Naga Panchami October 9th: మోక్ష, పంచమిలు ఇంటికి వచ్చేసినట్లు నంబూద్రీకి చెప్పిన వైదేహి, ఏం జరగబోతుంది?

Naga Panchami October 9th: మోక్ష, పంచమిలు ఇంటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వారిని ఇంట్లోకి రానివ్వరు. గుమ్మం వద్దే నిల్చోబెట్టి మోక్షను మాత్రమే ఇంట్లోకి రమ్మంటారు. పంచమి లోపలికి వచ్చేందుకు అస్సలే ఒప్పుకోరు. కానీ మోక్ష.. పంచమి రాకపోతే లోపలికి రానని చెప్పడం, అందులోనూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన మాటలతో వారు ఇంట్లోకి వచ్చేందుకు ఒప్పుకుంటారు. అలాగే మోక్ష బాగు కోసం ఓ వారం రోజుల పాటు పంచమి పూజలు చేస్తానని అందుకు కుటుంబ సభ్యుల అనుమతి కావాలని అడుగుతుంది. అందుకు ముందు కుటుంబ సభ్యులు ముందు ఒప్పుకోకపోయినా.. చివరకు ఒప్పుకుంటారు. ఇలా పంచమమి, మోక్షలు ఇంట్లోకి వస్తారు.

ఆ తర్వాత మోక్ష తల్లి వైదేహి.. నంబూద్రీకి ఫోన్ చేసి మోక్ష, పంచమిలు ఇంటికి వచ్చినట్లు చెబుతుంది. మోక్ష పరిస్థితి ఇలా అయ్యిందేంటి స్వామి అంటూ కలత చెందుతుంది. అందుకు నంబూద్రీ మీరేం భయపడకండి పంచమిని కూడా ఇంట్లోనే ఉంచుకోండి అని చెబుతాడు. తన వల్లే మోక్ష ఇలా అయ్యాడని.. తనను ఇంట్లోంచి పంపిస్తే బాగుంటుందనిపిస్తుందని వైదేహి అంటుంది. కానీ నంబూద్రీ అలా చేయొద్దు, విడాకులు అవీ అంటే పరువు పోతుందని చెప్పి వైదేహీని ఒప్పిస్తాడు. అలాగే తన అనుచరుడిని ఇంటికి పంపిస్తానని.. అతడే మోక్ష బాగోగులు చూసుకుంటాడని చెబుతాడు. అందుకు వైదేహీ సరేనంటుంది.

Panchami Said She Will Do Subrahmanya Varatham in Home

ఆ తర్వాత ఇంట్లోని వాళ్లంతా వినాయక పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈక్రమంలోనే శబరి వచ్చి వినాయక విగ్రహం తెచ్చారా అని అడగ్గా.. చిత్ర, జ్వాలలు తాము తెస్తామంటారు. అంతలోనే సుబ్బు వచ్చి తాను విగ్రహం తీసుకు వచ్చినట్లు చెబుతాడు. కాన్ని దాన్ని తీసుకొచ్చేందుకు నిష్ఠ, భక్తితో వెళ్లాలని అంటాడు. ఈక్రమంలోనే కాసేపు చర్చ నడుస్తుంది. ఇదంతా జరుగుతుండగా.. వైదేహీ మోక్షను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

విషయం గుర్తించిన శబరి పండగ పూట ఎందుకు ఏడుస్తున్నావంటూ వైదేహిని అడుగుతుంది. అందుకు వైదేహీ.. ఎలా ఉండే తన కొడుకు, ఎలా అయ్యాడో చూడమంటూ బోరుమంటుంది. శబరి కోడలిని ఏడవద్దని చెబుతూ ధైర్యం చెబుతుంది. త్వరలోనే మోక్ష బాగవుతాడని.. రోజులన్నీ ఒకేలా ఉండవని వివరిస్తుంది. ఆ దేవుడి దయతో తమకు అంతా మంచే జరుగుతుందని ఓదారుస్తుంది. ఆ తర్వాత వాళ్లు పూజ చేయబోయే వినాయకుడిని రూపాన్ని కాసేపు చూపిస్తారు.

Panchami Said She Will Do Subrahmanya Varatham in Home

ఇక రేపటి ఎపిసోడ్ లో.. పంచమి సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ప్రారంభించడం మనం చూడవచ్చు. పూజారి పంచమికి సుబ్రహ్మణ్య స్వామి దీక్ష మాల వేస్తుంటే.. సుబ్బు ఆపుతాడు. ఒక్కసారిగా ఆలోచించుకో.. వ్రతం చేయగలవో లేదే అంటాడు. ఈ ఇంట్లో నీకు ఎవరూ సహకరించరు, ఎన్నో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు.

Panchami Said She Will Do Subrahmanya Varatham in Home

కానీ పంచమి మాత్రం వాటన్నిటినీ తట్టుకుంటానని.. కచ్చితంగా వ్రతం చేసి తీరతానని అంటుంది. ఆ తర్వాత స్వామి వారి మాల ధరిస్తుంది. పసురు రంగు చీరలో.. మాల ధరించిన పంచమిని చూస్తే దైవత్వం ఉట్టిపడుతుంది. మరి పంచమి చేస్తున్న వ్రతాన్ని అడ్డుకునేందుకు నంబూద్రీ, కరాళీలు, అటు చిత్ర, జ్వాలలు ఏం చస్తారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X