twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam కార్తీక్‌ను రాయితో కొట్టిన కూతురు.. సీరియల్‌ అదిరిపోయే ట్విస్టు..హైడ్రామా

    |

    బతుకమ్మ వేడుకల్లో కొన్ని సంఘటనలతో మనస్తాపం చెందిన కార్తీక్‌కు ఆటో డ్రైవర్ వారణాసి ఎదురుపడ్డారు. డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా? అని అంటే. ఎవడ్రా నువ్వు అని కార్తీక్ ప్రశ్నించాడు. దాంతో డాక్టర్ బాబు.. నేను వారణాసిని. మీరు గుర్తుపట్టలేదా? మీకు ఏమైపోయింది అని వారణాసి అంటే.. ఆపురా.. ఊళ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతీ ఒక్కరు సీన్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఎవరి మాటలను విని మోసపోను అని కార్తీక్ అంటే.. తన ఫోన్‌లో ఉన్న ఫోటోను చూసైనా నన్ను నమ్మండి అని కార్తీక్, దీప ఉన్న ఫోటోను వారణాసి చూపించాడు. దాంతో దీపను పెళ్లి చేసుకొన్న విషయం.. గొడవలన్నీ కొంత గుర్తుకు వచ్చినట్టే వచ్చి కార్తీక్‌ను ఇబ్బంది పెట్టాయి. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1482 లో ఇంకా ఏం జరిగిందంటే?

     దీప అంటే.. వంటలక్కే కదా..

    దీప అంటే.. వంటలక్కే కదా..

    దీప గురించిన విషయాలు నాకు గుర్తుకు రావడం లేదు. అంతా మరిచిపోయాను అని కార్తీక్ అంటే.. అందుకేనా మీరు బతికి ఉన్నా మాకు తెలియలేదు. నీ కోసం అమ్మ, నాన్న ఎంత ఏడ్చారో. శౌర్య పిచ్చిదానిలా తిరుగుతున్నది. ఇంతకు దీపక్క ఏమైంది డాక్టర్ బాబు అని వారణాసి అడిగితే.. దీప అంటే.. వంటలక్కే కదా.. అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు. వంటలక్క బతికే ఉందా అని కార్తీక్ అంటే.. ఉంది.. బతికే ఉంది అని కార్తీక్ సమాధానం చెప్పారు. అయితే దీపక్క ఎక్కడ ఉందో చెప్పు డాక్టర్ బాబు అని వారణాసి అడిగితే.. నేను ఎన్ని అవమానాలకు గురిచేసినా నేను ఉండే చోటే ఉంది. నిజంగా దీప నా భార్య అయితే పెద్ద తప్పు చేసినట్టే అని కార్తీక్ అన్నాడు.

    నాకు ఏదీ గుర్తుకు రావడం లేదు

    నాకు ఏదీ గుర్తుకు రావడం లేదు

    దీపను అవమానించావా? డాక్టర్ బాబు.. నీ కోసం ఎన్ని బాధలు పడిందో తెలుసా అని వారణాసి అంటే.. నీవు చెప్పేది వింటే.. దీప నా భార్య అని అర్ధమవుతున్నది. నాకు ఏదీ గుర్తుకు రావడం లేదు. దేనిని అంగీకరించలేకోపోతున్నాను అని కార్తీక్ అన్నాడు. దాంతో నేను నిజం చెబుతున్నాను. దీపక్కే నీ భార్య అని వారణాసి అన్నాడు. దాంతో కార్తీక్ తలపట్టుకొని గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేసి.. నన్ను ఒంటరిగా వదిలేయ్.. వెళ్లు అంటూ వారణాసిని నెట్టివేశాడు.

