Karthika Deepam అమెరికాకు వెళ్తున్నాను అంటూ బాంబు పేల్చిన నిరుపమ్.. హిమకు క్యాన్సర్ ట్విస్టు!
టిఫిన్ మోయడాలు, మాటలు మోయడాన్ని ఇక ఆపేయ్ అని స్వప్న అనగానే.. అవునమ్మా.. మేము కలిసిపోయాం కదా.. ఇక లంచ్ బాక్సులు తీసుకురావడం ఆపేయ్ అని సత్యం కూడా అనగానే జ్వాలా బాధపడింది. అక్కడి నుంచి బయటకు రాగానే.. హిమ ఎదురుపడి.. ఏమిటి జ్వాలా ఇక్కడున్నావు అంటే... సత్యం సార్‌కు లంచ్ బాక్స్ తెచ్చాను ఆఖరిసారిగా అని అనగానే.. వెనుకనే డాక్టర్ శోభ వచ్చి... తెలిసిందా గుడ్ న్యూస్ అంటూ వెకిలిగా మాట్లాడింది. మీ ఎవరి వల్ల కానిది.. నా వల్ల అయింది. సత్యం, స్వప్న ఫ్యామిలీని మళ్లీ కలిపాను అంటూ శోభ తన గొప్పతనాన్ని చెప్పుకొనే ప్రయత్నం చేసింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1373లో ఇంకా ఏం జరిగిందంటే..

డాక్టర్ శోభ గొప్పలు చెప్పుకొంటూ
శోభ గొప్పలు చెప్పుకొంటుంటే.. మంచి పనిచేశావు అంటూ హిమ వెటకారంగా మాట్లాడింది. దాంతో ఇంకా మున్ముందు చాలా జరగాల్సినవి ఉన్నాయి. ఆ కుటుంబాన్ని కలిపాను. ఆ కుటుంబానికి కోడలిగా వెళ్తున్నాను. చెంప దెబ్బ కొడితే.. చెంప దెబ్బ కొట్టడం కాదు.. ఇలా కొట్టడం ఈ శోభాదేవి స్టైల్. నీ కనెక్షన్ కూడా కట్ చేస్తాను అని శోభ అంటుంటే.. ఏంటి ఇలా మాట్లాడుతున్నది. నేను అప్పుడే ఐ లవ్ యూ చెబుతానంటే.. హిమ ఆపేసింది అని జ్వాలా మనసులో అనుకొంటుండగా.. ఆటోవాలా ఏం మాటలు రావడం లేదు అని అంటే.. శోభను కొట్టడానికి వెళితే హిమ ఆపింది.

నా మనసుకు నచ్చిందంటూ
జ్వాలా, హిమతో డాక్టర్ శోభ మాట్లాడుతుంటే.. అంతలోనే అక్కడికి వచ్చిన స్వప్న.. నా మనసుకు నచ్చిన అమ్మాయి శోభ. మా కుటుంబాన్ని ఒక్కటి చేసింది. రేపు మా కుటుంబంలోకే రాబోతున్నది. మీ నాన్నమ్మకు చెప్పు.. స్వప్న తన ఛాలెంజ్‌ను నిలబెట్టుకొంటున్నది అని.. అన్ని మరిచిపోయి హాస్పిటల్ చూసుకో హిమ.. నువ్వు ఆటో నడుపుకో.. అవసరమైతే ఇల్లు ఖాళీ చేసినప్పుడు నిన్ను పిలుస్తాను. ఆటోను అద్దెకు తీసుకోవడానికి అని స్వప్న ఎద్దేవా చేసింది.

డాక్టర్ సాబ్ మనసులో నేను అంటూ
స్వప్న, శోభ అన్న మాటలతో హిమ బాధతో ఆలోచనల్లో పడింది. అయితే హిమను చూసి వాళ్ల మాటలను ఏమీ పట్టించుకోకు. వాళ్ల ఛాలెంజ్‌లు అన్ని ఒట్టి మాటలే. శోభ ఎన్ని చెప్పినా.. డాక్టర్ సాబ్ మనసులో నేను ఉన్నాను అని జ్వాలా అంటే.. అయ్యో.. డాక్టర్ సాబ్ మనసులో ఉన్నది నీవు కాదు.. నేను. ఆ విషయం తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం నన్ను వెంటాడుతున్నది అని హిమ మనసులో అనుకొన్నది. అయితే డాక్టర్ సాబ్ నన్ను మా ఫ్యామిలీ కోసమే పుట్టావు అన్నాడు. అలాగే నాకు ఐలవ్ యూ కూడా చెప్పాడు అని జ్వాలా చెప్పుకొంటూ వెళ్తుంటే.. జ్వాలాకు నిరుపమ్ కాల్ చేశాడు.

