Karthika Deepam పెళ్లికి ముందే ఆమె మెడలో తాళి కడుతా.. తల్లికి డాక్టర్ నిరుపమ్ వార్నింగ్

కార్తీకదీపంలో హిమ, నిరుపమ్ పెళ్లి డ్రామా కొనసాగుతూనే ఉంది. హిమతో నిరుపమ్ పెళ్లిని ఆపేందుకు తల్లి స్వప్న.. డాక్టర్ శోభ ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో నా బాధ మీకు ఏమి తెలుస్తుంది. హిమ తనకు క్యాన్సర్ అని చెప్పి మోసం చేసింది అని తల్లిదండ్రులను స్వప్న ప్రశ్నిస్తే.. తనకు క్యాన్సర్ లేదని తెలిస్తే... సంతోష పడాలి కానీ. బాధపడుతున్నావేంటి అని సౌందర్య చెప్పింది. వాడేమో దాని వెనుక ప్రేమ అని తిరుగుతున్నది. నా కున్న బాధలన్నీ మీ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. పెళ్లి జరుగదని హిమ క్యాన్సర్ నాటకం ఆడింది.

ఈ ఫోటోలు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారా అని స్వప్న అంటే.. డ్రామాలేంటి? ఈ జ్వాలా ఎవరో కాదు.. మన శౌర్య అని సౌందర్య అంటే.. ఓహో నాకు మరో తలనొప్పి తయారైందన్న మాట..ఈ లెక్కన నా కొడుకు వెంట.. ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నారన్న మాట.. నాకు జ్వాలా, హిమ అయినా నాకు ఇష్టం లేదు. వారిద్దరికి నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. ఇది మొదటి నుంచి మొత్తుకొంటునే ఉన్నాను. నిరుపమ్‌తో పెళ్లి చేయడానికే క్యాన్సర్ డ్రామా ఆడారు. మీరు ఏ మాత్రం చేసినా పెళ్లిని ఆపేస్తాను అని స్వప్న అంటే.. పీటల దాక వచ్చిన పెళ్లిని ఆపేస్తావా? సౌందర్య అంటే.. మీరు ఏం చేస్తారో అది చేసుకోండి అంటూ స్వప్న తెగేసి చెప్పింది. నా మనసులో మాట చెప్పాను. ఈ పెళ్లి జరగదంటే.. జరగదు. నిరుపమ్ పెళ్లి స్వప్నతోనే జరుగుతుంది అని స్వప్న వెళ్లిపోయింది.

Big twist in Karthika Deepam todays episode: Swapna reveals about Shourya to Doctor Nirupam

ఇక ఇంట్లో భోజనం చేస్తూ.. వంటలు చాలా బాగా ఉన్నాయి అని తల్లి స్వప్నతో నిరుపమ్ అంటే.. ఏంటిరా కొత్తగా మాట్లాడుతున్నావు అని తల్లి అంటే.. ఏం లేదు.. నా పెళ్లి అయిన తర్వాత నీకు రిటైర్మెంట్ ఇస్తాం. మేమిద్దరం చక్కగా వంటలు చేసి నిన్ను సుఖపెడుతాం అని నిరుపమ్ అన్నాడు. అయితే హిమకు క్యాన్సర్ లేదని తెలిస్తే.. నిరుపమ్ పరిస్థితి ఏమిటో అని స్వప్న మనసులో అనుకొన్నది. నాన్న, తమ్ముడికి పెళ్లి పనులు అప్పగించు.. నీవు ఒక్కదానివే పైన వేసుకోకు అని నిరుపమ్ అంటే.. ప్రతీ దానికి పెళ్లి విషయం ముడిపెట్టకు.

పెళ్లి మాత్రమే జీవితం కాదు అని స్వప్న అంటే.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో అంతకంటే ఆనందం ఏముంటుంది అని నిరుపమ్ అన్నాడు. అయితే నీవు అనుకొంటే సరిపోదు. పీటల మీద నుంచి లేచిపోయింది కదా.. హిమ గురించి ఎందుకు అంత తాపత్రయ పడుతావు అని స్వప్న అంటే.. హిమ బయటకు ప్రేమ లేదని నటిస్తున్నది. జ్వాలాను పెళ్లి చేసుకోమని హిమ చెబుతున్నది. అయితే నాకు ఏదైనా అనిపిస్తే.. పెళ్లికి ముందే నేను వెళ్లి హిమ మెడలో తాళి కడుతాను అని నిరుపమ్ అన్నాడు.

Big twist in Karthika Deepam todays episode: Swapna reveals about Shourya to Doctor Nirupam

అయితే నిరుపమ్ మాటలకు భయపడిన తల్లి స్వప్న.. అంతపని చేయకు.. నీకు ఈ పెళ్లి అవసరమా? అని స్వప్న అంటే.. మమ్మీ అని గట్టిగా అరుస్తూ.. ఇంకోసారి ఆ మాట అనుకు. ఒక ఆటో అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎందుకు అంటుందో.. ఆమెతో హిమకు స్నేహం ఏమిటో తెలియడం లేదు. అప్పటికీ నేను గుచ్చి గుచ్చి అడిగినా చెప్పడం లేదు అని నిరుపమ్ అంటే.. హిమ, జ్వాలా, మీ నానమ్మ, తాత గురించి నీకు తెలియదు. జ్వాలాను ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారో తెలుసా? జ్వాలా ఎవరో కాదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శౌర్య అని స్వప్న అని రివీల్ చేసింది.

అయితే నేను నమ్మను అని నిరుపమ్ అంటే.. నా కోపం, నోటి దురుసు ఎక్కువ.. కానీ అబద్దాలు చెప్పను. జ్వాలానే శౌర్య అంటూ స్వప్న గట్టిగా అరిచింది. దాంతో జ్వాలా శౌర్య అవ్వడం ఏమిటి? జ్వాలా శౌర్య అయినా.. శౌర్య జ్వాలా అయినా హిమ మీద నా అభిప్రాయం మారదు అంటూ భోజనం ఆపేసి వెళ్లిపోయాడు. దాంతో వీడు పూర్తిగా హిమ మాయలో మునిగిపోయాడు. వీడికి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు అని స్వప్న ఆవేదన చెందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X