twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam పెళ్లి చేసుకొంటానని హిమ అంగీకారం.. అలా అయితే బ్రహ్మచారిగా ఉంటానని నిరుపమ్

    |

    నిరుపమ్‌తో పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పిన హిమపై సౌందర్య, ఆనందరావు మరోసారి సీరియస్ అయ్యారు. నిరుపమ్‌తో నిశ్చితార్థం బ్రేకప్ అయిందనే విషయం అందరికి తెలిసి పోయింది. అందరి నోళ్లు ముగించాలంటే.. నీ పెళ్లి చేయించాల్సిందే. నీ మనసులో ఉన్న విషయం చెప్పవు. కానీ మేము చూసే పెళ్లి మీకు ఇష్టమేనా చెప్పు అని సౌందర్య, ఆనందరావు అడిగితే.. హిమ మౌనంగా నిలబడింది. దాంతో మీరు అడిగి ఎందుకు మీ గౌరవాన్ని తగ్గించుకొంటారు.

    పెళ్లి చేసుకొంటారా? అని అడిగితే.. చేసుకొంటానని చెబుతుందా అని సౌందర్య అంటే.. ఈ పెళ్లికైనా ఒప్పుకొంటావా అని ఆనందరావు మరోసారి అడిగాడు. దాంతో మౌనమే సమాధానం కావడంతో.. మనల్ని సాధించడానికే ఉంది.. మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నావు అని సౌందర్య ఆవేశంగా అరిచింది. దాంతో నేను పెళ్లి చేసుకొంటానని హిమ సమాధానం చెప్పడంతో ఆనందరావు, సౌందర్య ఆశ్చర్యపోయారు. కార్తీకదీపం సీరియల్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    సరైన నిర్ణయం తీసుకో.. అంటూ

    సరైన నిర్ణయం తీసుకో.. అంటూ

    హిమ మాటలు విని.. ఏమన్నావు అంటే.. అవును పెళ్లి చేసుకొంటానని సమాధానం చెప్పింది. నిరుపమ్ బావ మనసులో నాపై ప్రేమ తగ్గాలంటే.. నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. స్వప్న అత్త బావ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నది. కానీ డాక్టర్ శోభను నిరుపమ్ పెళ్లి చేసుకొంటారనే నమ్మకం నాకు లేదు అని హిమ అంది.

    దాంతో నీవైనా వెళ్లి నిరుపమ్‌కు శోభను పెళ్లి చేసుకోమని చెప్పు అని సౌందర్య సెటైర్ వేసింది. నీకు అక్కరలేనందుకు వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు. కనీసం నీవైనా వాడిని పెళ్లి చేసుకోమని ఒప్పించు అని సౌందర్య మండిపడింది. నీవు డాక్టర్‌వు. నీవు సరైన నిర్ణయం తీసుకోవాలి అని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో మీకు నిజం చెప్పలేను. ఈ విషయంలో నన్ను క్షమించండి అంటూ హిమ ఎమోషనల్ అయింది.

    జీవితంలో అర్ధం కానివి చాలానే..

    జీవితంలో అర్ధం కానివి చాలానే..


    ఇదిలా ఉండగా, తండ్రి సత్యం ఇంటికి నిరుపమ్ వచ్చి ప్రేమ్ ఉన్నాడా అని అడిగితే.. లోపల ఉన్నాడు. ఇంతకు నీవు బాగున్నావా? అని అడిగితే. ఏదో అలా ఉన్నాను. జీవితంలో అర్ధం కానివి చాలా ఉన్నాయి నాన్న అంటే.. నీతో ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు అని సత్యం అన్నారు. భోజనం చేసావా అంటే.. ఏదో చేశాను అని అంటే.. వెంటనే సత్యం ఫోన్ చేసి.. జ్వాలా మీ డాక్టర్ సాబ్ వచ్చాడు. అందరికి సరిపడేలా భోజనం తీసుకురా అని అన్నారు. హిమ ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాన్ని కనీసం జ్వాలాతో అడిగించు.. ఆలస్యం చేయకు అని నిరుపమ్‌కు సత్యం సలహా ఇచ్చాడు.

