Karthika Deepam డాక్టర్‌బాబు తల్లికి తుపాకీ గురిపెట్టి... మోనిత పైశాచికత్వం!

ఆరోగ్యం సహకరించకపోవడంతో దీపను కార్తీక్ హాస్పిటల్‌లో చేర్పించారు. హార్ట్‌లో స్టంట్ వేయడానికి వైద్యులతో చర్చించాడు. అయితే తన ఆరోగ్యం సహకరించడంతో దీప కంగారు పడింది. ఒకవేళ నేను జీవించి ఉండకపోతే.. శౌర్యను వెతికే ప్రయత్నం కొనసాగించండి అని దీప వేడుకొన్నది. అయితే నీకు ఏమీ కాదు.. నీ ఆరోగ్యం బాగుపడే వరకు నీతోనే ఉంటాను అని కార్తీక్ అంటే.. నీవు నాతో ఉంటే.. మరి మోనిత ఊరుకొంటుందా? అని దీప ప్రశ్నించింది. అయితే మోనితకు దొరకకుండా నేను ఉంటాను అని కార్తీక్ జవాబిచ్చాడు. అనంతరం నాకు గతం గుర్తుకు వచ్చిన విషయం నీకు చెబితే.. ఈ పరిస్థితుల్లో నీవు తట్టుకొంటావో? లేవో అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు. అయితే దుర్గ ఎలా ఉన్నాడు అంటే..బాగానే ఉన్నాడు. మోనిత ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. అయితే నేను ఉన్నప్పుడు టిఫిన్, భోజనం సమయానికి పెట్టేదానిని. ఇప్పుడు మోనిత భోజనం పెడుతుందో లేదో అని దీప ఆవేదన చెందింది. అయితే నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇలాంటి ఆలోచించకు అని కార్తీక్ చెప్పాడు. కార్తీకదీపం సీరియల్ 1522 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

Karthika Deepam

శౌర్య కోసం చంద్రమ్మ ఇంటికి వెళ్లిన సౌందర్య, ఆనందరావు, హిమకు షాక్ తగిలింది. అయితే చంద్రమ్మ ఇల్లు ఖాళీ ఊరికి వెళ్లింది. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మేము వచ్చాం. మాకు ఆమె గురించి గానీ, ఇంద్రుడు గురించి కానీ తెలియదు అని ఇంటి కిరాయిదారు చెప్పడంతో సౌందర్య, ఆనందరావు అనుమాన పడ్డారు. నిజం చెప్పకపోతే మీరు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించి వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటి కిరాయిదారు ఇంద్రుడికి ఫోన్ చేసి శౌర్య గురించి వెతుకుతున్న విషయాన్ని తెలియజేసింది.

బయటకు వెళ్లి వచ్చేసరికి దీప కనిపించకపోవడంతో కార్తీక్‌ కంగారుపడ్డాడు. హాస్పిటల్ మొత్తం వెతికినా దీప కనిపించకపోవడంతో ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. అదే సమయంలో తన తల్లిదండ్రుల కోసం శౌర్య వెతుకుంటే.. దీప కూడా అక్కడకు వచ్చింది. దీప, శౌర్య కలుసుకొనే సమయానికి ఇంద్రుడు వచ్చి శౌర్యను తీసుకెళ్లాడు. దాంతో దీప, శౌర్య కలుసుకొనే అవకాశం తప్పిపోయింది.

అయితే శౌర్యను చంద్రుడు వేరే ఊరికి తీసుకెళ్తుండగా.. రోడ్డు పక్కన దీప పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించింది. దీపను చూసిన ఇంద్రుడు షాక్ తిన్నాడు. ఆటో డ్రైవర్ చూసి ఎవరో పడి ఉన్నారని చెప్పడంతో శౌర్య పడుకొని.. ఎవరు అంటే.. నీవు చూడకు భయపడిపోతావు. యాక్సిడెంట్ అని ఇంద్రుడు తల్లిని చూడకుండా శౌర్యను అడ్డుకొన్నాడు.

KD

ఇక తాజా ప్రోమోలో దీపను కార్తీక్ వెతికి పట్టుకొన్నాడు. ఆమెకు ట్రీట్‌మెంట్ ఇస్తూ కనిపించాడు. ఇక మోనిత ఇంటికి సౌందర్య మళ్లీ వెళ్లింది. నన్నుచంపడానికి ప్రయత్నించావా అంటూ గతంలో తనపై దాడి చేసిన విషయంపై నిలదీసింది. అయితే సౌందర్యను మోనిత నెట్టివేసి గదిలోకి దూరి తలుపు పెట్టుకొన్నది. అయితే తలుపులు దబాదబా కొట్టడంతో మోనిత తలుపు తీసి.. సౌందర్య తలకు తుపాకి గురిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X