Karthika Deepam నా పెళ్లి ఎందుకు చెడగొట్టావు.. గుండె ముక్కలైంది.. నిరుపమ్, హిమ మధ్య హైడ్రామా
పెళ్లి ఇష్టం లేదని అంటే.. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా చేసుకొంటుందని అనుకొన్నా. కారణం ఇప్పుడు కాకపోతే తర్వాతైనా చెబుతుందని అనుకొన్నాను. కానీ ఏకంగా ఇంకో పెళ్లి చేసుకోబోతున్నావంటే.. నేను నమ్మలేకపోయాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఏదో జరిగింది. ఎందుకో భయపడుతున్నావు. నీవు ప్రేమించింది నిజమా కాదా? మనకంటూ ఓ మనసాక్షి ఉంటుంది కదా.
నీవు ప్రేమించి నిజమా? కాదా అని నిరుపమ్ ప్రశ్నల వర్షం కురిపిస్తే.. నా పెళ్లి సంబంధం ఎందుకు చెడగొట్టావు అంటే.. నేను ఏమని అడుగుతున్నా. నీవేం సమాధానం చెబుతున్నావు అని నిరుపమ్ అంటే.. నా పెళ్లి ఎందుకు చెడగొట్టావు అని మళ్లీ హిమ ప్రశ్నించింది. కార్తీకదీపం సీరియల్‌లోని తాజా ఎపిసోడ్ 1368లో ఇంకా ఏం జరిగిందంటే?

బావా అని పిలువకుండా
నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే.. పెళ్లి ఎందుకు చెడగొట్టావని అడుగుతున్నావు నిరుపమ్ అంటే.. నా పెళ్లిపై నాకు హక్కు ఉంది నిరుపమ్ అంటే.. నన్ను బావా అని పిలవకుండా నా పేరు పెట్టి పిలుస్తున్నావా? నా గుండెలు ముక్కలు చేశావు అని నిరుపమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నా మీద నీకు ప్రేమ లేదా? అయితే నేను జ్వాలాతో క్లోజ్‌గా ఉంటే.. నీవు ఎందుకు అసహనం వ్యక్తం చేశావు అని నిరుపమ్ అంటే.. ప్రశ్నలు వేయకుండా.. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని హిమ బదులు ఇచ్చింది. అయితే ఆ శోభను పెళ్లి చేసుకోమంటావా? అని అంటే.. ఛీఛీ.. శోభను నేను ఎందుకు పెళ్లి చేసుకోమని అంటాను అని నిరుపమ్ అన్నారు.

నన్ను ఛీఛీ అంటావా?
హిమతో వాడివేడిగా వాదనలు జరుగుతుంటే.. అంతలోనే ఫోన్ రావడంతో.. నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది.. అందుకే బయటకు వెళ్లిపోతున్నా అని నిరుపమ్ అన్నాడు. నిరుపమ్ బయటకు వెళ్లగానే.. డాక్టర్ శోభ వచ్చింది.. నన్ను ఛీఛీ అంటావా అని శోభ కోపంతో ఊగిపోయింది.
నీవు సాధు జీవి అని అనుకొన్నాను అని శోభ అంటే.. బయట నుంచి చాటుగా మాటలు విన్నావా? అని హిమ అంటే.. వినాల్సి వచ్చింది అంటూ శోభ చెప్పింది. నిరుపమ్‌ను పెళ్లి చేసుకొని చూపిస్తా అని శోభ సవాల్ విసిరి వెళ్లింది. దాంతో నిరుపమ్, జ్వాలాకు పెళ్లి చేయాలని చూస్తుంటే.. అత్తయ్య, శోభ కుట్రలు చేస్తున్నారా అని హిమ మనసులో అనుకొన్నది.

