twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మహానటికే అమ్మమ్మవు.. నీ ద్రోహం మరిపోను.. హిమపై శౌర్య మండిపాటు

    |

    పెళ్లి క్యాన్సిల్ చేయమని హిమ చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకొంటే ఎలా? అని సౌందర్య అంటే.. నాకు హిమ అంటే ఇష్టం. ఈ విషయంలో నేను సీరియస్‌గానే ఉన్నాను. ఎంగేజ్‌మెంట్ రోజు ఇష్టం లేదని చెప్పింది. మా మమ్మిని బతిమిలాడుకొంటే.. ఒకే అంది. ఇప్పుడు వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. ఫ్రెండ్స్‌కు కూడా ఇచ్చాం. ఇప్పుడు పెళ్లి వద్దని.. శౌర్యను వివాహం చేసుకోమంటే ఎలా సాధ్యమవుతుంది. మీరు పెద్దవాళ్లు. మీరే ఈ సమస్యకు పరిష్కారం సూచించండి. శౌర్యను పెళ్లి చేసుకోవడం అసంభవం. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను అని నిరుపమ్ తెగేసి చెప్పాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1407‌‌లో ఏం జరిగిందంటే..

    శౌర్య కోసం ఏమైనా చేస్తా

    శౌర్య కోసం ఏమైనా చేస్తా


    నిరుపమ్ వ్యవహార తీరుతో మనోవేదన చెందిన సౌందర్య.. ఏంటీ మీ మధ్య గొడవ. శౌర్య అంటే ఇష్టం లేదని నిరుపమ్ చెప్పాడు. మళ్లీ నీవు పెళ్లి వద్దంటే ఎలా అని సౌందర్య అంటే.. నిరుపమ్ అంటే చెప్పలేనంత ఇష్టం. బావ అంటే ప్రాణం. తన ఇష్టమే నా ఇష్టం. నిరుపమ్‌తో శౌర్య పెళ్లి చేస్తా. అందుకోసం నేను ఏమైనా చేస్తాను అని హిమ అంది.

    చిన్నప్పటిలా కలిసి ఉందాం అంటూ శౌర్య

    చిన్నప్పటిలా కలిసి ఉందాం అంటూ శౌర్య

    హిమ మాటలను పక్క నుంచి విన్న శౌర్య ఎమోషనల్ అయింది. ఆవేదన చెందుతూ.. హిమ అంటూ శౌర్య పిలిచింది. తనను పేరు పెట్టి పిలిచిన శౌర్యను చూసి.. నన్ను హిమ అని పేరు పెట్టి పిలిచావా? అని హిమ అంటే.. నీకు నిజంగా ఇంత ప్రేమ ఉందా? నా కోసం ఇంతలా ఆరాటపడుతున్నావా? పెళ్లి ఫిక్స్ అయినా కూడా నిరుపమ్ బావను నన్ను చేసుకోమని చెబుతున్నావంటే.. నీవు గ్రేట్ హిమ. మట్టి బుర్రని. నా కోసం ఇంత చేస్తుంటే.. నిన్ను నేను శత్రువులా చూశాను అని ఆవేదన చెందుతూ హిమను శౌర్య కౌగిలించుకొన్నది. సారీ హిమ.. నిన్ను ఎన్నో మాటలు అన్నాను. అవన్నీ మరిచిపోయి.. మనిద్దరం ఎప్పటిలా చిన్నప్పటిలా కలిసి ఉందాం అని అంది.

    నీ ద్రోహం మరిచిపోను అంటూ శౌర్య

    నీ ద్రోహం మరిచిపోను అంటూ శౌర్య

    అయితే హిమకు వెంటనే శౌర్య షాకిచ్చింది. నా నుంచి నీవు ఇదేనా కోరుకొంటున్నది. నేనొచ్చి.. నీవు గొప్పదానికి. నీవు త్యాగశీలివి అని అంటానని అనుకొన్నావా? నీ బుట్టలో పడుతానని, నీ మాయలో పడుతానని అనుకొన్నావా? విను.. విను.. అరుస్తూ.. మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారో.. ఏం చేస్తున్నానో నాకు తెలుసు అని శౌర్య.. నీ మీద కోపం పొగొట్టడానికి, పెళ్లి సాఫీగా జరగడానికి ప్లాన్ చేస్తున్నారుగా.. మీ నాటకం బాగుంది. నీవు గొప్ప మేధావివి. మహానటికే అమ్మమ్మవి. ముఖంలో బాధ నటిస్తున్నావు చూడు.. అబ్బో.. నీ ద్రోహం మర్చిపోను. నీ నటనను నమ్మను అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది.

    హిమకు క్యాన్సర్ లేదంటూ..

    హిమకు క్యాన్సర్ లేదంటూ..

    హిమ, నానమ్మతో మాట్లాడిన తర్వాత నిరుపమ్ ఇరిటేట్ అయ్యాడు. ఇంటికి వచ్చి కోపంతో ఊగిపోతున్న నిరుపమ్‌ను చూసి.. నేను చెప్పే ప్రతీమాట వింటావు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి నీవు నా మాట వినడం లేదు. నాలుగు రోజల్లో చచ్చిపోయే దానికి గురించి నీకు అంత పట్టింపు ఎందుకు? అని స్వప్న అంటే.. హిమకు క్యాన్సర్ లేదనే విషయం నాకు తెలుసు. క్యాన్సర్ ఉన్నా లేకున్నా నా ప్రేమ విషయంలో రాజీ పడను. ఏది ఏమైనా హిమను మాత్రమే పెళ్లి చేసుకొంటాను అని నిరుపమ్ తెగేసి చెప్పాడు.

    పదివేలు ఇస్తే ఎవరైనా ఇలా

    పదివేలు ఇస్తే ఎవరైనా ఇలా

    శౌర్య ఆటో నడపడం గురించి సౌందర్య, ఆనందరావు ప్రస్తావించాడు. ఇప్పటి వరకు ఆటో నడపడం సరే.. ఇక నుంచి ఆటో నడపటం అవసరమా? అని సౌందర్య అంటే.. నేను ఇంటికి వచ్చే రోజే చెప్పాను. నేను ఆటోను నడుపుకొంటానని అన్నాను. ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని శౌర్య అంటే.. నీ వంటే హిమకు చాలా ప్రేమ అని సౌందర్య అంటే.. అందంతా ఒక నటన.. అని శౌర్య అంటుంటే.. ఇద్దరు వచ్చి హిమ గురించి అడిగారు. డాక్టర్‌ను కలువాలంటే.. హాస్పిటల్‌కు వెళ్లాలి. కానీ ఇక్కడికి రావడం అవసరం లేదు కదా.. అంటే.. నా భార్యకు కాన్పు కష్టమైతే.. తానే బతికించింది. నా బిడ్డకు శౌర్య అని పేరు పెట్టింది అనగానే.. ఆనందరావు, సౌందర్య ఆనందపడిపోయారు. అయితే ఇంటికి వచ్చి ఇలా చెప్పడానికి డాక్టర్ ఎంత ఇచ్చారని శౌర్య అడిగితే.. పదివేలు ఇచ్చారు అని చెప్పారు. దాంతో పదివేలు ఇస్తే ఎవరైనా చెబుతారు. ప్రేమ అనేది దానంటతా అదే జరుగుతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అని నిరుపమ్ అన్నాడు.

    English summary
    Karthika Deepam July 18th Episode number 1407.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X