For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam అబద్దం ఆడితే చంపేస్తానన్న వంటలక్క.. గొంతు నులిమి చంపబోయిన మోనిత

  |

  ఇంద్రుడు, చంద్రుడు ఇంటిలో శౌర్య లేకపోవడంతో కార్తీక్, దీప నిరాశకు లోనయ్యారు. కారులో ఇంటికి వెళ్తూ ఇలా జరుగుతుందని ఊహించలేదు డాక్టర్ బాబు.. శౌర్య ఇక్కడ ఉందా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తున్నది అని దీప అంటే.. కచ్చితంగా ఇక్కడే ఉంది. నీవు నమ్ముతున్నావు కాబట్టి.. నేను నమ్ముతున్నాను అంటూ కార్తీక్ అన్నాడు. నీకు ఇద్దరు పిల్లలు కదా.. శౌర్య మాత్రమే ఇక్కడ ఉన్నట్టు ఎందుకు అనిపించింది.. హిమ గురించి ఎందుకు రాలేదు. పిల్లల గురించి తల్లి గుండె తెలుసుకొంటుంది. త్వరలోనే దొరుకుతుంది.. ఇద్దరం కలిసి వెతుకుదాం అని కార్తీక్ అన్నాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1499 ఇంకా ఏం జరిగిందంటే..

  ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?

  ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?


  శౌర్యకు చంద్రమ్మ దిష్టి తీస్తుంటే.. పంక్షన్‌కు చాలా డబ్బులు అవుతాయి కదా.. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ ప్రశ్నించింది. దాంతో మీ అమ్మ, నాన్నలు ఇచ్చారు. మీకు మీ తల్లిదండ్రులను దూరం చేసి.. పాపం చేశాం అని చంద్రమ్మ మనసులో అనుకొంటూ.. పిల్లలు పిల్లల మాదిరిగానే ఉండాలి అని అన్నది. అయితే మీరు పెద్దల్లా ఉండటం లేదు కదా.. నేను వచ్చే సరికి దొంగతనాలు చేసి బతికారు.. ఇప్పుడు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి? అని జ్వాలా అంటే.. గొప్ప మనసు ఉన్న వాళ్లు ఇచ్చారు. అప్పుగానే తీసుకొన్నాం అని ఇంద్రుడు చెప్పాడు.

  నీవు నాకు దొరికిన వరం..

  నీవు నాకు దొరికిన వరం..

  ఇంద్రుడితో జ్వాలా మాట్లాడుతూ.. నేను మీ వద్ద ఉండటం వల్ల మీకు ఇబ్బందే.. అని అంటే.. నీవు మాకు దొరికిన వరం అని చంద్రమ్మ అంది. దాంతో ఈ రోజు మా అమ్మ, నాన్నలు వచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. మా అమ్మ వచ్చి ఉంటే ఎంత సంతోషంగా ఉండేదో.. ఇలాంటి సమయంలోనే అమ్మ, నాన్నలు పక్కన ఉన్నారని ఏ అమ్మాయి కోరుకుంటుంది. నా పక్కన మా అమ్మ, నాన్నలు ఎందుకు లేరు బాబాయ్ అంటూ శౌర్య కంటతడి పెట్టింది.

  నన్ను భార్యగా గుర్తించడం లేదు..

  నన్ను భార్యగా గుర్తించడం లేదు..


  శౌర్య కనిపించకపోవడంతో బాధలో మునిగిన దీపను దుర్గ ఓదార్చాడు. అన్నీ అనుకొన్నట్టు జరిగితే జీవితం ఎలా అవుతుంది అని దుర్గ అంటే.. ఒకటి ఆరా కూడా జరగడం లేదు. నా జీవితంలో అనుకొన్నట్టు ఏదీ జరగడం లేదు. ఎదురుగా భర్త ఉన్నా.. నన్ను భార్యగా గుర్తించడం లేదు అని దీప కంటతడి పెట్టుకొన్నది. దాంతో కార్తీక్‌కు ఒక్కసారి గతం గుర్తుకు వస్తే.. అన్నీ సర్దుకొంటాయి. అంత వరకు ఓపిక పట్టు అని దుర్గ ఓదార్చాడు.. అయితే.. వాల్తేరు వాణి ఏది అని దీప అడిగితే.. వాణి మోనిత మనిషి.. మనిద్దరిని లేపడానికి ప్లాన్ చేసింది. అనుమానం వచ్చి.. ఒక కన్నేశాను.. దొరికిపోయింది.. వెంటనే పార్శిల్ చేశాను అని దుర్గ చెప్పాడు. అంత పని చేసిందా? దాని సంగతి చూస్తాను అంటూ దీప ఆవేశంగా ఊగిపోయింది.