శోభకు షాకిచ్చిన నిరుపమ్
నిరుపమ్ బయటకు వెళ్లగానే జ్వాలా కనిపించగానే.. పద మనం ఎక్కడికైనా వెళ్దాం అని అన్నాడు. అంతలోనే శోభ వెనక వచ్చి.. మనం కారులో వెళ్దా పద అని అంటే.. నీవు చెప్పిన మాటను మరిచావా? నీవే కదా.. వేరే అమ్మాయితో తిరిగితే.. హిమ మనసులో ఉన్న విషయం బయటకు వస్తుందని చెప్పావు అని నిరుపమ్ అని.. జవాబు కోసం వేచి చూడకుండా బయటకు వెళ్లిపోయాడు.
Recommended Video


హిమకు ప్రేమ్ సెల్ఫీ వీడియోతో లవ్ లెటర్
ఇక ప్రేమ్ తన మనసులోని మాటను హిమకు చెప్పడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. తాను ప్రపోజ్ చేయాలని అనుకొంటే జ్వాలా అడ్డుపడింది.. లేదు. ఇక నేను ప్రేమ లేఖ రాస్తా అని ట్రై చేశాడు. ప్రేమ లేఖ రాయలేకపోవడంతో.. వీడియో రికార్డింగ్ ద్వారా తన మనసులోని భావాలను రికార్డు చేసి హిమకు తెలియజేయాలని అనుకొన్నాడు. సెల్ఫీ వీడియో ప్రేమలేఖను షూట్ చేశాడు.

అనాధాశ్రమంలో నిరుపమ్, జ్వాలా
నిరుపమ్ బయటకు వచ్చి అనాథ ఆశ్రమానికి వచ్చాడు. హిమ గురించి ఆలోచిస్తూ.. తనను ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయంపై ఆలోచించడం మొదలుపెట్టాడు. మా మధ్య ఎక్కడ చెడిందని మదనపడ్డాడు. నిరుపమ్‌ను చూసిన ఆశ్రమంలోని ఆయా వెంటనే శోభకు ఫోన్ చేసి తను వచ్చినట్టు చెప్పాడు. అంతలోనే నిరుపమ్కు జ్వాలా ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే.. అనాధశ్రయంలో ఉన్నాను... ఫ్రీగా ఉంటే రమ్మని చెప్పాడు. దాంతో డాక్టర్ సాబ్ ఫోన్ చేస్తే వెళ్లకుండా ఉంటావా అని జ్వాలా అక్కడికి వెళ్లింది.

తల్లికి నిరుపమ్ ఎదురు ప్రశ్నలు
నిరుపమ్‌ను చూసి.. డాక్టర్ సాబ్ ఇక్కడికి వచ్చారేంటి? అంటే.. నా మనసు తీసుకొచ్చింది అని నిరుపమ్ అన్నాడు. అయితే మనసు అంటే.. నీ మనసులో నేను ఉన్నా అని తెలిసింది అని జ్వాలా మనసులో అనుకొన్నది. నాకు మంచి ప్లేస్‌ను పరిచయం చేశావు. ఎవరు ఉన్నా లేకున్నా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని నిరుపమ్ అన్నాడు.
అంతలోనే నిరుపమ్‌కు తల్లి ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నావు? నీ వెంట ఎవరు ఉన్నారు. ఆ ఆటోదే ఉంది కదా.. ఆ ఆటోదానితో తిరగడం ఏమిటో అర్ధం కావడం లేదు అని తల్లి అంటే.. నాకు నచ్చింది చేస్తాను. ఇష్టమైతే కారులో లేదా ఆటోలో వెళ్తాను. నాకు ఆటో అంటే ఇష్టం అని ఘాటుగా నిరుపమ్ జవాబిచ్చాడు.

21వ వారంలో దారుణంగా పడిపోయిన కార్తీకదీపం రేటింగ్
ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ రేటింగ్ దారుణంగా క్షీణిస్తున్నది. తాజా వారం అంటే.. ఈ ఏడాది 21వ వారంలో ఈ సీరియల్ రేటింగ్ గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా కనిష్టానికి చేరుకొన్నది. విపరీతమైన సాగదీత.. ఐపీఎల్ టోర్ని ఈ సీరియల్‌కు నెగిటివ్‌గా మారిందని టెలివిజన్ వర్గాలు అంటున్నాయి. రానున్న రోజుల్లో ఈ సీరియల్ రేటింగ్ మళ్లీ 15 పాయింట్లకుపైగా చేరుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











