Guppedantha Manasu: నా ప్రేమను నేలమట్టం.. పాతాళంలోకి నెట్టావు.. వసుధారపై రిషి ఫైర్

మీ పెళ్లి ఎప్పుడు అని మెసేజ్ చేసిన వసుధారను రిషి గట్టిగా నిలదీశాడు. నేను మరోక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నది నీ ఉద్దేశమా? అది అసాధ్యం వసుధార. నేను మరొకరిని ఎలా పెళ్లి చేసుకొంటానని అనుకొన్నావు. నా మనసులో ఒకరు ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకొను. ఆ జాపకాలను వదిలిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకోలేను. నీవు ఏనాటికైనా తోసేయగలవేమో.. నీకు ఆ ధైర్యం ఉందేమో కానీ.. నాకు లేదు అని రిషి ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు అని వసుధార అడగ్గానే.. ఆమె చేతిని పట్టుకొని గట్టిగా తన హృదయానికి హత్తుకొని.. నా మనసులో ఉన్నది నీవే వసుధార అంటూ రిషి అన్నాడు. దాంతో వసుధార కన్నీటి పర్యంతమైంది. గుప్పెడంత మనసు సీరియల్ 849 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

మన ఇద్దరి విడదీయలేని బంధం. నిన్ను ఎప్పటికీ మరిచిపోలేను అని రిషి అనగానే.. వసుధార గట్టిగా కౌగిలించుకొన్నది. ఇద్దరు ప్రేమలో తడిసి ముద్దయ్యారు. అయితే వసుధార తన మనసులో ఊహించుకొన్నది కావడం గమనార్హం. అయితే వసుధార మౌనంగా తన ముందు నిలబడి ఉండటంతో.. మన మధ్య ఇలాంటి పరిస్థితికి కారణం మీరు. నా ప్రేమను నేలమట్టం చేశారు. నా ప్రేమను పాతాళంలోకి నెట్టారు. నా పెళ్లి విషయంలో మీరు సలహాలు ఇవ్వకూడదు. నా జీవితం నా ఇష్టం అని రిషి అన్నాడు. దాంతో మీ జీవితం మీదే. మీకు గతం లేదు అని వసుధార అంటే.. మీకు మనసన్నది లేదు. మీది గట్టి గుండె అని రిషి అన్నాడు. ఇక నిన్ను ఎన్నడూ కలువను. మీ సలహా అడగను అంటూ రిషి ముందుకు కదిలాడు.

Big Twists in Guppedantha Manasu Serial: Highlights of Episode 849 on August 23rd 2023

దాంతో రిషికి జవాబిస్తూ.. మీరు ఎవరిని సలహా అడగలేరు. కేవలం వసుధారను మాత్రమే అడుగుతారు. మీ ఊపిరి వసుధార. ఆ విషయం తెలిసి కూడా మీరు మిమ్మల్ని మభ్య పెట్టుకొంటున్నారు అని వసుధార అంటే.. మీరు నాకు ఏమీ చెప్పనక్కర్లేదు. నా నమ్మకాన్ని మీరు కుప్పకూల్చారు. ఇంకా ఇక్కడ నిలబడే అవసరం లేదు అని రిషి గట్టిగా మాట్లాడారు.

Big Twists in Guppedantha Manasu Serial: Highlights of Episode 849 on August 23rd 2023

రిషితో వాగ్వాదం జరుగుతుంటే.. వసుధారకు ఫోన్ మెసేజ్ వచ్చింది. ఏంజెల్ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్‌ ఒపెన్ చేయగానే.. నీకు, రిషికి ఫోన్ చేస్తుంటే ఎవరూ ఎత్తడం లేదు. రిషితో నా పెళ్లిని ఒప్పించే బాధ్యత నీదే. ఎలాగైనా రిషితో మాట్లాడి మా పెళ్లి జరిపించాలి అని ఆడియో మెసేజ్ చేసింది. వసుధార వింటున్న ఆడియో మెసేజ్ విన్న రిషి.. అందుకేనా మీరు ఇలా బిహేవ్ చేసింది. అందుకేనా మీ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నది. ఏంజెల్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నదా? అని రిషి ప్రశ్నల వర్షం కురిపించారు.

