Naga Panchami : పంచమి, మోక్షల జాడ కోసం నంబూద్రీ, కరాళీల పూజలు.. తిప్పికొట్టిన సుబ్రహ్మణ్య స్వామి!

Naga Panchami : పిచ్చివాడైన మోక్షను బాగు చేసుకోవడానికి పంచమి ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పంచమి.. మోక్షను తీసుకొని సుబ్రహ్మణ్య గుహకు వెళ్లడం స్వామి వారిని దర్శించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే వారి జాడను తెలుసుకునేందుకు నంబూద్రీ, కరాళీలు కలిపి ఓ ప్రత్యేక పూజ చేస్తారు. కష్యాయా.. ఆవాహా యామి అంటూ కొన్ని దుష్ట శక్తులను వారి మీద ప్రయోగిస్తాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుట్టపై ఉన్న వారిద్దరినీ స్వామి వారు కాపాడుతారు. మోక్ష, పంచమిలు ఓ రాయిపై పడుకొని ఉండగా.. బాల సుబ్రహ్మణ్య స్వామి వారి పక్కనే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు.

ఇంతలోనే నంబూద్రీ, కరాళీలు ప్రయోగించిన దుష్ట శక్తులు అక్కడికి వస్తాయి. వాటిని చూసిన సుబ్రహ్మణ్య స్వామి నవ్వుతూనే వాటిని మాయం చేస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన నంబూద్రీ.. తన ప్రయత్నం బెడిసి కొట్టేసిరికి ఆశ్చర్యపోతాడు. ఈక్రమంలోనే ఏమైందని కరాళీ ప్రశ్నించగా... తమ ప్రయత్నం బెడిసి కొట్టిందని.. పంచమి, మోక్షలను సుబ్రహ్మణ్య స్వామి కాపాడారాని చెబుతాడు. అలాగే వారిద్దరూ స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం వల్లే వారి జాడను కనుక్కోలేకపోతున్నామని వివరిస్తాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

Big Twist in October 6th 2023 Episode number 166 in Naga Panchami Telugu Serial

అలాగే నిన్నటి ఎపిసోడ్ లో స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లిన పంచమి, మోక్షలకు సుబ్రహ్మణ్య స్వామి సాయం చేయడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ముందుగా తాను ఇచ్చిన ఆహారాన్ని మోక్షకు పెట్టిన పంచమి ఆకలిని తీర్చేందుకు మళ్లీ సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు. సీతాఫలంతో వచ్చి దాన్ని పంచమికి అందించగా.. ఆమె తినేస్తుంది. ఆ తర్వాత నీవెవవరిని ప్రశ్నించగా.. తన పేరు సుబ్రహ్మణ్యం అని.. నాన్న బాలు అని, అమ్ము సుబ్బు అని పిలుస్తుందని చెబుతాడు. ఆ తర్వాత నీవిక్కడ ఒంటరిగా ఎందుకున్నావని పంచమి అడగ్గా.. తానే వచ్చానని తన తెలివితేటలపై తన తల్లిదండ్రులకు నమ్మకం ఉందని అంటాడు. తన గురించి అమ్మా,నాన్నలు భయపడరని వివరిస్తాడు.

ఆ తర్వాత పంచమి గుడికి వెళ్తున్నట్లు తెలుసుకున్న సుబ్బు... తనకు గుడి గురించి తెలుసని, తాను కూడా అక్కడకే వెళ్తున్నట్లు చెబుతాడు. మోక్ష, పంచమిలతో పాటు తాను కూడా వస్తానని వివరించి.. వారికి సాయంగా ఉంటానని హామీ ఇస్తాడు. ఆ తర్వాత పంచమి తల్లికి నాగ సాధువు ధైర్యం చెబుతాడు. పంచమి తండ్రి త్వరలోనే తిరిగి వస్తాడని.. అలాగే పంచమి గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతాడు. ఆమె కారణ జన్మురాలని.. అన్నీ సక్రమంగానే జరుగాయతని పేర్కొంటాడు. ఆ తర్వాత సుబ్బు.. పంచమి, మోక్షలకు నీళ్లు, గ్రేప్స్ తీసుకు వస్తాడు. వాటిని ముగ్గురూ తినేస్తారు. ఆపై స్వామి ఎప్పుడు వస్తాడో తెలీదు వెళ్లిపోమని సుబ్బు.. పంచమితో అనగా.. స్వామి వారి దర్శనం అయ్యే వరకు వెళ్లనని చెబుతుంది.

Naga Panchami Telugu Serial

నీవు లేకపోతే నీ భర్తను ఎవరు చూసుకుంటారని సుబ్బు ప్రశ్నించగా.. పంచమి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మోక్ష కూడా తాను తన భార్యతోనే ఉంటానని మారాం చేస్తాడు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత సుబ్బు, మోక్షలను పంచమి తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. మరోవైపు కరాళీ.. మోక్ష, పంమిల జాడ కోసం అంజరం వేసి చూడగా.. ఏమీ కనిపించదు. వారు సుబ్రహ్మణ్య గుట్టపై ఉండడం వల్లే వారి జాడ కనిపించడం లేదని.. రేపో, మాపో వారి జాడను మనం కనిపెడతామంటూ నంబూద్రీ చెబుతాడు. నాగమణిని దక్కించుకుంటే తాము చేయాలనుకున్నవన్నీ చేయగల్గుతామంటూ చెబుతాడు. అందుకోసం మోక్షను, పంచమిని నీవు వశపరుచుకోవాలంటూ కరాళీకి సూచిస్తాడు.

దీని తర్వాత సుబ్బు, పంచమి, మోక్షలు.. ఓ ఆకులో నీళ్లు, పూలు తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు. ఆకులో తెచ్చిన నీటితో అభిషేకం చేసి ఆపై పూలు పెట్టి స్వామిని మొక్కుకుంటారు. తన భర్త మళ్లీ మామూలుగా కావాలంటూ పంచమి కోరుకోగా.. సుబ్బు మాయమైపోతాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X