Karthika Deepam హిమకు పెళ్లి చూపులు.. షాక్‌లో డాక్టర్ నిరుపమ్

హిమ తనను పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పడంపై డాక్టర్ నిరుపమ్ బాధలో మునిగిపోయాడు. బావా మీరంటే ఇష్టం అని చెప్పిన మాటలు, అలాగే ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పిన మాటలు నిరుపమ్‌ను అతలాకుతలం చేశాయి. అంతలోనే హిమ వచ్చి.. డాక్టర్ నిరుపమ్ అంటూ పిలవడంతో నిరుపమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బావ అనే పిలుపు మరిచిపోయి డాక్టర్ నిరుపమ్ అంటావా అని ప్రశ్నిస్తే.. నిన్ను మరిచిపోవాలనే ప్రయత్నిస్తున్నాను అని హిమ తన మనసులో అనుకొన్నది. బంధాలు, పిలుపులు ఎలా మరిచిపోతారు. ఇది మీ ఆడవాళ్లకే సాధ్యం కదా. బావకు బదులు నిరుపమ్ అంటే ఎంత బాధగా ఉందో తెలుసా అని నిరుపమ్ అంటే.. నేను నీకు సరికాదు. నేను నీకు మరో అమ్మాయిని చూపిస్తాను అని హిమ జవాబిచ్చింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1366లో ఇంకా ఏం జరిగిందంటే..

 నిన్ను ఎవరైనా బెదిరించారా?

నిన్ను ఎవరైనా బెదిరించారా?


హిమను ఉద్దేశించి.. నీవు నాకు అమ్మాయిని చూపిస్తావా? ఏం మాట్లాడుతున్నావు. ఎంగేజ్‌మెంట్‌కు ముందు రోజు నీ మనుసులో మాటలు చెప్పావు. ఇప్పుడు నాకు పెళ్లి చేస్తానంటావు. ఏమైనా అడిగితే.. మౌనంగా ఉంటావు. నేను తిట్టలేను. నిన్ను ఎవరైనా బెదిరించారా? నీ మనసులో నాపై ప్రేమ ఉందని తెలుసు అని నిరుపమ్ అంటూ ఉంటే.. అంతలోనే డాక్టర్ శోభ వచ్చింది. సారీ అంటూ వెళ్లబోతే.. సారీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆగు.. మనం బయటకు వెళ్దాం అంటూ శోభను తీసుకొని నిరుపమ్ వెళ్లాడు. శోభ, నిరుపమ్ బయటకు వెళ్లడంతో బాధలో మునిగిపోయింది.

జ్వాలా ఇంటికి సౌందర్య

జ్వాలా ఇంటికి సౌందర్య


జ్వాలా అలియాస్ శౌర్య ఇంటికి సౌందర్య రావడంతో ఆమె సంప్రదాయంగా ఆహ్వానించింది. కుడికాలు ముందు పెట్టి రండి అంటూ లోపలికి తీసుకెళ్లింది. ఇంటిలో ఎవరు కనిపించకపోవడంతో ఎవరు లేరా? అని సౌందర్య అడిగితే.. చాలా మంది ఉన్నారు. కానీ నాకు తోడుగా ఎవరు లేరు. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అని జ్వాలా చెప్పింది. అయితే తనకు నీ వయసులో ఉన్న మనవరాలు ఉంది. ఆమెకు ఎంగేజ్‌మెంట్ చేయాలని అనుకొన్నాం. కానీ పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసింది అని సౌందర్య చెప్పింది.

నా శత్రువుకు నేను సాయం చేయాలా?

నా శత్రువుకు నేను సాయం చేయాలా?


సౌందర్య మాటలు విన్న జ్వాలా.. ఆహా పెళ్లి కూడా చేసుకోబోతుందా అని మనసులో అనుకొన్నది. అయితే జ్వాలాతో సౌందర్య మాట్లాడుతూ.. నీవు నాకు ఒక సహాయం చేయాలి. నీవు బాగా మాట్లాడుతావు కాబట్టి. నా మనవరాలికి పెళ్లి ఎందుకు ఇష్టం లేదో కనుక్కోవాలి అని సౌందర్య చెప్పింది. అయితే నా శత్రువుకు పెళ్లి చేయడానికి నేను సహాయం చేయాలా అంటూ జ్వాలా మనసులో అనుకొన్నది.

స్వప్నకు ఇంద్రుడు ఝలక్

స్వప్నకు ఇంద్రుడు ఝలక్


ఇదిలా ఉండగా, ఇంద్రుడు దంపతులు తనను మోసగిస్తున్నారని తెలుసుకొన్న స్వప్న వారికి పరీక్ష పెట్టింది. తన కారు పాడైపోయింది. ఒకసారి చూడండి అంటూ చెబితే.. కారును పరీక్షించిన వాళ్లు.. కారులో ఏం ప్రాబ్లెం లేదు. అంతా బాగానే ఉంది అని చెప్పాడు. అయితే బాగానే ఉందా అనుమానించేలా అడిగితే.. అవును అని చెప్పి.. మీకు మా మీద అనుమానం ఉన్నట్టుంది. మేము నీ కారును పాడు చేసి డబ్బులు చేస్తున్నామనే అనుమానం మాపై కలిగింది కదా అని చంద్రుడు అన్నాడు. దాంతో స్వప్న ఏం మాట్లాడలేకపోయింది. అయితే చంద్రుడిని ఎందుకు కారు బాగాలేదని చెప్పావంటే... మనపై అనుమానం వచ్చింది. జ్వాలా ఆటోను తగలపెట్టిందుకు సంగం డబ్బుల కొట్టేశాం. మిగితా సగం తర్వాత చూసుకొందామని ఇంద్రుడు, చంద్రుడు దంపతులు అనుకొన్నారు.

హిమకు పెళ్లి చూపులు

హిమకు పెళ్లి చూపులు


ఇక నిరుపమ్‌తో ఎంగేజ్‌మెంట్ ఇష్టం లేదని చెప్పడంతో సౌందర్య, ఆనందరావు.. హిమకు పెళ్లి చేసే బాధ్యతను ఎత్తుకొన్నారు. ప్రముఖ డాక్టర్ కుమారుడికి ఇచ్చే పనిని పెట్టుకొన్నారు. హిమకు పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. దాంతో పెళ్లి చూపుల విషయాన్ని నిరుపమ్‌కు చేరవేయాలని హిమ మనసులో అనుకొన్నది.

శోభ నాకు కోడలి లాంటిది

శోభ నాకు కోడలి లాంటిది


తల్లి స్వప్నతో నిరుపమ్ వాదనకు దిగాడు. నీవు ఉన్నా లేకున్నా.. డాక్టర్ శోభ ఇంటికి ఎందుకు వస్తున్నది అని నిలదీశాడు. నీకు ఆమెకు రిలేషన్ ఏంటి అంటే మాది అత్తా కోడళ్ల బంధం అంటూ స్వప్న సమాధానం ఇచ్చింది. అయితే నాకు అలాంటి రిలేషన్ లేదు. శోభ నాకు ఫ్రెండ్ మాత్రమే అని నిరుపమ్ అంటే.. ఫ్రెండ్ భార్య అయితే మంచిది కదా అని స్వప్న చెప్పింది. అయితే అలాంటి ఆశలు పెట్టుకోవద్దని శోభకు చెబుతాను అని నిరుపమ్ అంటే.. హిమకు ప్రముఖ డాక్టర్ కొడుకుతో పెళ్లికి ప్లాన్ చేస్తున్నారని చెప్పగానే.. నిరుపమ్ షాక్ తిన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X