Naga Panchami October 8th: మోక్ష బాగు కోసం పూజ చేస్తానంటున్న పంచమి - కుటుంబ సభ్యులు చేయనిస్తారా?
Naga Panchami October 8th: మోక్షను బాగు చేసుకోవడానికి, కాపాడుకోవడానికి పంచమి ఎంతగానో కృషి చేస్తోంది. ఎన్నెన్నో కష్టాలు పడుతూ.. అడవిలో మోక్షతో ఒంటరిగా తిరిగి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంది. అలాగే బాల సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేయడంతో.. స్వామి వారికి వ్రతం చేయాలనుకుంది. ఈక్రమంలోనే మోక్షతో పాటు సుబ్బును ఇంటికి తీసుకొచ్చింది.
ఇంట్లో వాళ్లందరికీ తాను మోక్ష బాబు బాగు కోసం వ్రతం చేయాలనుకున్నట్లు తెలిపింది. అయితే అందుకు కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు, అసలు వ్రతం చేయనిస్తారా లేదా చూడాలి. అలాగే మోక్ష బాబు కోసం పంచమి వ్రతం చేస్తుంటే... ఇటు చిత్ర, జ్వాలలు, అటు నంబూద్రీ, కరాళీలు ఏమైనా చేస్తారేమో తెలియాలంటే మాత్రం సోమవారం ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా చిత్ర, జ్వాలలు వినాయక చవితి పూజ చేస్తామంటే కుటుంబ సభ్యులు అంతా ఫైర్ అవుతారు. మోక్ష రాకుండా చేయడానికి వీలు లేదని అంటారు. కాసేపు వీరందరి మధ్య చర్య నడుస్తుంది. ఆ తర్వాత అడవిలో పడుకున్న పంచమి లేచేసరికి సుబ్బు కనిపించక పోవడంతో టెన్షన్ పడుతుంది. సుబ్బు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తుంది. కానీ మోక్ష లేవగానే సుబ్బు కనపడతాడు. పంచమి కూడా చూసి.. తాము ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఈక్రమంలోనే సుబ్బు తనను ఆహ్వానించలేదని అంటాడు. అప్పుడు పంచమి.. సుబ్బును తమ వెంట రమ్మని కోరుతుంది. మనసారా పిలిస్తే వస్తానని.. ఒకవేళ తనపై పంచమి కోప్పడితే తనకు కూడా చెప్పకుండా వెళ్లిపోతానని అంటాడు. అందుకు పంచమి అంగీకరించడంతో సుబ్బు వెంట వస్తాడు.
మరోవైపు కరాళీ.. తాను తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోతానని అంటుంది. ఈక్రమంలోనే నంబూద్రీ వచ్చి అది సరికాదని.. మానసికంగా బలపడి తాము నాగమణిని దక్కించుకోవాలని అంటాడు. దాని వల్ల కల్గే లాభాలను మరోసారి వివరిస్తాడు. వాటికి ముగ్ధురాలైన కరాళీ తాను నంబూద్రీతోనే ఉంటానని చెబుతుంది. మరోవైపు పంచమి, మోక్ష, సుబ్బులు కలిసి ఇల్లు చేరుకుంటారు. కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వరు. ముఖ్యంగా మోక్షను అక్కడే వదిలి పెట్టి పంచమిని వెళ్లిపోవాలని చెబుతారు. ఇందుకు స్పందించిన పంచమి.. మోక్ష బాబు త్వరలోనే బాగవుతాడని, తానే మార్చుకుంటానని చెబుతుంది.

కానీ కుటుంబ సభ్యులు మాత్రం.. పంచమి వల్లే మోక్షకు ఆ పరిస్థితి వచ్చిందంటూ అంతా నిందలు మోపుతారు. ఓవైపు మోక్ష తండ్రి మోక్షను ఇంట్లోకి రమ్మని లాక్కెళ్తుంటే.. తాను లోపలికి రానని, పంచమి లేకుండా అస్సలే అడుగు పెట్టనని అంటాడు. ఇంతలోనే వారితో పాటు వచ్చి సుబ్బు (బాల సుబ్రహ్మణ్య స్వామి) గట్టిగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఒక్కసారిగా సుబ్బు నవ్వవడంతో కుటుంబ సభ్యులు అంతా ఫైర్ అవుతారు. ఎందుకు నవ్వుతున్నావని ప్రశ్నించగా.. భార్యాభర్తలను విడదీయడం తప్పని చెబుతాడు. ఆ తర్వాతే పంచమి.. మోక్ష కోసం సుబ్రహ్మణ్య వ్రతం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది.


Click it and Unblock the Notifications











