twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దుర్గ పక్కన మోనిత అలా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న కార్తీక్.. దీప ప్లాన్ వర్కవుట్!

    |

    మోనిత ఇంట్లోకి రౌడీ షీటర్ దుర్గా ప్రవేశించడంతో కార్తీక్ అసహనానికి గురయ్యాడు. మోనితతో దుర్గా వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపానికి గురయ్యాడు. తన బాధను దీపతో పంచుకొంటుండగా.. అసిస్టెంట్ శివ అక్కడికి వచ్చాడు. రెండు గంటలపాటు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లండి అని మేడమ్ చెప్పింది అని శివ అంటే.. నాకు ఇష్టముంటే ఎక్కడికైనా వెళ్తాను.. మీ మేడమ్ చెబితే నేను వెళ్లను. నీవు ఇక్కడి నుంచి వెళ్లు అని కార్తీక్ అన్నాడు. అంతలోనే శివకు ఫోన్ వచ్చింది.

    ఫోన్‌లో మాట్లాడుతూ సంబరపడిపోయాడు. అయితే ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావు అని కార్తీక్ అంటే.. మేడమ్ ఫ్రెండ్‌ మిమ్మల్ని ఎక్కడికైనా రెండు గంటలు తీసుకెళ్లమన్నాడు. అందుకు 1500 డబ్బులు కూడా వేశాడు అని శివ చెప్పగానే.. కార్తీక్ కోపంతో ఊగిపోయాడు. మోనిత ఇంతకు ముందు కూడా ఇలా చేసిందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1473లో ఏం జరిగిందంటే..

    కార్తీక్.. మిమ్మల్ని కష్టపెడుతున్నా

    కార్తీక్.. మిమ్మల్ని కష్టపెడుతున్నా

    కార్తీక్‌ కోపంతో ఉండటంతో దీప శాంతింప జేసేందుకు ప్రయత్నించింది. రెండు గంటలు సినిమాకు వెళ్లమని డబ్బులు ఇస్తారా? నేను చేతగాని భర్తను అవుతున్నాను. నీకు తెలియడం లేదు అని కార్తీక్ అంటే.. మీరు చేతగాని వాడివి కాదు. మీరు ఓడిపోరు అని దీప చెప్పింది. రెండు గంటలు సినిమాకు పోమ్మని చెప్పడం ఏమిటి? వాడు డబ్బులు ఇవ్వడం ఏమిటి? ఇంతకు ముందు కూడా ఇలానే జరిగిందా? ఇవన్నీ ఆలోచిస్తుంటే.. పిచ్చెక్కిపోతుంది అని కార్తీక్ అంటే.. ప్రశాంతంగా ఉండండి.

    అంతా మంచే జరుగుతుంది అని దీప ఓదార్చింది. కార్తీక్‌కు క్షమాపణలు మనసులో చెప్పుకొంటూ.. భార్య కాని భార్య కోసం మిమ్మల్ని కష్టపెడుతున్నాను. త్వరలోనే అని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని దీప అంది.

    దుర్గను రాడ్‌తో కొట్టి చంపేందుకు మోనిత ప్లాన్

    దుర్గను రాడ్‌తో కొట్టి చంపేందుకు మోనిత ప్లాన్

    దుర్గ తన ఇంట్లో తిష్టవేసి ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో మోనిత అసహనంతో ఊగిపోయింది. ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేసి.. రాడ్‌తో తలపై కొట్టబోయింది. దానిని దుర్గ గమనించడంతో రాడ్‌ను పక్కనే పడేసింది. నన్ను రాడ్‌తో కొట్టి చంపాలని అనుకొంటున్నావా? అని దుర్గ అంటే.. లేదు దారికి అడ్డంగా ఉంటే.. పక్కన పడేస్తున్నాను అని మోనిత సర్ది చెప్పింది. అబ్బా.. కవరింగ్ బాగానే ఇస్తున్నావు.

    నీకు పైకి పంపించడం కొత్తేమీ కాదు కదా.. అని దుర్గ అంటే.. నిన్ను పైకి పంపించడం నాకు కష్టమైనా పని కాదు. నీవు నాకు చుక్కలు చూపిస్తున్నావు. వదిలేసి వెళ్లిపో అని మోనిత చెప్పింది. అయితే వెన్నెల, చందమామ, వాతావరణం బాగా ఉంది.. రా.. నా పక్కలోకి రా అని దుర్గ అంటే.. అక్కడ.. వంటలక్క ఇంటిలో అంతా జరిగిపోతుంది. నీపై అనుమానాలు పెరిగిపోయాయి. నేను అలానే ప్లాన్ చేశాను అనగానే.. మోనిత వెంటనే వంటలక్క ఇంటికి పోయింది.

    ఇంజెక్షన్‌తో చంపేందుకు మోనిత ప్లాన్

    ఇంజెక్షన్‌తో చంపేందుకు మోనిత ప్లాన్

    దీపతో కార్తీక్ మాట్లాడుతుంటే మోనిత అక్కడకు చేరింది. నన్ను మోసం చేస్తున్నదని కార్తీక్ అంటుంటే.. దీప, దుర్గ నన్ను ఇరికించడానికి ప్లాన్ చేశారు అని మోనిత మనసులో అనుకొన్నది. నన్ను రెండు గంటలు బయటకు తీసుకెళ్లమని మోనిత చెప్పింది. అదే సమయంలో దుర్గ డబ్బులు వేశాడంటే..నేను ఏమనుకోవాలి.

