Karthika Deepam లో భారీ ట్విస్టు.. వాళ్లను నీవు చంపావని హిమపై కోపంతో శౌర్య షాకింగ్ నిర్ణయం

తల్లిదండ్రులు కళ్లముందే చనిపోయిన దృశ్యాలను శౌర్య జీర్ణించుకోలేకపోయింది. కార్తీక్, దీప ఫోటోల ముందు నిలబడి భోరున విలపిస్తుంటే.. ఆదిత్య, శ్రావ్య వచ్చి ఓదార్చారు. ఏమీ తినకుండా ఇలా ఉంటే ఎలా అంటూ సర్దిచెప్పబోయారు. అయితే అందుకు శౌర్య మొండికేసింది. తాతయ్య ఆనందరావు కూడా వచ్చి ఓదార్చాడు. భోజనం చేసి శౌర్య అంటూ బుజ్జగించాడు. అయితే నా కళ్ల ముందే అమ్మా, నాన్న ఉన్న కారు లోయలో పడింది. వాళ్లు నా కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని నేను ఎలా దిగమింగుకోవాలి అంటూ శౌర్య ప్రశ్నించింది. అయితే అంతలోనే రోడ్డుపై తిరుగుతున్న హిమను తీసుకొని సౌందర్య ఇంటిలోకి అడుగుపెట్టింది. కార్తీక దీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1304లో ఇంకా ఏమి జరిగిందంటే..

 హిమ రాకతో ఇంటిలో ఆనందం

హిమ రాకతో ఇంటిలో ఆనందం

తాతయ్య అంటూ సౌందర్య కూతురు కొడుకులిద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. వారిని చూడగానే మీరు ఎప్పుడు వచ్చారు అంటూ ఆనందరావు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అమ్మమ్మ తీసుకు వచ్చారంటూ చెప్పగానే.. వారి వెనుక సౌందర్య అడుగు పెట్టింది. ఇంకా ఆశ్చర్య నుంచి ఆనందరావు, శ్రావ్య, ఆదిత్య తేరుకోలేక ముందే సౌందర్య వెనుక నుంచి హిమ ఇంట్లోకి వచ్చింది. హిమను చూసి శౌర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది ఎందుకు వచ్చిందంటూ కోపంగా కనిపించింది. హిమను చూడగానే శ్రావ్య, ఆదిత్య, ఆనందరావు పరుగున వెళ్లి హిమ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. హిమ బతికి వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆనందపడిపోయారు. అంతా దేవుడి దయ అంటూ సౌందర్య భగవంతుడిని వేడుకొన్నది.

హిమ లేదా నేను.. ఇద్దరిలో ఒకరే అంటూ

హిమ లేదా నేను.. ఇద్దరిలో ఒకరే అంటూ

అయితే హిమను ఇంటిలోకి తీసుకు వస్తుంటే.. ఆగు అంటూ శౌర్య గట్టిగా అరిచింది. అమ్మా, నాన్నలను చంపేశావు కదా..ఇంకా ఏం చేద్దామని వచ్చావు అని శౌర్య అంటే.. ఏమిటి శౌర్య అని సౌందర్య ఏదో చెప్పబోయింది. దాంతో అమ్మా, నాన్నల చావుకు కారణం హిమ అని శౌర్య అంది. ఏంటమ్మా ఇది అని ఆనందరావు అంటే.. తాతయ్య నీకు ఏమీ తెలియదు అని శౌర్య అంటే.. నీకు ఎంత హక్కు ఉందో.. హిమకు అంతే హక్కు ఉంది అని సౌందర్య అంది. హిమ వచ్చిందని ఆనందపడుతుంటే.. నీవు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఆదిత్య అన్నాడు.

దాంతో మీరు అంతా ఇలా మాట్లాడుతారని నాకు తెలుసు. ఇంట్లో హిమ లేదా నేను. ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి అని శౌర్య అంది. దాంతో నేను వెళ్లిపోతాను అంటూ హిమ వెనుదిరగబోయింది. అయితే వద్దు.. శౌర్య మాటలను పట్టించుకోవద్దు అంటూ సౌందర్య సర్దిచెప్పబోయింది. మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలని మరోసారి శౌర్య గట్టిగా అరిచింది.

