For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam గతం గుర్తుకు తెచ్చుకొన్న డాక్టర్ బాబు.. దీప హత్యకు మోనిత భారీ ప్లాన్!

  |

  గ్రామంలో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న దీప.. బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు సిద్దమైంది. దాంతో డాక్టర్ తల్లి మాట్లాడుతూ.. నీ భర్తను నీకు దక్కేలా చేయమని బతుకమ్మకు మొక్కుకొని నీళ్లలో వదులు అమ్మ అంటూ అని చెప్పింది. దాంతో నా భర్త కోసమే జీవితమంత పోరాటం చేస్తున్నా. గతంలో నా పక్కన ఆయన లేకుండా పోయాను. ఇప్పుడు ఆయన జాపకాల్లోనేను లేకుండా పోయాను. చివరకు నా జీవితంలోకి వచ్చేలే చేసి.. నా బతుకును నిలబెట్టు అమ్మ అంటూ బతుకమ్మను నీళ్లలో వదిలింది. ఇంటికి వెళ్తూ డాక్టర్ బాబు కనిపించడం లేదంటూ అటు ఇటూ చూసింది. అయితే నీ డాక్టర్ బాబును మోనిత ఏమీ చేయలేదు. ఆయన గురించి ఆలోచించకు అని డాక్టర్ తల్లి చెప్పింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1481లో ఇంకా ఏం జరిగిందంటే?

  ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తం

  ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తం


  బతుకమ్మ వేడుకల్లో అవమానం చవిచూసిన మోనిత కుట్రలకు తెరలేపింది. డబ్బు గురించి ఆలోచించకు. ఎంతంటే అంత ఇస్తాను. ప్రాణాలతో దానిని వదలకు. ఈ రోజు రాత్రికే జరిగిపోవాలి. రేపటి సూర్యోదయాన్ని చూడకూడదు. నేను వేచి ఉంటాను అని ఫోన్‌లో ఎవరికో ఆర్డర్ వేసింది. పక్కనే ఉన్న దీపను చూస్తూ.. ఇంకా నీవు బతికేది కొద్ది క్షణాలే. కార్తీక్ దక్కలేదని కంగారు పడుతావో.. ఏలాగైనా దక్కుతాడని సంతోషంగా ఉంటావో.. ఏదైనా కొద్ది క్షణాలే. వాళ్లు వచ్చి ప్రాణాలు తీస్తారు. నేను కార్తీక్ పక్కనే ఉంటాను. నాపైన అనుమానం రాకుండా జాగ్రత్త పడుతా. ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తం అని మోనిత తనలో తాను అనుకొన్నది.

   మీ అమ్మ, నాన్నలు పైకిపోయారు

  మీ అమ్మ, నాన్నలు పైకిపోయారు


  దీప పక్క నుంచి చీకట్లో కార్తీక్ కోసం వెతుకుతుంటే.. మోనిత క్రూరంగా నవ్వుకొన్నది. అయితే తాను అంతా వెతికాను. కానీ కార్తీక్ కనిపించలేదు అని డాక్టర్ తల్లితో దీప చెప్పింది. అదే సమయంలో కార్తీక్ కోసం మోనిత వెతుకుతూ కంగారు పడిపోయింది. కార్తీక్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. నేను ఆయన పక్కనే ఉండాలి అని మోనిత కంగారు పడింది. అయితే కార్తీక్‌ను వెతుకుతుంటే.. శౌర్య ఎదురు పడింది. దాంతో నీవెందుకు ఇక్కడ ఉన్నావు. మీ అమ్మ, నాన్నలు పైకిపోయారు. నేనే స్వయంగా అంత్యక్రియలు జరిపించాను. ఇక నీవు హైదరాబాద్‌కు వెళ్లిపో అని కోపంతో మోనిత ఊగిపోయింది.

   గతం గుర్తుకు వస్తే.. నీ గొంతు నొక్కేస్తాడు

  గతం గుర్తుకు వస్తే.. నీ గొంతు నొక్కేస్తాడు


  బతుకమ్మ వేడుకల్లో జరిగిన సంఘటనలతో కార్తీక్ మనస్తాపానికి, గందరగోళానికి గురయ్యాడు. గత విషయాలను గుర్తు చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ తూలుతూ కనిపించాడు. అయితే కార్తీక్ కోసం దీప, మోనిత వెతకడం మొదలుపెట్టారు. అయితే తన స్నేహితురాలు కావేరి కలవడంతో కార్తీక్ గురించి అడిగింది. అయితే కార్తీక్‌కు గతం గుర్తుకు వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేసింది. కార్తీక్‌కు గతం గుర్తుకు వస్తే.. ఎక్కడికి పోడు.. వచ్చి నీ గొంతు నులిమేస్తాడు అని కావేరి వార్నింగ్ ఇచ్చింది.

