Brahmamudi April 6th నడుముపై పుట్టుమచ్చ చూశావంటూ కావ్యతో గొడవ.. విషపు నవ్వుతో రుద్రాణి ప్లాన్!

రాజ్, కల్యాణ్ కుటుంబంలో కంపెనీలో అధిపత్య పోరాటం వారి మధ్య విభేదాలకు దారి తీసింది. ఇదిలా ఉండగా, ఓ చిన్నారిని ఇంటికి తీసుకు రావడంతో అందరూ రాజ్ కొడుకే అని ఫిక్స్ అయ్యారు. వెన్నెలకు, రాజ్‌కు పుట్టిన బిడ్డ అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్‌పై తల్లి, భార్య కావ్య అనుమానాలు పెరిగిపోయాయి. రుద్రాణి తన కొడుకును కంపెనీ ఓనర్ చేయాలని ప్లాన్ వేసింది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్ 377 లో ఏం జరిగిందంటే?

వెన్నెలను వెతికే పనిలో కావ్య ఉండటంపై తన అమ్మమ్మ ప్రశ్నించింది. వెన్నెలను ఎందుకు వెతకాలని అనుకొంటున్నావు? వెన్నెలకు నీ భర్తకు ఉన్న బంధాన్ని బయటపెట్టాలని అనుకొంటున్నావా? అదే జరిగితే ఈ ఇంట్లోకి వెన్నెల వస్తుంది. అప్పుడు నీ స్థానం ఏమౌంతుందో నీకు తెలుసా? అని అమ్మమ్మ ప్రశ్నల వర్షం కురిపించింది.

Big Twist Raj Kavya Family of Brahmamudi serial April 6th Episode of 377

దాంతో అలా అని వదిలేస్తే.. ఆ వెన్నెలే వెతుక్కొని ఇంటికి వస్తే.. అప్పుడు ఏం చేయాలనుకొంటారు. నీ మనవడి జీవితంలో వెన్నెల ఉంటే.. నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు నా జీవితంలో నేను ఏం చేయాలో నాకు క్లారిటీ వస్తుంది. ప్రశ్నగా మిగిలిపోవడం కంటే.. సమాధానం లభించడం ముఖ్యం. నీ మనవడు తప్పు చేసి ఉండడు అనేది నా నమ్మకం. అందుకే వెన్నెల కోసం నా అన్వేషణ. ఆమె గురించి నేను తెలుసుకొంటానా? అని కావ్య చెప్పింది.

అప్పు మీడియాకు ఎక్కడంపై తండ్రి ప్రశ్నించాడు. మీడియాకు ఎక్కడం వల్ల పరువు పోతుంది అని అంటే.. నేను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను అని అప్పు సమాధానం చెప్పింది. అయితే మధ్య తరగతి వాళ్లకు న్యాయం అంత సులభంగా లభించదు. నానా రకాలుగా సమాజం తప్పుగా అర్దం చేసుకొంటుంది అని తండ్రి అంటే.. నా బిడ్డ తప్పు చేయనంత కాలం అండగా ఉంటా. అప్పు నీవు తప్పు చేయలేదని అనుకొంటే ఎలాంటి దానికైనా పోరాటం చేయి. ఎవరైనా అడ్డు వస్తే తాటా తీస్తాను. అది లక్ష్మీ అయినా.. దుగ్గురాల ఫ్యామిలీ అయినా నాకు లెక్కలేదు అప్పు తల్లి ఆవేశంగా ఊగిపోయింది. దాంతో కావ్య జీవితం ప్రశ్నగా మారింది.. నీ జీవితం కూడా అలాగే అవుతుందనే టెన్షన్ నాకు ఉంది అని తండ్రి అంటే.. నేను అలాంటి పని చేయనని అప్పు చేసింది.