అమ్మా, నాన్నలను నీవే చంపావు అంటూ

అమ్మా, నాన్నలను నీవే చంపావు అంటూ

శౌర్య మాటలు విన్న హిమ మాట్లాడుతూ.. శౌర్య ప్లీజ్ నన్ను క్షమించు అని అంటే.. నాతో మాట్లాడవద్దు.. అమ్మా, నాన్నలను నీవే చంపేశావు. నీవు నాతో మాట్లాడవద్దు అని శౌర్య అని ఇంట్లోకి వెళ్లిపోయింది. బెడ్ రూమ్‌లో తల్లిదండ్రుల ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది. అంతలోనే హిమ గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.

హిమను నా గదిలోకి రావొద్దంటూ ఆపేసింది. దాంతో ఒక్కసారి నా మాట విను. నేను చెప్పేది కాస్త విను అంటూ హిమ బతిమిలాడింది. అయితే నాకు అంతా తెలుసు. టూర్‌కు వెళ్లినప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తాను.. డ్రైవింగ్ చేస్తాను అంటూ నీకు డ్రైవింగ్ పిచ్చి పట్టుకొన్నది. డ్రైవింగ్ పిచ్చితోనే అమ్మా, నాన్నను చంపేశావు. నా గదిలోకి రావొద్దు అంటూ శౌర్య హెచ్చరించింది.

నాకు తెలియకుండా జరిగిపోయిందంటూ హిమ

నాకు తెలియకుండా జరిగిపోయిందంటూ హిమ

శౌర్యకు సర్ది చెప్పేందుకు హిమ ప్రయత్నిస్తూ.. నాకు తెలియకుండా ఏదో తప్పు జరిగిపోయింది. అమ్మా, నాన్న లేకపోతే నాకు బాధగా ఉంది. నేను ఎంత ఏడుస్తున్నానో నీకు తెలుసా? అసలు నా కళ్ల నుంచి అంటూ హిమ మాట్లాడుతుంటే.. నీవు నాకు ఏమీ చెప్పవద్దు. తాడి కొండకు వెళ్లి వచ్చినప్పటి నుంచి నీ మాటల్లో.. చేతల్లో తేడా వచ్చింది. అది నాకు తెలుస్తుంది హిమ.

అమ్మా, నాన్నలను నీవే చంపావు అని శౌర్య అంటే.. నీవు అలా మాట్లాడవద్దు అని హిమ అంది. దాంతో అమ్మా, నాన్నలను నీవే చంపావు.. నీవే చంపావు అంటూ శౌర్య కోపంతో ఊగిపోయింది. అలా అనకు శౌర్య.. నీవు అలా అంటే నాకు ఇంకా బాధపడుతున్నాను అని అంటే.. మనం ఇద్దరు కలిసి పెరగపోయినా.. కలిసిన తర్వాత నాకు ఓ సిస్టర్ ఉందని సంతోషపడ్డాను. కానీ అమ్మా, నాన్నలను నీవే చంపేశావు అని గదిలో నుంచి బయటకు వెళ్లింది.

ఇలాంటి దురదృష్టం వస్తుందని..

ఇలాంటి దురదృష్టం వస్తుందని..

తన మనవళ్లను, హిమను, శౌర్యను పక్కనే కూర్చొబెట్టుకొని వారికి సౌందర్య గోరు ముద్దలు తినిపిస్తుంటే. అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ శౌర్య మాత్రం ముభావంగా కూర్చొని ఉండిపోయింది. శౌర్య అంటూ గోరు ముద్ద పెట్టబోతుంటే..నాకు వద్దు అని మొండికేసింది.