  మోనిత నీ భార్య కాదు.. లవర్

  మోనిత నీ భార్య కాదు.. లవర్


  గ్రామపెద్ద రాజశ్వరి వద్దకు వెళ్లి మాది ఈ ఊరు కాదా.. ఒక్కొక్కరు ఒక విధంగా చెబుతుంటే నాకు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియడం లేదు దీప నా భర్త అని వెనుకపడుతున్నది. ఓ పిల్లాడిని తీసుకొచ్చి మోనిత నీ బిడ్డ అంటున్నది అని కార్తీక్ అంటే.. పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకొనే మహిళలు ఉంటారు. కానీ పరాయి మహిళ భర్తను తన భర్త అని చెప్పుకొనే ఆడవాళ్లును ఎక్కడైనా చూశావా? మోనిత నీ భార్య కాదు.. నిన్ను ప్రేమించిన వ్యక్తి. నువ్వు ఆమె చేతి నుంచి జారిపోకూడదని మోనిత ప్రయత్నిస్తున్నది. ఎక్కడైనా భర్త చేజారిపోతుందని కంగారు పడుతారా? నీవు దీప మాటనే నమ్ము.. దీప మాటలనే విశ్వసించు అని కార్తీక్‌కు రాజేశ్వరి హితబోధ చేసింది.

  వారణాసి.. నీ మాటలు విని మోసపోను..

  వారణాసి.. నీ మాటలు విని మోసపోను..


  రాజేశ్వరి చెప్పిన మాటలతో అయోమయంలో పడిన కార్తీక్ వెళ్తుంటే.. డ్రైవర్ వారణాసి ఎదురుపడ్డాడు. డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా? అని అంటే. ఎవడ్రా నువ్వు అని కార్తీక్ ప్రశ్నించాడు. దాంతో డాక్టర్ బాబు.. నేను వారణాసిని. మీరు గుర్తుపట్టలేదా? మీకు ఏమైపోయింది అని వారణాసి అంటే.. ఆపురా.. ఊళ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతీ ఒక్కరు సీన్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఎవరి మాటలను విని మోసపోను అని కార్తీక్ అంటే.. తన ఫోన్‌లో ఉన్న ఫోటోను చూసైనా నన్ను నమ్మండి అని కార్తీక్, దీప ఉన్న ఫోటోను చూపించాడు.

  నీ అంతు చూస్తాను అంటూ దీప

  నీ అంతు చూస్తాను అంటూ దీప


  దీపను చంపేందుకు దుండగులు ఊళ్లోకి వచ్చి.. మోనితకు ఫోన్ చేశారు. మేము ఫలానా చోటు ఉన్నామంటే.. అక్కడే ఉండండి.. నేను దీపను మీరు ఉన్న చోటుకే పంపిస్తాను అని చెప్పింది. కార్తీక్ కోసం వెతుకుతున్న దీప వద్దకు వచ్చి.. డాక్టర్ బాబు వీధి చివరికి నడుచుకొంటూ వెళ్లాడని మోనిత చెబితే.. అక్కడ లేకపోతే నీ అంతు చూస్తాను అని దీప వెళ్లింది. నీవు వెళ్తున్నది.. కార్తీక్ వద్దకు కాదు.. నీ మృత్యువు వద్దకు అంటూ మోనిత విషపు నవ్వు నవ్వింది.

  కార్తీకదీపం ప్రోమోలో భారీ ట్విస్టు

  కార్తీకదీపం ప్రోమోలో భారీ ట్విస్టు


  ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్టు చోటుచేసుకొన్నది. కార్తీక్‌ను కలువడానికి వచ్చిన వారణాసిపై దాడి జరగడంతో రక్తంతో కిందపడి ఉన్నాడు. వారణాసి అంటూ.. పిల్లలు ఏరి? దీప ఏది అంటూ కార్తీక్ అరిచాడు. తలపట్టుకొని కార్తీక్ కిందపడిపోయాడు. ఆ సంఘటన చూసిన దీప షాక్ గురైంది. ఇలా సీరియల్‌లో కథను మరో మలుపు తిప్పే ఎపిసోడ్‌ను రెడీ చేశారు.

  English summary
  Big Twist October 12th Episode number 1481 in Karthika Deepam serial: Karthik gets back his memory power
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X