For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam కార్తీక్, దీపకు ఘోరమైన మోసం.. మోనిత చెంపలు వాయించిన వంటలక్క!

    |

    శౌర్య అలియాస్ జ్వాలాను కార్తీక్, దీపకు అప్పగించాల్సి రావడంతో పెంచిన ప్రేమను తెంచుకోలేక ఇంద్రుడు తల్లడిల్లాడు. డాక్టర్ బాబు, వంటలక్కకు ఇవ్వకుండా చేస్తే.. శౌర్య పడే నరకాన్ని చూసి మేము నరకం అనుభవించలేం. జ్వాలా మెమొరీలతో మేము బతుకుతాం. జ్వాలాను తల్లిదండ్రులకు అప్పగించడమే మంచిది అని ఇంద్రుడు మనసులో అనుకొన్నాడు. ఇక దీప, కార్తీక్ మనసులో కూడా ఇంద్రుడి ఇంటిలో ఉన్న అమ్మాయి శౌర్య అని బలంగా నమ్మారు. అలా ఆలోచనలతో శౌర్య వేడుకకు జరిగే వేదిక వద్దకు చేరుకొన్నారు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1498లో ఇంకా ఏం జరిగిందంటే?

    ఇంద్రుడు ఇంటికి కార్తీక్, దీప

    ఇంద్రుడు ఇంటికి కార్తీక్, దీప

    ఇంద్రుడి ఇంటిలో శౌర్యకు ముత్తైదువలందరూ ఆశీర్వదిస్తుండగా.. కార్తీక్, దీప అక్కడికి చేరుకొన్నారు. వారిద్దరిని ఇంద్రుడు ఇంటిలోకి తీసుకెళ్లాడు. చంద్రుడిని పిలిచి.. కార్తీక్, దీపను పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే తన కోసం ఎవరో వచ్చారని శౌర్య కుర్చీలో నుంచి లేచింది. అయితే బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకొన్నారు. తిరిగి జ్వాలాను కుర్చీలో కూర్చోబెట్టారు. ఇక దీపను చూసి ఆమె నాకు ముందే తెలుసు. జ్వాలాకు వాటర్ బాటిల్ ఇచ్చారు కదా.. జ్వాలా ఎన్నోసార్లు అడిగింది. చివరకు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. జ్వాలా మాకు దేవుడు ఇచ్చిన వరం. అమ్మ మనసుతో ఆశీర్వదించండి అని చంద్రమ్మ కోరింది.

    శౌర్యకు బదులు మరో అమ్మాయిని చూపించి

    శౌర్యకు బదులు మరో అమ్మాయిని చూపించి

    ఇక కార్తీక్, దీపకు జ్వాలాను చూపించమని ఇంద్రుడు అంటే.. తీసుకొస్తానని చెప్పి లోనికి వెళ్లిన చంద్రమ్మ.. మరో అమ్మాయిని తీసుకొచ్చి చూపించారు. దాంతో కార్తీక్, దీప ఇద్దరు అమ్మాయిని చూసి నిరాశ చెందారు. నిరాశలో ఉన్న కార్తీక్, దీపను చూసి.. ఈమే అమ్మాయి.. పురిట్లో బిడ్డలు చనిపోతే.. చాలా రోజులకు ఈ బిడ్డ పుట్టింది. జ్వాలా నరసింహమూర్తి పూజిస్తే.. ఈ అమ్మాయి పుట్టింది. అందుకే జ్వాలా ని పేరు పెట్టుకొన్నాం అని చంద్రమ్మ చెప్పింది. తను తీసుకొచ్చిన అమ్మాయిని థ్యాంక్స్ చెప్పమని అడిగింది. అక్షింతలు తీసుకురావడంతో దీవించి కార్తీక్, దీప వెనుదిరుగారు. అయితే తనకు సంబంధించిన వారు వచ్చారని శౌర్య గదిలో ఉద్వేగానికి లోనవుతూ కనిపించింది.