    రౌడీలను చితకబాదిన కార్తీక్

    రౌడీలను చితకబాదిన కార్తీక్

    దీపను చంపేందుకు మోనిత నియమించిన రౌడీలు వెంటపడుతుంటే చూసిన వారణాసి వారిని అడ్డుకొన్నాడు. దీపక్క అంటూ పరుగులు పెడుతుంటే... ముగ్గురు రౌడీలు వారణాసి తలపై బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. అంతలోనే కార్తీక్ వచ్చి రౌడీలను చితకబాదాడు. వారిని పరిగెత్తించి కొట్టి తరిమేశాడు. తలకు బలంగా గాయమైన వారణాసిని చూసి కంగారుపడిపోయాడు. తాను చిక్ మంగళూరు నుంచి వెళ్లకపోతే చంపేస్తానని బెదిరించిన మోనితను రాయితో కొట్టేందుకు ప్రయత్నించగా.. ఆ రాయి వెళ్లి కార్తీక్ తలకు తగిలింది. దాంతో గతం అంతా కార్తీక్‌కు గుర్తుకు వచ్చింది. తలపట్టుకొని శౌర్య అంటూ గట్టిగా అరిచాడు.

    నా నాటకాన్ని తిప్పి కొడుతున్నారు

    నా నాటకాన్ని తిప్పి కొడుతున్నారు

    తనను శౌర్య రాయితో కొట్టేందుకు ప్రయత్నించిన సంఘటనతో మోనితలో కంగారు పెరిగిపోయింది. నా ప్లాన్ అంతా పాడైపోయింది. చివరి నిమిషంలో ఎన్నో ఏళ్ల కల చెదిరిపోయింది. ఆ దుర్గ వాడి కారణంగానే నాపై కార్తీక్‌కు అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇది కార్తీక్‌తో నా నాటకాన్ని తిప్పి కొడుతున్నాడు. కార్తీక్‌ను ఎక్కడ వెతకాలి? ఈ నాటకాన్ని ఎలా ఆపాలి అని మోనిత కంగారుపడిపోతే.. కార్తీక్‌కు ఇది గుర్తు ఉంటుందా? తెల్లారితో అంతా మరిచిపోతాడు అని స్నేహితురాలు కావేరీ అంటే.. లేదు.. ఈ మధ్య కార్తీక్‌కు అన్నీ గుర్తు ఉంటున్నాయి. పక్కనే ఉండి.. అందరూ గుర్తు చేస్తూనే ఉన్నాడు అని మోనిత అంటే.. ముందు కార్తీక్ ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం పదా అని కావేరీ తీసుకెళ్లింది.

    నా పేరు డాక్టర్ కార్తీక్

    నా పేరు డాక్టర్ కార్తీక్

    వారణాసిని కాపాడే సమయంలో తన తలకు గాయం కావడంతో హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకొన్నాడు. తలకు పట్టి కట్టిన డాక్టర్లు.. మీ పేరు ఏమిటి అంటే.. నా పేరు డాక్టర్ కార్తీక్.. హైదరాబాద్‌లో కార్డియాలజిస్టును అని చెప్పాడు. ఆ తర్వాత నేను తీసుకొచ్చిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అని కార్తీక్ అడిగితే.. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉంది. తలకు బలంగా గాయలు అయ్యాయి. కోమాలకు వెళ్లినా వెళ్లవచ్చు. మీరు రాత్రి ఇక్కడే ఉండి. ఇంటికి వెళ్లవచ్చు అని డాక్టర్లు చెప్పారు.

    దీపను చూసి.. కార్తీక్

    దీపను చూసి.. కార్తీక్

    కార్తీకదీపం తాజా ప్రోమోలో మరో ట్విస్టు కనిపించింది. రాత్రి కనిపించకుండా పోయిన కార్తీక్ గురించి దీప బెంగ పెట్టుకొన్నది. నా కార్తీక్ నాకు కావాలి అంటూ రోదించింది. కార్తీక్ కోసం వెతికేందుకు బయటకు వెళ్లిన దీప.. చూడకుండా ఎదురుగా ఉన్న కార్తీక్‌‌ను ఢీ కొట్టింది. తన హృదయంపై ఉన్న దీపను చూసి.. కార్తీక్ ప్రేమ, ఆవేదనతో కనిపించాడు.

    English summary
    Karthika Deepam October 13th Episode number 1482.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X