Karthika Deepam శౌర్యకు సౌందర్య చెంపదెబ్బ.. నానమ్మను కలిసిన వేళ ఉద్వేగంతో..

హోటల్‌లో లంచ్ పార్టీ తర్వాత ఇంటికి బయలుదేరారు. అయితే ప్రేమ్ ఎలా వెళ్తారు అని అడిగితే.. నేనే తీసుకొచ్చాను.. నేనే వారిని ఆటోలో తీసుకెళ్తాను అని జ్వాలా అలియాస్ శౌర్య చెప్పింది. అయితే క్యాబ్‌లో వెళ్లండి అంటూ ప్రేమ్ అంటే.. మేము ఎలాగో వెళ్తాం. ముందు నీవు వెళ్లు అంటూ నిరుపమ్ అన్నాడు. అయితే మీరు ఆటోలో వెళ్తే నేను కూడా వస్తే బాగుంటుంది అంటూ ప్రేమ్ మనసులో అనుకొన్నాడు. బైక్ స్టార్ట్ కావడం లేదంటూ నాటకం ఆడటంతో.. నీవు కూడా ఆటోలో రా అంటూ హిమ చెప్పగానే.. ప్రేమ్ సంబరపడిపోయాడు. దాంతో హిమ పక్కనే ఆటోలో కూర్చున్నాడు. అలా ఆటోలో హిమ, ప్రేమ్, అలాగే నిరుపమ్, జ్వాలా మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. కార్తీకదీపం సీరియల్ 1331 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

 ఆటోలో రెండు జంటల రొమాన్స్

ఆటోలో రెండు జంటల రొమాన్స్


ఆటోలో వెళ్తున్న సమయంలో ప్రేమ్, జ్వాలా గొడవపడటంపై నిరుపమ్ మాట్లాడుతూ.. గత జన్మలో మీరద్దరు ఎలుక, పిల్లి అయి ఉంటారు అని అంటే.. ప్రేమ్ ఎలుక అయి ఉంటాడు అని జ్వాలా అంటే.. లేదు నేను పిల్లి అయి ఉంటాను అని ప్రేమ్ తగులాడారు. శౌర్య తనతో గొడవపడటంపై ప్రేమ్ మాట్లాడుతూ.. అందరితో ఇలానే ఉంటావా? లేదా నాతోనే ఉంటావా? అని అడిగితే.. నవ్వుతు సమాధానం చెప్పింది. అలా ఆటోలో హిమను ప్రేమగా చూస్తూ ప్రేమ్.. జ్వాలాను నిరుపమ్ తన్మయత్వం చూస్తూ వెళ్లారు

 కూతురికి ఆనందరావు చురకలు

కూతురికి ఆనందరావు చురకలు


నిరుపమ్ పనిచేసే హాస్పిటల్‌కు ఆనందరావు, తన కూతురు స్వప్నతో చెకప్‌కు వెళ్లాడు. నిరుపమ్ ఫోన్ చేస్తే.. ఆన్సర్ చేయడం లేదు అని అంటే.. వస్తాడులే అనందరావు అన్నాడు. మీ లాగా సమాధానం చెప్పుకొని సర్దుకుపోయేదానిని కాదు అని స్వప్న అంటే.. అవునమ్మా.. సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే.. రెండు సంసారాలు బాగుండేవి అని ఆనందరావు చురకలు అంటించాడు. దాంతో నేను ఏమీ మాట్లాడుతున్నాను.. నీవేమి మాట్లాడుతున్నావు అని స్వప్న కోపగించుకొన్నది. అంతలోనే హిమ, నిరుపమ్ రావడంతో బయటకు దీనితో వెళ్లాడా అనే ఆవేశపడింది.

హిమపై స్వప్న నోటిదురుసు

హిమపై స్వప్న నోటిదురుసు


నిరుపమ్, హిమ హాస్పిటల్ గదిలోకి రావడంతోనే వారిపై మండిపడింది. నిరుపమ్‌తో బయట తిరగడం ఏమిటి? హాస్పిటల్ ఉండకుండా అంటూ స్వప్న కోపగించుకొన్నది. నాకోడుకును వెంటేసుకొని తిరుగుతున్నావు.. నీకు ఏమైనా బుద్ది ఉందా? అంది. దాంతో మమ్మీ ప్లీజ్ ఆపు అని నిరుపమ్ అంది. హిమను ఉద్దేశించి.. మీ భలే ఫ్యామిలీ.. అదెవతో మీ నాన్న అడ్డం పెట్టుకొని కొడుకును కని రచ్చ చేసింది. నువ్వే కార్తీక్, దీపలను పొట్టనపెట్టుకొన్నావు అని స్వప్న నోరుజారింది. అయితే తల్లి మాటలకు అడ్డుపడుతూ.. ఇది హాస్పిటల్‌. అందరూ చూస్తున్నారు అని నిరుపమ్ అంటే.. హిమ ఇలా వేధిస్తుంటే.. వాళ్ల నాన్నమ్మ మరోలా వేధిస్తున్నదంటూ స్వప్న ఆవేశపడుతూ అక్కడి నుంచి వెళ్లింది.

జ్వాలా తెచ్చిన టిఫిన్ తిన్నా అంటూ

జ్వాలా తెచ్చిన టిఫిన్ తిన్నా అంటూ


స్వప్న ఇంటిలో మనవడు నిరుపమ్ కోసం ఆనందరావు వెయిట్ చేస్తుండగా.. కూతురు భోజనం చేయమని అడిగింది. అయితే నిరుపమ్ వచ్చిన తర్వాత తిందాం అని చెప్పాడు. నిరుపమ్ అప్పడే రావడంతో.. పద భోజనం చేద్దాం అంటే.. నేను తినేసి వచ్చాను అని నిరుపమ్ సమాధానం చెప్పాడు. దాంతో తల్లి స్వప్న.. ఎక్కడ తిన్నావు అని అడిగింది. దాంతో జ్వాలా టిఫిన్ బాక్స్ తెచ్చింది. అదే తిన్నాను అంటూ నిరుపమ్ చెప్పడంతో స్వప్న మరింత మండిపడింది. అడ్డమైన వాళ్లు తెచ్చే గడ్డి తింటావేమిటి అని స్వప్న అంటే.. అయితే అడ్డమైన గడ్డి తినకుండా ఉండేందుకు .. నువ్వే వండి పంపించవచ్చుగా అని తండ్రి ఆనందరావు జవాబిచ్చాడు. తనను తప్పు పట్టడమే గానీ.. నా బాధను అర్ధం చేసుకోరు అని అక్కడి నుంచి స్వప్న వెళ్లిపోయింది.

నానమ్మను కలిసిన శౌర్య

నానమ్మను కలిసిన శౌర్య


ఇదిలా ఉండగా.. తదుపరి ఎపిసోడ్‌కు చెందిన ప్రోమో ఆసక్తికరంగా కనిపించింది. సౌందర్యపై జ్వాలా అలియాస్ శౌర్య నీళ్లు పోసింది. దాంతో తనపై నీళ్లు పోసిన జ్వాలాను సౌందర్య చెంపపై గట్టిగా కొట్టింది. అయితే తనను కొట్టిన సౌందర్యను చూసి నానమ్మ అంటూ మనసులో ఆవేదన చెందింది. కింద పడిన డాక్యుమెంట్లను చూస్తూ.. అలానే ఉండిపోయింది. అలా తన నానమ్మను శౌర్య కలుసుకోవడం ట్విస్టుగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X