Karthika Deepam దేవుడు రాసి పెట్టాడు.. పెళ్లంటూ జరిగితే నీతోనే.. నిరుపమ్ ఎమోషనల్

తల్లి స్వప్న చెప్పిన విషయాలతో డాక్టర్ నిరుపమ్ దిగ్బ్రాంతికి గురయ్యాడు. నిన్ను రిజెక్ట్ చేసిన హిమ పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతున్నది. నువ్వేమో హిమ ప్రేమ గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిలా మారుతున్నావు. విజయవాడలో డాక్టర్ చంద్రశేఖర్ గురించి తెలుసా అని స్వప్న అడిగితే.. ఫేమస్ డాక్టర్ అంటూ నిరుపమ్ సమాధానం ఇచ్చాడు. అయితే డాక్టర్ చంద్రశేఖర్ కుమారుడికి హిమను ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని స్వప్న అసలు విషయం బయటపెట్టంది. దాంతో నీవు చెప్పేది నిజమేనా అంటూ నిరుపమ్ కంగారు పడ్డాడు. కార్తీకదీపం సీరియల్‌లో 1367 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా

పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా

విజయవాడలో ఉండే డాక్టర్ చంద్రశేఖర్ గురించి నాకెలా తెలుస్తుంది. వాళ్ల అబ్బాయి డాక్టర్ అని నాకు ఎలా తెలుస్తుంది. నిన్ను వద్దనుకొన్న హిమ మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నది అని స్వప్న తనదైన శైలిలో కొడుకు మనసు మార్చే ప్రయత్నం చేసింది. అయితే నా పెళ్లి గురించి నాకు చెప్పకు. నిజంగానే హిమ పెళ్లి జరుగుతుందా అని నిరుపమ్ అంటే.. మీ అమ్మమ్మను అడిగి తెలుసుకో అని స్వప్న అంటే.. అమ్మమ్మ చేస్తుందా.. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అంటూ నిరుపమ్ ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు.

నీ పెళ్లిని ఆపేస్తా

నీ పెళ్లిని ఆపేస్తా

ఇంటి నుంచి బయటకు వచ్చిన డాక్టర్ నిరుపమ్ నేరుగా హిమను కలిశాడు. నిరుపమ్ కోపాన్ని చూసి హిమ బెదిరిపోయింది. కారులో ఉండటంతో బయటకు లాగి.. ఇప్పుడు చెప్పు హిమ.. ఎవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యావట కదా.. బావా.. నీవు అంటే ఇష్టమని ఎంగేజ్‌మెంట్ ముందు రోజు చెప్పావు. అయితే నీవు ఎవరో బెదిరించారేమో.. సర్దుకొంటాయని ఆగాను. కానీ దేవుడు మన పెళ్లి రాసిపెట్టాడు. పెళ్లి అంటూ జరిగితే అది నీతోనే.. నీ పెళ్లిని ఆపేస్తాను అని నిరుపమ్ అంటుంటే.. శౌర్య అలియాస్ జ్వాలా అక్కడికి వచ్చింది. ఏమిటి ఇద్దరు గట్టిగా గొడవ పెట్టుకొంటున్నారని జ్వాలా అనుకోవడం కనిపించింది. జ్వాలా రాకను గుర్తించిన హిమ.. ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడకంటూ దాటవేసే ప్రయత్నం చేసింది.

హిమను నిలదీసిన జ్వాలా

హిమను నిలదీసిన జ్వాలా

అయితే జ్వాలా దగ్గరకు వస్తుంటే.. నిరుపమ్, హిమ ఇద్దరు ఆపరేషన్ గురించి మాట్లాడుకోవడంతో జ్వాలా ఆశ్చర్య పడింది. అయితే నీ ఆపరేషన్ జోలికి నేను రాను.. నా ఆపరేషన్‌ జోలికి నేను రాను అని అంటే.. నీ మనసులో ఏముందో చెప్పాలి. అప్పుడే నేను మాట్లాడను అని నిరుపమ్ గట్టిగా అరవడంతో ఏంటీ ఆపరేషన్ గురించి అంతగా అరుచుకొంటున్నారు అని జ్వాలా అడిగింది. దాంతో తననే అడుగు అంటూ నిరుపమ్ అంటే.. బావనే అడుగు అంటూ హిమ చెప్పింది. దాంతో జ్వాలా నా మూడ్ బాగాలేదు. నేను ఇప్పుడు మాట్లాడలేను అంటూ నిరుపమ్ వెళ్లిపోతుండగా.. డాక్టర్ చెప్పిన మాటను వినొచ్చుగా.. అని జ్వాలా అంటే.. బావ నన్ను ప్రేమిస్తున్నాడు.. నీవు డాక్టర్ సాబ్‌ను ప్రేమిస్తున్నావు. నా విషయంలో జోక్యం చేసుకోకు అంటూ హిమ చెబితే.. ఏంటి నాకు ఎదురు చెబుతున్నావు అంటూ జ్వాలా అడిగింది.

నిరుపమ్ వార్నింగ్ అంటూ

నిరుపమ్ వార్నింగ్ అంటూ

అయితే జ్వాలా వద్దకు వచ్చి నేను ఈ రోజు అంతా చెబుతాను అంటూ నిరుపమ్ చేయిపట్టుకోగానే.. హిమ వచ్చి విడిపించి.. ఇప్పుడు వద్దు.. నీవు వెళ్లమని.. నిరుపమ్‌ను అక్కడి నుంచి పంపేసింది. ఆ తర్వాత జ్వాలా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. ఆనందరావు వద్దకు సౌందర్య వచ్చి.. డాక్టర్ చంద్రశేఖర్‌కు నిరుపమ్ ఫోన్ చేసి. పెళ్లి చేసుకోవద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడట అని అంటే.. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా అని ఆనందరావు అడిగితే.. హిమ మీద ఉన్న ప్రేమ వల్లే నిరుపమ్ ఇలా చేశాడు అని సౌందర్య చెప్పింది.

హిమ నన్నే ప్రేమిస్తున్నావు అంటూ

హిమ నన్నే ప్రేమిస్తున్నావు అంటూ

అయితే నిరుపమ్ గురించి హిమ ఆలోచిస్తూ.. బావా నీకు అసలు విషయం చెప్పలేకపోతున్నాను. జ్వాలా విషయం చెబితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో. నేను ఊహించగలను. నీకు ఇంకా నా మీద కోపం రావాలి. నాపై ద్వేషం పెరగాలి. నాపై ఉన్న ప్రేమ ఇంకా తరగాలి అని మనసులో హిమ అనుకొంటుండగా.. నిరుపమ్ వచ్చి.. ఇక దాగుడుమూతల ఆట ఇప్పటికైనా ఆపుతావా? ఆఖరి నిమిషంలో పెళ్లి ఇష్టం లేదని చెప్పావు. బావా ఇష్టం లేదని చెప్పలేదు అని నిరుపమ్ అంటే.. ఎంత చెప్పినా నాపై ఇష్టం తగ్గడం లేదు అంటూ హిమ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వేరే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం పడుతున్నావంటే.. నమ్మలేకపోతున్నా. నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు. నీవు ప్రేమించావని నిజం. మన మనసాక్షి అందుకు సాక్ష్యం అని నిరుపమ్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X