Naga Panchami October 7th: ఇంటికి చేరుకున్న పంచమి, మోక్షలు - లోపలికి రానివన్ని కుటుంబ సభ్యులు, ఏం జరగనుంది?
Naga Panchami October 7th: పిచ్చివాడిగా మారిన మోక్షను మార్చుకునేందుకు సుబ్రహ్మణ్య గుహకు వెళ్లిన పంచమి ఈరోజుటి ఎపిసోడ్ లో ఇంటికి చేరుకుంటుంది. మోక్షతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామిని వెంట పెట్టుకుని ఇంటికి వస్తుంది. అది చూసిన ఇంట్లోని వాళ్లంతా బయటకు పరిగెట్టుకు వస్తారు. కానీ ఇంట్లోని వాళ్లంతా వారిని లోపలికి రానివ్వరు. ముఖ్యంగా మోక్షను అక్కడే వదిలి పెట్టి పంచమిని వెళ్లిపోవాలని చెబుతారు. ఇందుకు స్పందించిన పంచమి.. మోక్ష బాబు త్వరలోనే బాగవుతాడని, తానే మార్చుకుంటానని చెబుతుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం.. పంచమి వల్లే మోక్షకు ఆ పరిస్థితి వచ్చిందంటూ అంతా నిందలు మోపుతారు.
ఈక్రమంలోనే తాను వెళ్లనని పంచమి చెబుతుండగానే.. మోక్ష తండ్రి వచ్చి మోక్షను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఇష్టం లేని మోక్ష పంచమి చేయి పట్టుకొని భయపడుతూ ఉంటాడు. తాను లోపలికి రానని, పంచమి లేకుండా అస్సలే అడుగు పెట్టనని అంటాడు. ఇంతలోనే వారితో పాటు వచ్చి సుబ్బు (బాల సుబ్రహ్మణ్య స్వామి) గట్టిగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఒక్కసారిగా సుబ్బు నవ్వవడంతో కుటుంబ సభ్యులు అంతా తననే చూస్తూ ఉంటారు. ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో చిత్ర తన ఎడమ కన్ను అదురుతుందంటూ జ్వాల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. దీని వల్ల ఏమైనా సమస్యా అక్క అని అడగ్గా.. జ్వాల అవునని చెబుతుంది. దీంతో చిత్ర భయపడి టెన్షన్ పడుతుండగా.. సమస్య నీకు కాదు వేరే వాళ్లకు అని అంటుంది. దీంతో చిత్ర అలా అయితే మనకే మంచిది కదా అంటూ.. ముసలిది ఏమైనా చస్తుందా అని అంటుంది. దీనికి జ్వాల ఆమెకు ఏం అవ్వదు, నాకు పెళ్లై ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానను ఆమె అలాగే ఉంటుందని వివరిస్తుంది. అయితే మోక్షకు ఏమైనా అవుతుందా అని అనగా ఏమో అయ్యే అవకాశం ఉందని అంటుంది. ఒకవేళ మోక్ష, పంచమిలు ఇంటికి వస్తే మనం అస్సలే ఊరుకోకూడదని చిత్ర, జ్వాలలు మాట్లాడుకుంటారు.

ఇదిలా ఉండగా... సుబ్బు, మోక్షలు ఆడుకుంటూ కనిపిస్తారు. పంచమి మాత్రం ఓ చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గతంలో మోక్షతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటుంది. విషయం గుర్తించిన సుబ్బు.. దుంఖిస్తే ప్రయోజనం లేదు స్వామి వారిని మెప్పించాలని అంటాడు. స్వామి వారి కటాక్షం పొందితే కష్టాలు తొలగిపోతాయని చెబుతాడు. వ్రతం చేయాలని గుర్తు చేస్తాడు. ఫలితం కోసం ఎదురు చూడకుండా వ్రతం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని వివరిస్తాడు. ఈక్రమంలోనే పంచమి ఇంటికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేయాలనుకుంటుంది.

మరోవైపు పంచమి, మోక్షల జాడను తెలుసుకునేందుకు నంబూద్రీ, కరాళీలు కలిపి ఓ ప్రత్యేక పూజ చేస్తారు. కష్యాయా.. ఆవాహా యామి అంటూ కొన్ని దుష్ట శక్తులను వారి మీద ప్రయోగిస్తాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుట్టపై ఉన్న వారిద్దరినీ స్వామి వారు కాపాడుతారు. మోక్ష, పంచమిలు ఓ రాయిపై పడుకొని ఉండగా.. బాల సుబ్రహ్మణ్య స్వామి వారి పక్కనే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇంతలోనే నంబూద్రీ, కరాళీలు ప్రయోగించిన దుష్ట శక్తులు అక్కడికి వస్తాయి. వాటిని చూసిన సుబ్రహ్మణ్య స్వామి నవ్వుతూనే వాటిని మాయం చేస్తారు.

ఈ దుష్ట శక్తులు కరాళీ, నంబూద్రీల వద్దకు వెళ్లి చేసే గట్టి చప్పుళ్లతో వాళ్లు కాసేపు ఇబ్బంది పడతారు. తమ ప్రయత్నం బెడిసి కొట్టేసిరికి ఆశ్చర్యపోతారు. ఈక్రమంలోనే ఏమైందని కరాళీ ప్రశ్నించగా... తమ ప్రయత్నం బెడిసి కొట్టిందని.. పంచమి, మోక్షలను సుబ్రహ్మణ్య స్వామి కాపాడారాని చెబుతాడు. అలాగే వారిద్దరూ స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం వల్లే వారి జాడను కనుక్కోలేకపోతున్నామని వివరిస్తాడు.


Click it and Unblock the Notifications











