Bigg Boss Telugu 7: ఎవిక్షన్ పాస్ అంటే కాపాడేది కాదు కాటేసేది.. అదే నిజమైతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ పక్కా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాస్కులు, అదిరిపోయే ఎమోషన్లతో పాటు ఉల్టా పుల్టా అంటూ ఎవరూ ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. ముఖ్యంగా సీజన్ ముందు నుంచి ఈ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ముందుగా కేవలం 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే ఇంట్లోకి పంపిన బిగ్ బాస్.. ఆ తర్వాత ఐదు వారాలకే మరో ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి పంపించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 పేరుతో ఇదంతా సాగింది.
అలాగే ఆ తర్వాతి వారమే.. మొదటి కొన్ని వారాల్లో నామినేట్ అయిన సింగర్ ధామిని, శుభ్రశ్రీ రాయగురు, రతికా రోజ్ లను ఓట్లు వేసి మరీ ఇంట్లోకి రప్పించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఇంట్లోకి తెస్తామంటూ.. ఓట్లు వేయించి చివరకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఓట్లు తక్కువ వచ్చిన వారినే లోపలికి పంపిస్తున్నామంటూ అతి తక్కువ ఓట్లు వచ్చిన రతికా రోజ్ ను హౌస్ లోకి పంపారు. ఇక అప్పటి నుంచి బిగ్ బాస్ షో మరింత రసవత్తరంగా సాగుతోంది. పదోవారం, పదకొండో వారంలో అయితే మరింత రంజుగా సాగుతోంది.

పదో వారంలో ఫ్యామిలీ వీక్ నిర్వహించిన బిగ్ బాస్.. పదకొండో వారంలో ఎవిక్షన్ పాస్ కోసం పోటీలు నిర్వహించారు. ముందుగా హౌస్ మేట్స్ అందరినీ టాప్ 10 ర్యాంకింగ్స్ ఇచ్చుకొమ్మని చెప్పిన బిగ్ బాస్.. లీస్ట్ బాటమ్ 5 వాళ్లకు ఎవిక్షన్ పాస్ కోసం పోటీ పడాలని చెప్పాడు. అలా పోటీలో గెలిచిన అంబటి అర్జున్ కు ఉల్టా పుల్టా పేరుతో మరోసారి షాక్ ఇచ్చారు. టాప్ 5లో నిలిచిన వారందరితో పోటీ పడి దాన్ని కాపాడుకోవాలని చెప్పగా.. చివరకు యావర్ ఈ ఎవిక్షన్ పాస్ ను గెలుచుకున్నాడు. ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడే మరో కొత్త కథ ప్రారంభం కాబోతునట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్లన్నింటిలో ఎవిక్షన్ పాస్ అంటే తమతో పాటు తమకు నచ్చిన వారు ఎలిమినేట్ అవుతుంటే దాన్ని ఉపయోగించుకొని ఇంట్లో కొనసాగే వాళ్లు. కానీ ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్ట్ లో భాగంగా.. ఎవిక్షన్ పాస్ ను సేవ్ చేసేందుకు కాకుండా.. ఎలిమినేట్ చేసేందుకు వాడబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అంటే ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్... తననో, తనకు నచ్చిన వారినో సేవ్ చేసే వీలులేకుండా ఇంట్లోంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే కనుక నిజం అయితే రతికా రోజ్ సేవ్ అయి మరెవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా యావర్ తో ఎప్పుడూ గొడవ పడుతున్న అశ్విని, శోభాశెట్టిలకు ప్రమాదం ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సీజన్ లో ఏదైనా జరగొచ్చు. ఇప్పటికే ఈ సీజన్ లో ఓ కంటెస్టెంట్ ఎక్కువగా ఉండడంతో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











