చూసి చెప్పు అని నానమ్మ సలహా ఇచ్చింది. దాంతో అన్నీ చెప్పేస్తాను అని హిమ చెప్పింది.

    English summary
    Karthika Deepam July 12th Episode number 1401.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X