Bigg Boss Telugu 5 Week 9th Elimination: ఓటింగ్‌లో బిగ్‌ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు. ఈ వారం అతడేనా?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోకు సంబంధించి ఓటింగ్ విషయంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. టాప్ కంటెస్టెంట్లందరూ తాజా ఓటింగ్‌తో ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కోబోతున్నారు. కొద్ది రోజుల వరకు సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కొందరు డేంజర్ జోన్‌లోకి జారుకొన్నారు. దాంతో 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. దాంతో ఇంటి నుంచి ఈ వారం ఎవరు వెళ్లిపోతారనే విషయంపై బిగ్‌బాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం ఓటింగ్, అలాగే ఎలిమినేషన్ ముప్పు ఎవరు ఎదుర్కొంటున్నారో ఓసారి తెలుసుకొందాం..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఊహించిన విధంగానే లోబో ఎలిమినేషన్

ఊహించిన విధంగానే లోబో ఎలిమినేషన్

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 8వ వారం అందరూ ఊహించినట్టే ఎలిమినేషన్ జరిగింది. ఇంటిలో ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్‌గా పేరు తెచ్చుకొన్న లోబో తన పేలవమైన ఆట కారణంగా ఇంటి నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతి తక్కువ ఓటింగ్ కారణంగా 8వ వారం ఎలిమినేట్ అయ్యారు.

9వ వారం నామినేషన్‌లో ట్విస్టు

9వ వారం నామినేషన్‌లో ట్విస్టు

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో ఎప్పటి మాదిరిగానే గందరగోళాలు, విమర్శలు, ఆరోపణల మధ్య నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తొలుత ఇంటి సభ్యులందరూ అంటే అనీ మాస్టర్, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, విశ్వ, మానస్, ప్రియాంక, యాంకర్ రవి, సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, వీజే సన్నీ నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టుతో నామినేషన్ నుంచి కొందరు సేఫ్ అయ్యారు. అనీ మాస్టర్ వద్ద ఉన్న పవర్ కాయిన్‌తో ఒకరిని నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. దాంతో ఈ వారం ఫైనల్‌గా శ్రీరామచంద్ర, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్, సిరి హన్మంతు, జస్వంత్, విశ్వ, యాంకర్ రవి నామినేట్ నామినేషన్ జాబితాలో చేరారు.

9వ వారంలో భారీగా ఓటింగ్

9వ వారంలో భారీగా ఓటింగ్

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో కీలకంగా మారిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఓటింగ్‌కు కేవలం నాలుగు రోజులే సమయం చిక్కింది. దాంతో తమ అభిమాన కంటెస్టెంట్లను రక్షించుకొనేందుకు భారీగా ఓటింగ్‌ రంగంలోకి ఫ్యాన్స్ దిగారు. దాంతో ఎవరూ ఊహించని విధంగా ఓటింగ్ జరిగింది. టాప్ సెలబ్రిటీలు నామినేషన్‌లో ఉండటంతో ఓటింగ్ తీరు అంచనాలు తప్పింది.

టాప్ పొజిషన్స్‌లో సన్నీ, శ్రీరామ్, రవి

టాప్ పొజిషన్స్‌లో సన్నీ, శ్రీరామ్, రవి

బిగ్‌బాస్ తెలుగు ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్‌లో 44 శాతం ఓటింగ్‌తో వీజే సన్నీ టాప్‌ పొజిషన్‌లో నిలిచారు. ఆ తర్వాత 15 శాతంతో శ్రీరామచంద్ర, 13 శాతంతో యాంకర్ రవి, 11 శాతంతో సిరి హన్మంతు, 9 శాతంతో ప్రియాంక సింగ్, 7 శాతంతో ఆర్జే కాజల్, 7 శాతంతో యాక్టర్ విశ్వ, 6 శాతం ఓటింగ్‌తో జెస్సీ నిలిచారు.

జస్వంత పడాల డేంజర్ జోన్‌లో

జస్వంత పడాల డేంజర్ జోన్‌లో

శుక్రవారం అంటే... నవంబర్ 5వ తేదీ వరకు జరిగిన తాజా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఎలిమినేషన్ ముప్పును జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, యాక్టర్ విశ్వ ఎదుర్కొంటున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడతున్న విశ్వ గతవారం తన ప్రతిభను చాటుకోలేకపోయారు. దీంతో తన అభిమానులను నిరుత్సాహపరిచారు. దాంతో ఎలిమినేషన్ జోన్‌లో చేరిపోయారు. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప జెస్సీ బయటపడే అవకాశాలు కనిపించడం లేదు.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
 9వ వారంలో మిస్డ్ కాల్ డేటానే కీలకం

9వ వారంలో మిస్డ్ కాల్ డేటానే కీలకం

అయితే ఇప్పటి వరకు తెలిసిన ఓటింగ్ వివరాలు డిస్నీ+హాట్ స్టార్ యాప్ ద్వారా నమోదైన ఓటింగ్. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో కీలకంగా మిస్డ్ కాల్ డేటా మారింది. మిస్డ్ కాల్ డేటాలో వీక్ కంటెస్టెంట్లు ఘనంగా ఓట్లు సంపాదించుకొంటే తప్ప జెస్పీ, ఆర్జే కాజల్, విశ్వ బయటపడటానికి అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X