    బెదిరించే.. కొట్టే.. తిట్టే హక్కు నీకు ఉంది

    బెదిరించే.. కొట్టే.. తిట్టే హక్కు నీకు ఉంది


    నిరుపమ్‌కు భోజనం తీసుకెళ్లూ.. మనం ఇష్టపడే వాళ్లకు భోజనం పెట్టడంలో అంతకంటే ఆనందం ఏముంటుంది? అని మనసులో ఆనందపడిపోతుంటే.. ఎదురుగా సౌందర్య కారు ఆపుకొని నిలుచోవడం చూసి కంగారు పడిపోయింది. ఆటో ఆపి సౌందర్య దగ్గరకు జ్వాలా వెళ్లగానే.. నీ నాటకాలన్నీ తెలిపిపోయావు. అవసరం లేకున్నా నా వద్దకు వస్తావు..

    ఇప్పుడు కనిపించకుండా పోయావు అని సౌందర్య అనగానే.. నిజం తెలిసిపోయిందని భయపడ్డాను. అయితే నిజం తెలియలేదు జ్వాలా హ్యాపీగా ఫీలయ్యింది. అయితే తనను బెదిరించడంపై సౌందర్యను జ్వాలా ప్రశ్నిస్తే.. నిన్ను బెదిరించే హక్కు నాకు ఉంది అని సౌందర్య అంటే.. అవును ఆ హక్కు.. కొట్టే తిట్టే హక్కు నీకు ఉంది అని మనసులో అనుకొంటూ.. నీవు కూడా నా ప్రేమలో పడిపోయావా? అంటే.. ప్రేమలో పడటం కాదు.. మనిషికి మనిషికి అనుబంధం ఉంటుంది కదా అంటే.. మన మధ్య ఉంది రక్త సంబంధం.. ఎటు వెళ్తున్నావు అంటే.. టిఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నాను అని జ్వాలా సమాధానం ఇచ్చింది. దాంతో ఎవరి కోసం తీసుకెళ్తున్నావు అంటే.. నా మొగుడి కోసం అంటూ సమాధానం చెప్పింది. దాంతో నీకు మంచి మొగుడు దొరుకుతాడు. వాడు అమాయకుడే దొరుకుతాడు అంటూ సౌందర్య దీవించింది.

    నా మొగుడు అందగాడు అంటూ

    నా మొగుడు అందగాడు అంటూ


    నా మొగుడు అమాయకుడు కాదు.. అందగాడు అంటే.. అతడిని బాగా చూసుకొంటాను అని చెప్పి వెళ్తుంటే.. నన్ను మీ ఇంటికి తీసుకెళ్లవా? అంటే.. మీ ఇంటికి నేను రావడమే.. మా ఇంటికి రావడం కుదరదు అంటే.. ఫోన్ తీసి.. ఇలాంటి అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అని సౌందర్య అంటే.. అచ్చం నా మాదిరిగానే ఉంది అంటూ జ్వాలా సమాధానం చెప్పింది. ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడెందుకు పుట్టిందని జ్వాలా ప్రశ్నిస్తే.. మనసులోని బాధలు చెప్పుకోలేం అని సౌందర్య జవాబిచ్చింది. నాకు కూడా చెప్పుకోలేనం బాధ ఉంది. నేను వస్తాను. నా మొగుడికి టిఫిన్ తీసుకెళ్లాలి అని బయలుదేరబోతుంటే.. మళ్లీ ఎప్పుడు కలుద్దాం అని సౌందర్య అడిగింది. దాంతో సాయంత్రం కలుద్దాం అప్పుడు నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని జ్వాలా చెప్పింది.

