Karthika Deepam పచ్చబొట్టు గుట్టు రట్టు.. నా శత్రువుకు నాకు తెలుసు అంటూ శౌర్య ఫైర్
సౌందర్య, ఆనందరావు పనిమనిషిని ఆటోలో ఎక్కించుకొని శౌర్య బయలు దేరింది. సౌందర్య, ఆనందరావు పడుతున్న బాధ గురించి చెబుతుంటే శౌర్య ఎమోషనల్ అయింది. ఇంటిలో ఒకరు తప్పిపోయి ఉంటే అంతలా బాధపడి పోతారా.? నాన్నమ్మ, తాత కూడా బాధపడి ఉంటారేమో. అయినా నా గురించి వెతకనప్పుడు నేను ఎందుకు బాధపడాలి అంటూ శౌర్య ఆటో తోలుకుంటూ మనుసలో అనుకొన్నది. ఆటోలో పనిమనిషిని తీసుకొని వచ్చి తన నానమ్న, తాత ఇంటి వద్ద దిగబెట్టింది. ఆ తర్వాత ఆటోలో చూసుకొంటే.. వెనుక సీట్లో సంచి మరిచిపోవడంతో దానిని ఇవ్వడానికి తన నానమ్మ ఇంటిలోకి ప్రవేశించింది. పై అంతస్తు బాల్కనీలో సౌందర్య, ఆనందరావు ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1319లో ఏం జరిగిందంటే?

నానమ్మ ఇంటికి శౌర్య
సౌందర్య పనిమనిషి మరిచిపోయిన సంచీ తీసుకొని శౌర్య అలియాస్ జ్వాలా ఇంటిలోకి అడుగుపెట్టింది. ఇంటిలోకి అడుగుపెట్టగానే మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఏర్పడింది. అలాగే శౌర్య ఇంటిలోకి అడుగుపెట్టగానే సౌందర్య మనసులో కూడా తెలియని భావన ఏర్పడింది. ఇంటి గడప వద్దకు వచ్చి.. నానమ్మ వాళ్లు కూడా ఇలాంటి పెద్ద ఇంటిలోనే ఉంటారట అనుకొంటూ పెద్దమ్మ అంటూ పిలిచింది. సౌందర్య ఆ శబ్దం విని మెట్లు దిగి వచ్చి.. లక్ష్మి.. ఎవరో వచ్చారు చూడు అంటే ఆమె గుమ్మం వద్దకు వెళ్లింది. గుమ్మం వద్దకు వెళ్లగానే.. ఆటో డ్రైవర్ శౌర్య కనిపించింది.

నాన్నమను కలువలేకపోయిన శౌర్య
ఆటో డ్రైవర్ కనిపించగానే.. ఏంటమ్మా అంటే.. మీరు సంచి మరిచిపోయారు అని చెప్పింది. దాంతో మీరు చల్లగా ఉండాలి అని పెద్దమ్మ అంటే.. మీరు జాగ్రత్తగా ఉండండి. అని శౌర్య సమాధానం ఇచ్చింది. అయితే ఇంటిలోకి రా.. నీళ్లు తాగండి అంలే.. ఒకరి సొమ్ము తినడం ఎందుకు అని శౌర్చ అంటే.. నీళ్లే కదా అని పెద్దమ్మ సమాధానం ఇచ్చింది. అయితే నీళ్లు కూడా కొనుక్కొని తాగుతున్నారు అని వెనుదిరిగింది. ఆ తర్వాత సౌందర్య వచ్చి .. ఎవరు వచ్చారు అని అడిగితే.. సంచి మరిచిపోయి వచ్చా.. ఆటో డ్రైవర్ వచ్చి ఇచ్చి వెళ్లింది. అని చెప్పగానే.. ఆమె చల్లగా ఉండాలి అని సౌందర్య దీవించింది.

హిమపై ప్రేమ్ లవ్ గురించి
ఇక హిమపై ప్రేమను పెంచుకొన్న బావ ప్రేమ్ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. నాలో ఉన్న ప్రేమను చెబుతామంటే.. కుదరడం లేదు. కానీ నీకు నా ప్రేమను నీకు చెబుతాను. కానీ నీకు ఒక సర్ ప్రైజ్ గిఫ్టు ఇస్తాను. నీకు ఓ ఫోటోను నీకు ఇస్తాను. కానీ అది నా కెమెరాతో తీసింది కాదు. అదే నీకు సర్ ప్రైజ్ అంటూ ప్రేమ్ తన ప్రేమను హిమపై కురిపించే ప్రయత్నం చేశాడు.

ఎటు చూసినా నువ్వే అంటూ శౌర్య
ప్రేమ్ మాదిరిగానే శౌర్య కూడా నిరుపమ్ పై ప్రేమలో మునిగి తేలుతుంది. ప్యాసింజర్ ఎవరు వచ్చిన వారిలో నిరుపమ్ ను చూసుకొంటున్నది. తాను ఎందుకు నిరుపమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నదో అర్ధం కావడం లేదు. గుండె రాయిలాంటి నా హృదయంలో ఇంత ప్రేమ ఉందా? డాక్టర్ సాబ్ పై నాకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటూ అని తనకు తాను ప్రశ్నించుకొన్నది.

శౌర్య చేతిపై పచ్చబొట్టు ట్విస్టు
ఇలా ఎమోషన్స్ తో కొనసాగుతున్న సీరియల్లో సరికొత్త ట్విస్టుకు తాజా ప్రోమోలో తెర తీశారు. నిరుపమ్, శౌర్య కలుసుకొన్న సమయంలో ఆమె చేయిపై ఉన్న హెచ్ అనే పుట్టుమచ్చను చూసి ఏంటది అని అడిగితే... నా శత్రువు పేరులోని తొలి అక్షరం పచ్చ బొట్టు వేసుకొన్నాను అని శౌర్య సమాధానం ఇస్తే.. శత్రువుదా అని నిరుపమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవును అని శౌర్య అంలే.. ఎందుకు అంని నిరుపమ్ ప్రశ్నించగా.. అది అందరికి విషయం చెప్పేది కాదు. నా శత్రవుకు నాకు తెలుసు అని శౌర్య సమాధానం ఇచ్చింది. అయితే ఆటో డ్రైవర్ చేతిపై పచ్చబొట్టు ఉన్న సంగతి తెలుసుకొని హిమ షాక్ తిన్నది. ఈ ట్విస్టుతో హిమ, శౌర్య మధ్య మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