Big Twists in Guppedantha Manasu Serial: Highlights of Episode 849 on August 23rd 2023

డీబీఎస్టీ కాలేజ్ వ్యవహారాలన్ని జగతి చేతుల్లో ఉండటంపై శైలేంద్ర కుమిలిపోయాడు. నీ చేతి నుంచి కాలేజ్ వ్యవహారాలు నా చేతికి వస్తాయి. నీ కొడుకు రిషిని తప్పించిన వాడిని. నిన్ను తప్పించడం నాకు ఓ లెక్కనా? ఎప్పటికైనా డీబీఎస్టీ కాలేజీ అంతా నా చేతిలోకి వస్తుంది. అప్పుడు నేనేంటో చూపిస్తాను అని శైలేంద్ర కుట్ర పన్నాడు.

Big Twists in Guppedantha Manasu Serial: Highlights of Episode 849 on August 23rd 2023

వసుధార రిప్లై ఇవ్వకపోవడంతో నేరుగా ఏంజెల్ కాల్ చేసింది. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. రిషి ఎక్కడ అని ఏంజెల్ అంటే.... నేను రిషి కలిసే ఉన్నామని చెప్పింది. అయితే మా పెళ్లి విషయం మాట్లాడావా? అని అంటే.. లేదు అని వసుధార సమాధానం చెబుతుండగానే.. అంతలోనే రిషి ఇంట్లోకి వచ్చాడు. దాంతో ఎక్కడికి వెళ్లావు అని ఏంజెల్ ప్రశ్నించగానే.. ఎక్కడికి వెళ్తే నీకేంటి? నా గురించి ఆరా తీయడం నీ పని కాదు. నాకంటూ ఓ జీవితం ఉంది. అన్ని నీకు చెప్పి చేయాలా అని బయటకు చెప్పాలనుకొన్నాడు రిషి. కానీ తమాయించుకొని.. నేను పని మీద బయటకు వెళ్లాను. ఫోన్ చూడటం మరిచిపోయాను అని రిషి అన్నాడు. ఆ తర్వాత మళ్లీ మాట్లాడుతూ.. జీవితంలో అనుకొన్నవి అన్నీ జరగవు. నీవు ఎక్కువగా ఊహించుకోవద్దు అంటూ రిషి చెప్పాడు.

Big Twists in Guppedantha Manasu Serial: Highlights of Episode 849 on August 23rd 2023

అయితే రిషి నీ మనసులో ఉన్న విషయాన్ని నేను ఎలా రాబట్టాలో నాకు తెలుసు. అందుకే ప్లాన్ బీ వేశాను. నీ రూమ్‌లో లెటర్ రాసి పెట్టాను. అది చదివిన తర్వాతైనా సమాధానం చెప్సాల్సి ఉంటుందని ఏంజెల్ మనసులో అనుకొన్నది. తన గదిలోకి వచ్చిన రిషికి టేబుల్‌పై లెటర్ కనిపించింది. వెంటనే దానిని తీసుకొని.. ఒపెన్ చేశాడు.. ఏంజెల్ తన మనసులోని భావాలను చెప్పిన ప్రేమ లేఖను చదివాడు. నా ప్రేమను దూరం పెట్టకు. నీ ప్రేమ కోసం మళ్లీ పుట్టాలని ఎదురు చూస్తుంటాను. ఇట్లు వసుధార అని రాసి.. కొట్టేసింది. ఆ తర్వాత ఏంజెల్ పేరు రాసి వసుధార లెటర్ అక్కడ పెట్టంది. దాంతో ఫోన్ చేసి ప్రేమ లేఖ ఎందుకు రాశావు అంటే.. ఏంజెల్‌కు రాయడం రాకపోతే నేనే రాశాను వసుధార చెప్పింది. ఎందుకలా రాశావు అంటే.. ఏంజెల్ అడిగింది.. నేను సహాయం చేశాను అని వసుధార చెప్పింది.

దాంతో నా మనసు తెలుసు. నీవు ఏంజెల్‌ను ఎంకరేజ్ చేస్తావా? అని రిషి అంటే.. మీ వ్యవహారం మీరు చూసుకోండి. నన్ను ఈ విషయంలోకి లాగొద్దు. నీ మనసులో ఉన్న నేరుగా చెప్పండి అని వసుధార అంటే.. కొంత సమయం తీసుకొని చెబుతాను అని రిషి అంటే.. నిర్ణయం చెప్పడానికా? అని వసుధార ప్రశ్నించింది. నిర్ణయం కాదు. నా మనసులో ఉన్న విషయాన్ని ఎలా చెప్పాలా? అని రిషి బదులిచ్చాడు. ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పేయండి. లేకపోతే సమస్య మరింత పెరిగిపోతుంది అని వసుధార చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో నేను ఏదో చెప్పాలనుకొవాలనుకొంటే.. నాకు ఆమె సలహా ఇచ్చి పెట్టేసింది అని రిషి ఆలోచనల్లో పడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X