Karthika Deepam డాక్టర్ సాబ్ అసహనం.. రౌడీ కోపంతో.. ఒకే గదిలో నిరుపమ్, శౌర్య హైడ్రామా

దుండగులను ఎదురించి కిడ్నాప్‌కు గురైన శౌర్యను నిరుపమ్ విడిపించారు. అయితే దుండగులు పారిపోతూ నిరుపమ్, శౌర్యను గదిలో బంధించారు. అయితే నిరుపమ్, శౌర్యను ఒకే గదిలో కాసేపు ఉంచితే.. వారి మధ్య ప్రేమ పెరుగుతుందని ప్రేమ్ ప్లాన్ చేసి.. ఇంటికి పెద్ద తాళం వేసారని అబద్ధం ఆడాడు. అయితే తాళం పగలకొట్టడం రాదా.. నువ్వేం మగాడివి అని శౌర్య అంటే.. హలో, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని ప్రేమ్ సమాధానం చెప్పాడు.

తాళం పగలకపోతే రాత్రికి మీరిద్దరి లోపలే.. మేము బయటే ఉంటామని ప్రేమ్ నాటకం ఆడాడు. గదిలో ఉంటే మీ మధ్య ప్రేమ చిగురిస్తుంది.. బయట మా ప్రేమ మొదలవుతుంది అని ప్రేమ్ అన్నాడు. కార్తీకదీపం సీరియల్ 1420 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

మళ్లీ శౌర్య వెళ్లిపోయిందా?

మళ్లీ శౌర్య వెళ్లిపోయిందా?

శౌర్య కనిపించకుండా పోవడంతో సౌందర్య, ఆనందరావు కంగారు పడ్డారు. మళ్లీ శౌర్య వెళ్లిపోయిందా? మళ్లీ వస్తుందా? రాదా? అని ఆనందరావు ఆందోళన పడుతున్న నేపథ్యంలో హిమ కాల్ చేసింది. శౌర్య సేఫ్‌గా ఉంది. రావడానికి కొంత సమయం పడుతుంది అని హిమ చెప్పింది. అయితే మీరు ఇక్కడికి రావొద్దు. మేమే తీసుకొస్తాం. మీరేమి కంగారు పడకు అని ప్రేమ్ చెప్పాడు. దాంతో ఆనందరావు, సౌందర్య సంతోషంలో మునిగిపోయారు.

నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు

నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు

గది లోపల ఉన్న నిరుపమ్ త్వరగా తీయమని గొడవ పెట్టాడు. అయితే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని ప్రేమ్ చెప్పాడు. అయితే నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని నిరుపమ్ అడిగితే.. నేను వాళ్లను దొంగతనం కేసులో పోలీసులకు పట్టించాను. దాంతో వాళ్లు నన్ను కిడ్నాప్ చేశారు అని శౌర్య చెబితే.. దొంగలను పట్టించినందుకు శౌర్యకు అవార్డు కూడా ఇచ్చారు అని బయట నుంచి హిమ చెప్పింది.

పక్కాగా ప్లాన్ చేస్తే

పక్కాగా ప్లాన్ చేస్తే


ఇక శౌర్య కిడ్నాప్ వ్యవహారం ఫెయిల్ కావడంపై డాక్టర్ శోభ అసహనంతో ఊగిపోయింది. పక్కాగా ప్లాన్ చేస్తే పాడైపోయింది. ఆ సమయంలో నిరుపమ్ ఎందుకు వెళ్లాడు. నిరుపమ్‌ను దక్కించుకోవడానికి నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి. పెళ్లి విషయంలో స్వప్న నాకు ఎలాంటి సహాయం చేసే పరిస్థితి కనిపించడం లేదు. నేనే ఏదో ప్లాన్ చేయాలి అంటూ మరో కుట్రకు ప్లాన్ చేయడానికి సిద్ధమైంది.

దోమలకా? మనుషులకా?

దోమలకా? మనుషులకా?


గదిలో నిరుపమ్, శౌర్య మధ్య మౌనం కనిపించింది. ఆకలి, నిద్రతో నిరుపమ్ అసహనం వ్యక్తం చేశాడు.నీకు దోమలు కుట్టడం లేదా అంటే.. దోమలు అన్నాక కుట్టకుండా ఉంటాయా? ఇంట్లో దోమలు కాకుండా సీతాకోక చిలుకలు ఉంటాయా? అని శౌర్య సెటైర్ వేసింది. దోమలు కుడితే జ్వరం వస్తుంది తెలుసా అంటే.. దోమలకా? మనుషులకా? అని మళ్లీ సెటైర్ వేసింది. అయితే నాకు దోమల కంటే.. మనుషులు కుట్టిన బాధే ఎక్కువగా ఉంది అని శౌర్య అంది. అయితే నీవు బాగానే మాట్లాడుతావు. ఇప్పటి వరకు ఆకలి అన్నావు. ఆకలి వేయడం లేదా? అని అడిగాడు. అంతలోనే ప్రేమ్ ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి.. ఇద్దరు షేర్ చేసుకొనేలా ప్లాన్ చేశాడు. బిర్యానీ తెచ్చినందుకు శౌర్య డబ్బులు ఇచ్చింది.

 రుపమ్, శౌర్య మధ్య విభేదాలు

రుపమ్, శౌర్య మధ్య విభేదాలు


ఇక కార్తీకదీపం తాజా ప్రోమోలో నిరుపమ్, శౌర్య మధ్య చిన్నపాటి విభేదాలు గదిలో జరిగాయి. దోమలు కుట్టుతుంటే.. శౌర్య దుప్పటిని నిరుపమ్‌పైన కప్పింది. నీకు ఇది కొత్త.. మాకు అలవాటే అంది. అయితే ఈ గదిలో నీవు కాకుండా హిమ ఉండి ఉంటే.. నేను చాలా కంఫర్ట్‌గా ఉండేవాడిని అని నిరుపమ్ అంటే.. శౌర్య బాధపడింది. నా ప్లేస్‌ను హిమ తీసుకొంది కదా అని శౌర్య మనసులో అనుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X