    నా మాంగళ్యం ముఖ్యం అంటూ చంద్రమ్మ

    నా మాంగళ్యం ముఖ్యం అంటూ చంద్రమ్మ


    చంద్రుడు, ఇంద్రుడు చూపించిన బిడ్డను ఆశీర్వదించి వెను తిరిగారు. అయితే దీప, కార్తీక్ వెళ్లిపోతుండగా.. నేను బయటకు వెళ్తానని శౌర్య బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. చంద్రమ్మ అడ్డుకొన్నది. శౌర్య కనిపించలేదని భారంగా కార్తీక్, దీప అక్కడి నుంచి వెళ్లారు. చంద్రమ్మ చేసిన పనికి ఇంద్రుడు కోపగించుకొన్నారు. నాలుగు నెలలు పెంచిన మనకే అంత కష్టంగా ఉంటే.. జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులకు ఎంత కష్టంగా ఉంటుంది అని ఇంద్రుడు కోపగించుకొన్నాడు. అయితే శౌర్య వెళ్లిపోతే నువు బతికి ఉండగలవా? వారి బాధ ముందు.. నా మాంగళ్యం ముఖ్యమని నేను వేరే అమ్మాయిని చూపించాను అని చంద్రమ్మ బాధపడింది.

    ఇంద్రుడికి చంద్రమ్మకు ఊరట

    ఇంద్రుడికి చంద్రమ్మకు ఊరట

    ఇంద్రుడిని ఊరడిస్తూ.. ఇక వాళ్ల బిడ్డ అని మరిచిపో. వాళ్లు ఇక రారు.. మనం జాగ్రత్తగా ఉంటే చాలూ.. జ్వాలా మన బిడ్డగానే ఉంటుంది. జ్వాలా ముందు వారి తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకురాకు అని చంద్రమ్మ చెప్పింది. ఇంట్లో నవ్వుతూ ఉన్న జ్వాలాను చూపించి.. అలాంటి నవ్వుతూ ఉండే అమ్మాయిని వదులుకోగలమా? అని చంద్రమ్మ అన్నది. అలా కార్తీక్, దీపను ఇంద్రుడు, చంద్రుడు మభ్య పెట్టడం కనిపించింది.

    నిరాశలో కార్తీక్, దీప

    నిరాశలో కార్తీక్, దీప

    ఇక గంపెడు ఆశలతో శౌర్య కోసం వస్తే.. అక్కడ కనిపించకపోవడంతో కార్తీక్, దీప నిరాశకు గురయ్యారు. తాను ఫోన్‌లో విన్నది శౌర్య గొంతే. నేను కచ్చితంగా నమ్ముతాను అని దీప అంటే.. శౌర్య ఆలోచనల్లో అలా నీవు ఫీల్ అయి ఉన్నావేమో అని కార్తీక్ నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. నేను వారణాసితో ఆటోలో చూశాను. నీవు ఫోన్‌లో గొంతు విన్నావు అని కార్తీక్ అన్నాడు. అయితే శౌర్య ఎక్కడే ఉందా అనే అనుమానం కలుగుతున్నది అని దీప అంటే.. అవును. కచ్చితంగా ఒక్కడే ఉంది అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు.

    మోనితను లాగి పెట్టి కొట్టిన దీప

    మోనితను లాగి పెట్టి కొట్టిన దీప

    ఇదిలా ఉండగా.. కార్తీకదీపం తాజా ఎపిసోడ్‌లో మరో ట్విస్టు ఇచ్చారు. అలా అయితే నా చెంప పగలకొట్టేవాడు కదా అని మోనిత అనుకొంటుండగా.. దీప వచ్చి రెండు చెంపలు వాయించింది. ఇక ఇంద్రుడు, చంద్రమ్మ తీరుపై అనుమానం ఉండటంతో కార్తీక్ మళ్లీ వెనుక్కు వెళ్లాడు. మళ్లీ ఎందుకు వచ్చారని కార్తీక్‌ను అడిగితే..వారణాసి ఫోటో చూపించి.. ఇతను నీకు తెలుసా? అలాగే శౌర్య ఫోటోను చూపించి.. ఈ అమ్మాయి తెలుసా అని అడుగుతుంటే.. శౌర్య కిటికీలో నుంచి చూసి ఆనందపడిపోయింది.

    జోరుగా కార్తీకదీపం రేటింగ్

    జోరుగా కార్తీకదీపం రేటింగ్


    ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. గత కొద్దికాలంగా చాలా దారుణంగా రేటింగ్ పడిపోయింది. అయితే సీరియల్‌లో కార్తీక్, దీప, మోనిత పాత్రలు తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రేటింగ్ పెరిగింది. ఈ ఏడాదిలో గత వారం అంటే.. 41 వారం అర్బన్‌లో 11.56 రేటింగ్ వస్తే.. తాజా వారం 42 వారం 12.43 రేటింగ్, అలాగే రూరల్‌లో 41వ వారం 12.85 రేటింగ్ వస్తే.. 42వ వారం 13.51 రేటింగ్ నమోదు చేసింది.

    English summary
    Karthika Deepam November 1st Episode number 1498.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X