దాంతో అందరూ తింటున్నారుగా.. నీవు తిను అని అంటే.. అందరూ తింటున్నారు కాబట్టే నేను తినడం లేదు అని శౌర్య బదులిచ్చింది. అయితే మీ అందరికి తినిపించే అదృష్టం వస్తుందని అనుకోలేదు అని సౌందర్య అంటే.. ఇలాంటి దురదృష్టం వస్తుందని ముందే ఊహించాను అంటూ శౌర్య సమాధానం ఇచ్చింది.

నేను చచ్చిపోయినా బాగుండు అంటూ

నేను చచ్చిపోయినా బాగుండు అంటూ

శౌర్య మూడ్ మార్చేందుకు ప్లాన్ వేస్తూ.. అందర్ని ఒకే స్కూల్‌లో చేర్పించు. అందరూ కలిసి మెలిసి ఉంటే.. సంతోషంగా కలిసిపోతారు అంటే.. నేను ఆ స్కూల్‌లో చదవును. కావాలంటే నేను చదువే మానేస్తాను. హిమనే నా తల్లిదండ్రులను చంపేసింది. తను ఉన్న ఇంట్లో అసలే ఉండను. నేను వెళ్లిపోతాను అని శౌర్య అంటే.. తప్పు చేసింది నేను.. నువ్వు ఎందుకు వెళ్లాలి. ఆ కారులో వాళ్లతోపాటు నేను చచ్చిపోయినా బాగుండు అని హిమ అంటే.. హిమ అలా మాట్లాడకు.

దేవుడు దయవల్ల నీవు మాకు దక్కావు అని సౌందర్య అంది. పొద్దున్నుంచి నిన్ను బతిమిలాడుతున్నాం. మా మాట వినవచ్చు కదా అంటూ శ్రావ్య రిక్వెస్ట్ చేసింది. అందరం పుట్టెడు దు:ఖంలో ఉన్నాం. తప్పో.. పొరపాటో జరిగిపోయింది. హిమ కుమిలిపోతున్నది. అదే దానికి సరైన శిక్ష అంటే.. ఆ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇంటి నుంచి వెళ్లిపోయిన శౌర్య

ఇంటి నుంచి వెళ్లిపోయిన శౌర్య

శౌర్యకు నేను అంటే ఇష్టం. నాకు శౌర్య అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చేతిపై ఒకరి పేర్లు మరొకరు పచ్చ బొట్టు వేయించుకొన్నాం. నేను చేసింది తప్పే.. నా వల్లనే అమ్మా, నాన్న ప్రాణాలు కోల్పోయారు అని హిమ బాధపడింది. అయితే తన చేతిపై ఉన్న హెచ్ అనే అక్షరంతో ఉన్న పచ్చ బొట్టును చెరిపేసుందుకు ప్రయత్నించింది. అయితే శౌర్యను వారిస్తూ.. మీ పచ్చ బొట్టు చెరిగిపోనట్టే.. మీ మధ్య బంధాలు అలానే బలంగా ఉంటాయి అంటూ సౌందర్య చెప్పింది. అయితే తెల్లవారిన తర్వాత ఇంట్లో శౌర్య కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతికారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన శౌర్య రోడ్డుపై కనిపించింది.

ఆటో డ్రైవర్‌గా శౌర్య

ఆటో డ్రైవర్‌గా శౌర్య

అయితే కార్తీక దీపం సీరియల్ తాజా ప్రోమోలో మరో భారీ ట్విస్టుకు తెరలేపింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శౌర్య.. ఆటో డ్రైవర్‌గా అవతారం ఎత్తింది. ఒకడు వస్తావా అని అడిగితే.. వాడిని పిచ్చ కొట్టుడు కొట్టింది. అక్కా.. చెల్లి అని ప్రాధేయపడినా.. వాడిని వదల్లేదు. తెలుగులో నాకు నచ్చని బంధాలు.. అక్కా.. చెల్లి అంటూ వాడిని రఫ్ ఆడించింది. తన ఆటోపై వదిలేదిలే అంటూ క్యాప్షన్ రాయించుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X