అశ్రమానికే కాదు.. అంతరిక్షానికి కూడా
అయితే నిరుపమ్‌తో మాట్లాడుతూ.. నీవు రమ్మంటే.. ఆశ్రమానికే కాదు.. అంతరిక్షానికి కూడా వస్తాను అంటూ జ్వాలా ఫోన్‌లో సమాధానం చెప్పింది. అయితే నిరుపమ్ వద్దకు జ్వాలా వెళ్తుంటే..నేను వస్తాను అని హిమ అంది. దాంతో నువ్వెందుకు అంటూ జ్వాలా అనగానే.. ఒకవేళ జ్వాలా వెళ్లి బావకు ఐ లవ్ యూ చెబితే.. తను నో అంటే.. జ్వాలా పరిస్థితి ఏమిటి అని హిమ కంగారు పడుతూ మనసులో అనుకొన్నది. కాబట్టి నేను ఉండి.. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని అనుకొన్నది. హిమతో మాట్లాడుతూ.. ఈ ఒక్కసారి నీతో వస్తాను. కాసేపైన తర్వాత మీరిద్దరూ మాట్లాడుకోండి అని హిమ చెప్పడంతో సరే జ్వాలా అంది.

జ్వాలా, హిమ మధ్య బంధం వెనుక
జ్వాలాతో నిరుపమ్ క్లోజ్‌గా ఉండటాన్ని స్వప్న జీర్ణించుకోలేకోపోతున్నది. అయితే స్వప్నను శోభ ఊరడిస్తూ.. నీవంటే నిరుపమ్‌కు గౌరవం. ఇప్పుడు అలా మాట్లాడినా.. ముందుముదు నీ మాట వింటాడులే అని శోభ అంటే.. ఇంతకు ముందు వాడు నేను ఏది చెబితే అది చేసేవాడు.
కానీ ఇప్పుడు హిమ, జ్వాలా కలిసి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అనుకొంటుండగా.. ఆశ్రమం వద్ద జ్వాలా,హిమ కనిపించడంతో ఇద్దరు షాక్ తిన్నారు. డాక్టర్, ఆటో డ్రైవర్ మధ్య ఇంత అనుబంధానికి కారణం ఏదో ఉంటుంది. అక్కాచెల్లెల బంధం కంటే ఎక్కువే ఉంది. వీరిద్దరి రిలేషన్ వెనుక అసలు కారణాన్ని కనిపెడుతాను అంటూ శోభ అనుకోవడం కనిపించింది.

ప్రేమికుల మధ్య ఎన్నో అంటూ
అయితే హిమ ప్రేమ గురించి జ్వాలాతో మాట్లాడాలని అనుకొంటే.. జ్వాలా, హిమ కలిసి రావడంపై నిరుపమ్ నిరుత్సాహపడ్డాడు. ఏంటి హిమ ఎందుకు వచ్చింది? అని అనుకొన్నాడు. అయితే నిరుపమ్‌ను కలువడానికి వస్తుంటే.. హిమ రావడంపై.. ప్రేమికులు మధ్య చాలా ఉంటాయి. టచింగ్స్. ఇంకా ఏవో ఏవో ఉంటాయి. నీవు డిస్ట్రబెన్స్ ఎందుకు అంటూ హిమను జ్వాలా అంది. అయితే హిమను ఒప్పించేలా జ్వాలాతో మాట్లాడుదామని అనుకొంటే.. ఇలా ఇద్దరు వచ్చారేంటి అని నిరుపమ్ అనుకొన్నాడు. హిమ, జ్వాలాతో నిరుపమ్ మాట్లాడుతూ.. నేను అమెరికాకు వెళ్తున్నాను అంటూ నిరుపమ్ బాంబు పేల్చాడు.
Recommended Video


నాకు క్యాన్సర్ అంటూ హిమ
కార్తీకదీపం సీరియల్ ప్రోమోలో రెండు భారీ ట్విస్టులు కనిపించాయి. ఇదిలా ఉండగా.. నాకు క్యాన్సర్ అంటూ మెడికల్ రిపోర్ట్స్ నిరుపమ్ చేతిలో హిమ పెట్టింది. నీవు నాకు ఒక మాటివ్వాలి. నన్ను మరిచిపో నిరుపమ్ అంటే.. లేదు హిమ అంటూ నిరుపమ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ట్విస్టులతో సీరియల్ ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగేలా కనిపించింది.


Click it and Unblock the Notifications











