Karthika Deepam కార్తీక్‌ను వదలకపోతే ప్రాణాలు తీస్తా.. ఎంతకైనా తెగిస్తా.. దీపకు మోనిత వార్నింగ్
దీపపై చాడీలు చెప్పడానికి ప్రయత్నించిన మోనిత టీమ్‌కు గ్రామ పెద్ద రాజేశ్వరి షాకిచ్చింది. దీపపై అపవాదులు వేయడానికి బదులు.. బతుకమ్మను ఆడండి అంటూ రాజేశ్వరి వార్నింగ్ ఇచ్చింది. దీపకు షాకిద్దామనుకొంటే.. ప్లాన్ ఇలా తారుమారైందేమిటి అని మోనిత మనసులో అనుకొంటుండగానే.. ఎదురుగా శౌర్య కనిపించింది. దాంతో ఈ శౌర్య ఇక్కడికెందుకు వచ్చింది.. నాకు షాకుల మీద షాకులు పడుతున్నాయి. శౌర్యను కార్తీక్, దీప చూడకుండా జాగ్రత్త పడాలి అని మోనిత అనుకొంది. దీపను, కార్తీక్‌ను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే డాక్టర్ బాబును వెతుక్కొంటూ వెళ్లిన మోనిత ఎదురుపడింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1480 లో ఏం జరిగిందంటే?

నీ బతుకు తెల్లారిపోవడం ఖాయం
డాక్టర్ బాబు అంటూ వెతుకుతుండగా.. మోనిత ఎదురపడి.. కార్తీక్ పిలువలేదు. నేనే పిలిచాను. నేను పిలిస్తే రావని.. నేనే కార్తీక్ పేరు చెప్పి పిలిపించాను అని మోనిత అంటే.. నేను బతుకమ్మ పేర్చుకొంటే.. ఈ పిచ్చి వేషాలు ఏమిటి? అని దీప గట్టిగా జవాబిచ్చింది. దాంతో ఈ రోజుతో నీ బతుకే తెల్లారిపోతుంది.. నీకు బతుకమ్మ ఎందుకు. అసలు రాజేశ్వరితో నీకు సంబంధమేమిటి అని మోనిత ఆరా తీసింది. ఓహో.. అదా సంగతి.. అప్పుడే మొదలుపెట్టేశావా? రాజేశ్వరి ఏమన్నది.. నీది ఊరు కాదు.. నీ బండారం బయటపెట్టిందా? అక్కడ డాక్టర్ బాబు ఈ మాటలు విన్నారా? వింటే నిన్ను పొట్లం కట్టి పంపించేవారు అని దీప వార్నింగ్ ఇచ్చింది.

నీ ప్రాణాలు తీస్తా.. ఎంతకైనా తెగిస్తా
అయితే దీప మాటలకు అడ్డుపడుతూ.. వంద మంది రాజేశ్వరిలను తీసుకొచ్చిన నాకు ఏమీ కాదు. రాజేశ్వరి ఎన్ని చెప్పినా కార్తీక్ నమ్మడు అని మోనిత గంభీర్యం ప్రకటించింది. అయితే నా భార్త విషయంలో నాటకం ఆడుతున్నావని తెలిసిపోవడం ఖాయం. డాక్టర్ బాబు నా వెంట రావడం ఖాయం అని దీప అంటే.. ఏదీ తీసుకెళ్లు చూద్దాం. కార్తీక్ నాకు అడ్డువస్తే ఎంతకైనా తెగిస్తా. నిన్ను ఆడ్డం తొలగించుకోవడానికి నీ ప్రాణాలు తీయడానికైనా సిద్దం అని మోనిత చెప్పింది. అయితే నీవెన్నీ ప్రయత్నాలు చేసినా.. కార్తీక్ నా భర్తే. అంతా దేవుడే చూసుకొంటాడు అని మోనిత చెప్పింది.

నీవు బతికి ఉన్న దెయ్యం అంటూ
కార్తీక్‌ను వీడదీస్తానో లేదో.. పైకి వెళ్లి దెయ్యానివై చూస్తావు అని మోనిత అంటే.. నేను దెయ్యమో కాదో.. కానీ.. నీవు బతికి ఉన్న దెయ్యానివే. ఇన్నాళ్లు సాధించావు. వేధించావు. ఈ రోజుతో నీ ఆటలు కట్టు. దెబ్బకు దెయ్యం దారికి వస్తుంది అని దీప అంటే.. కార్తీక్‌ను వదిలేయకపోతే... పోతావు అని మోనిత వార్నింగ్ ఇచ్చింది. అయితే వదిలేది నువ్వే.. పోయేది నువ్వే.. నన్నేమీ చేయలేదు అని దీప గట్గిగా బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఎన్ని ప్రాణాలు తీశావు అంటూ
అయితే దీప, మోనిత సంభాషణలు విన్న కార్తీక్.. ఆగు అంటూ అరిచాడు. దాంతో మోనిత షాక్‌లో ఉండిపోయింది. వదలకపోతే ప్రాణాలు తీస్తావా? ఇప్పటి వరకు ఎన్ని ప్రాణాలు తీశావు. ఇంతకు వదిలేది నువ్వా? దీపనా అని కార్తీక్ ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాకుండా ఈ ఊరు మనది కాదంటున్నారు అని అని కార్తీక్ అంటే.. నా దారికి అడ్డు వస్తే.. ప్రాణాలు తీస్తానని చెప్పు అని మోనిత వార్నింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయి.. బతకమ్మ ఆడేందుకు వెళ్లింది. అయితే తన స్నేహితురాలితో కలిసి బతుకమ్మ ఆడింది.

కార్తీక్‌ను కలిసిన వారణాసి
అయితే.. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ప్రోమోలో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తమది ఈ ఊరు కాదని చెప్పిన గ్రామపెద్ద రాజేశ్వరి వద్దకు కార్తీక్ వెళ్లారు. అయితే దీప, మోనితది ఈ ఊరు కాదు. కానీ దీప మాట మాత్రమే నమ్ము. మోనిత మాటకు నమ్మకు అని చెప్పింది. ఇదిలా ఉండగా.. కార్తీక్‌కు ఆటో డ్రైవర్ వారణాసి ఎదురుపడ్డాడు. మీరు బతికే ఉన్నారా అని వారణాసి అంటే.. కార్తీక్ నీవు ఎవరు అంటూ చీదరించుకొన్నాడు. దాంతో తన ఫోన్‌లో ఉన్న దీపతో కలిసి తన ఫోటోను వారణాసి చూపించడంతో కార్తీక్ షాక్ తిన్నాడు.


Click it and Unblock the Notifications











