Naga Panchami October 11th: సుబ్బుపై నిందలు మోపబోయిన వినాయకుడు.. ఏం జరగబోతుంది?

Naga Panchami October 11th: మోక్ష, పంచమిలను ఇంట్లోకి రానిచ్చిన కుటుంబ సభ్యులు.. నిన్నటి ఎపిసోడ్ లో అంగరంగ వైభవంగా వినాయక పూజ చేసుకున్నారు. ముందుగా వినాయక పూజకు అంతా ఏర్పాట్లు చేశారు. అయితే వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన వారంతా ఒకరి తర్వాత ఒకరు దాక్కున్నారు. దానికి ఓ కారణం ఉంది. స్వామి వారిని భక్తి, శ్రద్ధలతో కాకుండా నేరుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో చిన్నగా ఉన్న వినాయక విగ్రహం కుటుంబ సభ్యుల్లోని ఏ ఒక్కరికీ లేవలేదు. ఈ విషయాన్ని ముందుగానే సుబ్బు చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.

ఇలా ముందుగా చిత్ర, ఆ తర్వాత జ్వాల లేపారు. విగ్రహం లేవకపోయేసరికి దాక్కున్నారు. ఆ తర్వారి వారి భర్తలు వచ్చి ప్రయత్నించారు. ఇలా ఇంట్లోని వారంతా ఒకరి తర్వాత ఒకరు వినాయక విగ్రహం లేపేబోయారు. కానీ ఎవరి వల్లా కాలేదు. ఈక్రమంలోనే చివరగా పంచమి వచ్చి లేపింది. కానీ ఆమె వల్ల కూడా కాలేదు. దీంతో చిత్ర, జ్వాలలు గట్టిగా నవ్వడం ప్రారంభించారు. మా వల్లే కాదు నీ వల్ల ఏం అవుతుందంటూ ఎద్దేవా చేశారు.

Naga Panchami Telugu Serial

అక్కడే ఉన్న సుబ్బు దీనంతటినీ చూస్తూ నవ్వాడు. ఈక్రమంలోనే చిత్ర, జ్వాలలు నువ్వు వచ్చి లేపు అంటూ సుబ్బుకు చెప్పగా.. చిన్న పిల్లలకు ఇలాంటి పనులు చెప్పొద్దని అన్నాడు. తాను విగ్రహాన్ని లేపనని అంటాడు. ఆ తర్వాత పంచమి.. స్వామి వారికి దండం పెట్టుకొని తమ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. మనసులో స్వామి వారిని ప్రార్థిస్తూనే.. గుంజీలు తీసి స్వామి వారి విగ్రహాన్ని లేపింది. దీంతో అంతా షాకయ్యారు. ఇలా వినాయకుడిని మండపంలో పెట్టాక.. పూజకు సిద్ధం అవుతారు.

వినాయకుడి ముందు పండ్లు, స్వీట్లు పెడతారు. అంతలోపే అక్కడకు సుబ్బు వస్తాడు. కానీ అప్పటికే వినాయకుడు వాటిని తినేస్తాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన చిత్ర, జ్వాలలు స్వీట్లు, పండ్లు లేకపోవడం చూసి సుబ్బను అనుమానిస్తారు. నువ్వే తినేశావ్ అంటూ ఫైర్ అవుతారు. ఇంట్లో వాళ్లందరినీ తీసుకొస్తామని వెళ్తారు. అప్పుడు సుబ్బు.. వినాయకుడితో మాట్లాడతాడు. పండ్లు నీవు తిని నన్ను నిందలు పడేలా చేయడం తప్పు అంటూ చెబుతాడు. వినాయక చవితి రోజు చందమామను చూస్తే నిందల పాలవుతారని తెలుసు కానీ ఇందేటీ స్వామీ ఏ తప్పూ చేయకుండా ఇలా చేస్తున్నావంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

Naga Panchami Serial latest episode

దీంతో వినాయకుడు.. పండ్లతో పాటు స్వీట్లను ఎప్పిటిలాగే ముందు ఉన్న పల్లాల్లో ప్రత్యక్షం అయ్యేలా చేస్తాడు. ఇది చూసిన సుబ్బు వినాయక విగ్రహం వెనకకు వెళ్లి దాక్కుంటాడు. అంతలోపే అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు.. పండ్లు, స్వీట్లు చూసి చిత్ర, జ్వాలలను తిట్టి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి వినాయక పూజలో పాల్గొంటారు.

ఇదిలా ఉండగా మరోవైపు నంబూద్రీ.. కరాళీ వద్దకు వెళ్లి మోక్ష, పంచమిలు ఇంటికి చేరుకున్నట్లు చెబుతాడు. నీవు మోక్షను పూర్తిగా నీ అదుపులోకి తెచ్చుకోవాలని అంటాడు. అందుకు కరాళీ.. తన మంత్రశక్తుల ద్వారా మోక్ష మెదడును తన అదుపులోకి తెచ్చుకుని తాను ఏం చెబితే అదే చేసేలా చేస్తానని నంబూద్రీతో అంటుంది. పక్కనే పంచమి ఉంటుంది ఆమె ఏం చెప్పినా మోక్ష స్పందించకూడదు అంటూ సూచిస్తాడు. ఇక అదే పనిలో ఉంటానని కరాళీ వెళ్లిపోతుంది.

 Episode number 170 in Naga Panchami Telugu Serial

ఇక రేపటి ఎపిసోడ్ లో.. పంచమి సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ప్రారంభించడం మనం చూడవచ్చు. పూజారి పంచమికి సుబ్రహ్మణ్య స్వామి దీక్ష మాల వేస్తుంటే.. సుబ్బు ఆపుతాడు. ఒక్కసారిగా ఆలోచించుకో.. వ్రతం చేయగలవో లేదే అంటాడు. ఈ ఇంట్లో నీకు ఎవరూ సహకరించరు, ఎన్నో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు. కానీ పంచమి మాత్రం వాటన్నిటినీ తట్టుకుంటానని.. కచ్చితంగా వ్రతం చేసి తీరతానని అంటుంది. ఆ తర్వాత స్వామి వారి మాల ధరిస్తుంది. పసురు రంగు చీరలో.. మాల ధరించిన పంచమిని చూస్తే దైవత్వం ఉట్టిపడుతుంది. మరి పంచమి చేస్తున్న వ్రతాన్ని అడ్డుకునేందుకు నంబూద్రీ, కరాళీలు, అటు చిత్ర, జ్వాలలు ఏం చస్తారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X