Big Twist Raj Kavya Family of Brahmamudi serial April 6th Episode of 377

కావ్య పిల్లాడికి బట్టలు వేస్తుంటే.. ఎవరికో పుట్టిన బిడ్డను బాగానే ముస్తాబు చేస్తున్నావుగా.. తల్లి ఎవరో తెలియకున్నా..తల్లిగా మారి సేవల చేస్తున్నావంటూ రుద్రాణి సూటిపోటి మాటలు పొడిచింది. అయితే పిల్లాడిని తయారు చేస్తుండగా.. అ అబ్బాయి నడుముపై పుట్టు మచ్చ కనిపించడంతో.. రాజ్‌కు కూడా అలాంటి ప్లేస్ృ‌లోనే పుట్టమచ్చ ఉంది. కాబట్టి ఈ అబ్బాయి కచ్చితంగా రాజ్ కొడుకే అని రుద్రాణి బాంబు పేల్చింది.

రాజ్‌కు నడుము మీద పుట్టు మచ్చ ఉందా? లేదా అని తెలుసుకోవడానికి కష్టాలు పడింది. రాజ్ బనియన్ పైకెత్తి చూసేందుకు ప్రయత్నించగా.. ఏమిటి అని కంగారు పడ్డాడు. నా నడుము చేశావు అంటే.. నేను చూడలేదు అని కావ్య చెప్పింది. నువ్వు నడుము, దానిపై పుట్టు మచ్చను చూశావని రాజ్ అంటే.. చూడలేదని కావ్య మొండికేసింది. దాంతో ఇది సినిమా కాదు అంటూ అరిచాడు. దాంతో అవును నేను నడుము చూశాను అని అంటే.. నాకు సిగ్గు అంటూ కావ్యతో రాజ్ అన్నాడు. సిగ్గు ఉంటే.. ఈ పిల్లాడు ఎలా పడుతాడు.. ఓ వర్షం కురిసిన రాత్రి ఆ సిగ్గులేదా అంటూ కావ్య నిలదీసింది.

Big Twist Raj Kavya Family of Brahmamudi serial April 6th Episode of 377

కల్యాణ్ గురించి బాగా ఆలోచనల్లో పడిన అనామిక వద్దకు వచ్చిన రుద్రాణి.. తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్దమైంది. రాజ్ గురించి, అప్పు గురించి ఎక్కువగా ఆలోచించకు. అప్పుతో రాజ్ తిరిగితే ఏమైంది. రాజ్ ఎదుగుదల కావాలా? వద్దా అని అనామికను రుద్రాణి అడిగింది. దాంతో రాజ్ ఉన్నత స్థానానికి ఎదగడమే నాకు ముఖ్యం అని అనామిక చెబితే... కల్యాణ్‌ను తప్పించి నా కొడుకును ఆ స్థానంలో పెడుతాను అంటూ రుద్రాణి విషపు నవ్వు నవ్వుతూ వెళ్తుంటే.. కల్యాణ్ ఎదురు పడ్డాడు. దాంతో గుడ్ నైట్ అని అొంటే.. మీరు ఉన్న తర్వాత నాకు గుడ్ నైట్ ఎలా అవుతుందని రుద్రాణిని చూస్తూ కల్యాణ్ తన మనసులో అనుకొన్నాడు.

ఇదిలా ఉండగా, రాజ్ నడుముపై పుట్టు మచ్చ లేకపోవడంతో కావ్య కంగారు పడింది. అబ్బాయి రాజ్ బిడ్డ కాదా? అని అనుమానాలతో ఉండిపోయింది. అయితే తాజా ట్రైలర్‌లో నా ప్లేస్‌లో కల్యాణ్ బాధ్యతలు తీసుకొన్నాడు కాబట్టి.. అతడి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాయాలనుకొంటున్నాను అని రాజ్ బాంబు పేల్చాడు. దాంతో ఆ పిల్లాడి కారణంగా నీ తల్లి, నీ భార్య నమ్మకం కోల్పోయావు. ఇప్పటికైనా నిజం బయటపెట్టు.. లేదా పిల్లాడిని వదిలిపెట్టు అంటూ తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడం వచ్చే ఎపిసోడ్‌లో భారీ ట్విస్టుకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X