  మోనిత చెంపలు వాయించిన దీప

  మోనిత చెంపలు వాయించిన దీప


  వాల్తేరు వాణి విషయంలో దుర్గుకు దొరికిపోవడంతో మోనిత అసహనంతో ఊగిపోయింది. శివ ఎదురుగా ఉండటంతో.. మీ సార్ రాలేదా? అని అడిగితే.. వంటలక్కను దించే ఎక్కడికో వెళ్లిపోయాడు అని శివ చెప్పాడు.. దాంతో నేను ఇక్కడ ఒకదాన్ని ఉన్నాననే విషయం కూడా తెలియదా? కార్తీక్‌కు నా విషయం తెలిసిపోయిందా? దీప అంతా చెప్పేసిందా? అందుకే రాలేదా? ఒకవేళ తెలిస్తే.. వచ్చి నా చెంప చెల్లు మనిపిస్తాడు కదా.. అని మనసులో అనుకొంటుండగా.. దీప వచ్చి చెంపలు వాయించింది... నన్నే చంపించడానికి ప్రయత్నిస్తావా? అబద్దం ఆడితే పగిలిపోతుంది.. వాణితో భలే నాటకం ఆడావు కదా.. ఎంత ధైర్యమే అంటూ దీప ఫైర్ అయింది.

  మెడ పిసికి చంపబోయిన మోనిత

  మెడ పిసికి చంపబోయిన మోనిత


  దీప మాటలు అడ్డుకొంటూ.. అవును.. నేను వాల్తేరు వాణిని రప్పించాను. కార్తీక్‌ను నా నుంచి లాగేసుకొంటే.. అదే చేస్తాను. ఏం చేయడానికైనా వెనుకాడను అని మోనిత వార్నింగ్ ఇచ్చింది. నీవు ఏం చేశావే.. ఈ రోజు దుర్గ కాపాడాడు.. నా వెంట దేవుడు ఉన్నాడు.. కార్తీక్ నా వెంట ఉన్నాడు అని అంటే.. కార్తీక్ నా వాడు.. నేను ప్రేమించిన తర్వాతే నీవు పెళ్లి చేసుకొన్నావు.. ఇద్దరి పిల్లల్ని కన్నావు..నాదే అసలైన ప్రేమ. కార్తీక్ నా సొంతం.. కార్తీక్ నాకు కావాలి అని మోనిత అంటే.. కార్తీక్ ఎక్కడ? వాణి విషయం చెప్పి నీ బండారం బయటపెడుతా అని దీప బెదిరిస్తే.. నీ అంతు చూస్తా అని మెడ పిసికి చంపబోయింది. దాంతో వెంటనే దీప.. మోనితను విసిరికొట్టింది. దీప తోయడంతో.. నన్నే తోస్తావా? అని మోనిత అంటే.. మూయ్.. నోర్మోయ్.. నన్ను ఏమైనా చేయాలంటే.. నీవు ఎవర్నైనా తెచ్చుకోవాలి.. కానీ కార్తీక్‌పై ఉన్న ప్రేమను తలుచుకొని నెత్తి మీద ఒక్కటిస్తే.. గుడ్లు తేలేస్తావు.. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది.

  శౌర్య నీకు తెలుసా అంటూ కార్తీక్

  శౌర్య నీకు తెలుసా అంటూ కార్తీక్

  అయితే ఇంద్రుడిపై అనుమానంతో మళ్లీ శౌర్య గురించి వాకబు చేయడానికి కార్తీక్ అక్కడికి వెళ్లాడు. తన ఇంటికి వచ్చిన కార్తీక్‌ను చూసి కంగారుపడిపోయాడు. ఇంట్లో క్లీన్ చేయలేదు.. పక్కకు వెళ్లి మాట్లాడుకొందాం అని ఇంద్రుడు అంటే.. కొన్ని నిజాలు మాట్లాడుకొందాం అనే సరికి ఇంద్రుడు మరింత కంగారుపడిపోతే.. నీ దొంగతనం గురించి కాదు అని కార్తీక్ అన్నాడు..ఇతను తెలుసా? అంటూ వారణాసి ఫోటో చూయించాడు. దాంతో నేను చూడలేదు అంటూ ఇంద్రుడు సమాధానం చెప్పాడు. అదే సమయంలో శౌర్య కిటికిలో నుంచి ఇంద్రుడు ఎవరితో మాట్లాడుతున్నాడో చూడటానికి ప్రయత్నిస్తే.. వెంటనే చంద్రమ్మ లోపలికి తీసుకెళ్లింది. అంతలోనే కార్తీక్.. శౌర్య ఫోటోను చూసి.. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా అంటే.. చూడలేదు అని సమాధానం చెప్పాడు. దాంతో ఎక్కడైనా చూస్తే.. చెప్పు అని కార్తీక్ వెళ్లిపోయాడు. దాంతో ఇంట్లోకి వచ్చిన బాబాయ్‌ను చూసి.. ఎవరు అంటే.. నీకు బట్టలు, డబ్బు ఇచ్చిన వ్యక్తి అంటే.. అరే.. నేను థ్యాంక్స్ చెప్పేదానిని అంటూ జ్వాలా అంది.. దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇంద్రుడు, చంద్రుడు అనుకొన్నారు.

  English summary
  Karthika Deepam November 2nd Episode number 1499.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X