    జ్వాలాను తిట్టేసిన ప్రేమ్

    జ్వాలాను తిట్టేసిన ప్రేమ్


    ప్రేమ్, నిరుపమ్‌ను చూస్తూ మీ ఇద్దరిని ఇలా చూడటం హ్యాపీగా ఉంది. కానీ మీ ఇద్దరు ఇలా బాధలో ఉండటం బాగాలేదు అని అంటే.. పక్కనే ఉన్న ప్రేమ్‌ను చూస్తూ నీకేమైందిరా అంటే.. ఏం కాలేదు అంటూ ప్రేమ్ సమాధానం చెబుతుండగా.. హలో ఎక్స్‌ట్రా అంటూ జ్వాలా వచ్చేసింది. జ్వాలాను చూసి.. అలా చెప్పాడో లేదో.. ఇలా వచ్చాసేవంటి? అంటే.. జ్వాలా అంటే.. ఏమనుకొంటున్నావు అని అంది.. అయితే తనను ఎక్స్‌ట్రా అని అనకు అంటూ పిలువొద్దు.. ఇదే లాస్ట్ వార్నింగ్. నీకు నాకు ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేదు. వచ్చావా? భోజనం తెచ్చావా? డబ్బులు తీసుకొన్నావా అంతే అని ప్రేమ్ అన్నాడు.

    దాంతో నేను డబ్బు కోసమే భోజనం తెస్తానా అంటే.. అవును.. అంతకంటే నీవు నా మేనమామ కూతురివా అని చెడామడా తిట్టేసింది. దాంతో సత్యం, నిరుపమ్ వారించబోయారు. అయితే నా ప్రేమను చెప్పకుండా జ్వాలా అడ్డుపడింది అనుకొంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రేమ్ మాటలను పట్టించుకోకు. వాడి తరపున సారీ చెబుతున్నా అంటే.. మీరు సమాధానం చెప్పడం ఏమిటి? అని జ్వాలా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    బ్రహ్మచారిగా ఉంటా అని నిరుపమ్

    బ్రహ్మచారిగా ఉంటా అని నిరుపమ్


    తన పెళ్లి ప్రయత్నాలు తల్లి చేయడం గురించి చెబుతూ.. నాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నది. మీరు వద్దని గట్టిగా చెప్పవచ్చుగా అని నిరుపమ్ అంటే.. నేను చెబితే వింటుందా అని సత్యం జవాబిచ్చాడు. నా పెళ్లి విషయంలో మీకు బాధ్యత ఉంది. నా కొడుకు పెళ్లి విషయంలో నాకు బాధ్యత ఉంది అని చెప్పండి.. నా పెళ్లి నాకు నచ్చిన వాళ్లతోనే జరుగుతుంది. లేకపోతే బ్రహ్మచారిగా ఉంటా అని నిరుపమ్ అక్కడి నుంచి హాస్పిటల్‌లో హిమ ప్రేమ గురించి ఆలోచనల్లో పడిపోయాడు. బావా నీవు అంటే ఇష్టం అనే మాటలు గుర్తొచ్చాయి. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

    Recommended Video

    Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
    పెళ్లి జరిగితే అది నీ తోనే అంటూ నిరుపమ్

    పెళ్లి జరిగితే అది నీ తోనే అంటూ నిరుపమ్


    ఇదిలా ఉండగా.. కార్తీకదీపం తాజా ప్రోమోలో మరో ట్విస్టుకు తెరలేపారు. పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో చెప్పు హిమ అంటూ నిరుపమ్ నిలదీశాడు. ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావంటగా.. అని నిరుపమ్ అంటే.. దేవుడు ఎవరికి రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అని హిమ సమాధానం చెప్పింది. దాంతో పెళ్లి అనేది మన ఇద్దరికే రాసిపెట్టి ఉంది. ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అని నిరుపమ్ వార్నింగ్ ఇస్తుంటే.. వెనుకనే జ్వాలా అక్కడికి వచ్చింది. నీకు పెళ్లంటే జరిగితే నాతోనే జరుగుతుంది. ఇంకా ఎవరితోను జరగదు అని అంటుంటే.. జ్వాలా అక్కడికి రావడం చూసి హిమ షాక్ తిన్నట్టు కనిపించింది. నిరుపమ్ మాటలు విన్న జ్వాలా కూడా దిగ్బ్రాంతికి గురైనట్టు కనిపించింది.

    English summary
    Karthika Deepam May 30th Episode number 1365. Hima promised to marry someone who are trying soundarya and Ananda Rao
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X