    ఊర్లో వాళ్లు ఏమనుకొంటారు అని కార్తీక్ అన్నాడు. దాంతో తనపై అనుమానాలు పెంచడానికి దుర్గ కారణమా? అని కోపంతో ఊగిపోయింది. రాడ్ చంపడానికి ప్లాన్ చేసింది. అయితే చంపితే నేను జైలుకు వెళ్తా. ఒక్కరోజు పైకి వెళ్లే మందు ఇస్తా. ఈ ఇంజెక్షన్ ఇస్తే.. ఒక్క రోజులో ఏలా పోయావో నీకు తెలియదు అని ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.. అతడికి దగ్గరగా కూర్చున్నది. అంతలోనే కార్తీక్, దీప అక్కడికి వచ్చారు.

    దాంతో కంగారుపడిపోతూ..నేను ఇలా ఇరుక్కుపోయనే అని అనుకొన్నది. మోనిత నీవు ఎందుకు కంగారు పడుతున్నావు. నేను తొందరగా వచ్చాననా? నేను బయటకు వెళ్లి రెండు గంటల తర్వాత రావాలా? అని కార్తీక్ అంటే.. అంటే.. అలాంటిదేమీ లేదు మోనిత సర్ది చెప్పబోయింది.

    నాతో దొంగ నాటకాలు ఆడుతారా?

    నాతో దొంగ నాటకాలు ఆడుతారా?

    ఇదిలా ఉండగా.. దుర్గ నిద్ర నుంచి లేచినట్టు నటిస్తూ.. కార్తీక్ సార్.. అప్పడే వచ్చావేంటి? రెండు గంటల తర్వాత వస్తానని చెప్పావుగా..అనగానే.. కార్తీక్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో మోనిత కోపంతో ఊగిపోతూ.. కార్తీక్‌కు అనుమానం వచ్చేలా చేస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ కొట్టబోయింది. అయితే దీప ఆపుతుంటే.. దీపమ్మ.. ఆపకు.. ఇది ఏం చేస్తుందో చూద్దాం.

    ఒక్కసారి కార్తీక్‌ను పిలిచి రికార్డ్ వేస్తే దీని.. బతుకు ఏమౌపోతుందో తెలుస్తుంది. స్పాట్‌లోనే మెడపట్టి బయటకు గెంటేస్తాడు అని దుర్గ అంటే.. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకొండి. ఇలాంటి దొంగ నాటకాలు ఎందుకు? కార్తీక్‌కు అనుమానాలు వచ్చేలా చేస్తారా? అని మోనిత అంటే.. దుర్గ, దీప నవ్వుకొంటూ ఉండిపోయారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని దుర్గ అంటే.. నిజంగానే మోనిత దెయ్యమే అని దీప అంది..

    నా నాటకం నాకే తిప్పి కొడుతున్నారు అని

    నా నాటకం నాకే తిప్పి కొడుతున్నారు అని

    మోనితకు దీప షాక్ ఇస్తూ.. పదేళ్ల క్రితం విహారితో నాకు లేని సంబంధం అంటగట్టావు. నా జీవితంతో ఆడుకొన్నావు. నీకు ఇప్పుడు అలాంటి శిక్షే విధిస్తాను. నీపై అనుమానం వచ్చేలా చేస్తాను అని దీప అంటే.. ఇంత సింపులుగా శిక్ష వద్దు. కార్తీక్‌ను మోనిత వదిలాలి లేదా కార్తీకే మోనితను వదలేలా చేయాలి. ఒకవేళ నాకు సంబంధం ఉందని తెలిసి మోనితను కార్తీక్ వదిలేస్తే.. పరువుపోతుంది అని దుర్గ అన్నాడు.

    దాంతో ఏమీ చేయలేని స్థితిలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మోనిత ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇంట్లో బాబును ప్రేమగా చూస్తూ కార్తీక్ ఉంటే.. మోనిత అక్కడకు వెళ్లి.. నేను ఆడుతున్న నాటకాన్ని నాకే తిప్పి కొడుతున్నారు. దుర్గతో నాకు ఏ సంబంధం లేదని చెబితే కార్తీక్ నమ్ముతాడా? ఏం చేయాలి అనే సందిగ్దంలో పడింది.

    నీ బిడ్డకు నేను తండ్రిని కాదు అంటూ

    నీ బిడ్డకు నేను తండ్రిని కాదు అంటూ

    ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ తాజా ప్రోమోలో నేను ఏమి తప్పు చేయలేదు. నాకు దుర్గతో ఎలాంటి సంబంధం లేదు అని మోనిత అంటే.. అసలు దుర్గ ఎవరు? నీకు అతడికి సంబంధం ఏమిటి? అని కార్తీక్ అంటే.. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్ము అని మోనిత కంటతడి పెట్టుకొన్నది. దాంతో గతంలో దీపను అనుమానిస్తూ.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాదు అని చెప్పిన డైలాగ్‌ను మళ్లీ చెబుతూ కార్తీక్ ఆవేశంగా లేచాడు. దాంతో దీప, మోనిత షాక్‌లో ఉండిపోయారు. తాజా ప్రోమోలో ఈ సీన్ మరో ట్విస్టుకు దారి తీసింది.

    English summary
    Karthika Deepam October 3rd Episode number 1473.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X