కరోనా టైంలో గంగవ్వ మనవడి పెళ్లి..ఆ ముహూర్తానికే లగ్గం.. కోవిడ్ నెగిటివ్ అంటూ పెళ్లి శుభలేఖ !

గత ఏడాది కరోనా విజృంభిస్తున్న తరుణంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు, ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ పెళ్లిళ్లు చేసుకుని ఒక ఇంటివాళ్ళయ్యారు. కరోనా సమయం కావడంతో అప్పుడు పెద్దగా ఎక్కువ మంది హాజరయ్యే అవకాశాలు కూడా లేకపోవడంతో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా భారీగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్లీ పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది.. ఇప్పటికే క్రాక్, బిగిల్ లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన జీకే విష్ణు పెళ్లి చేసుకోగా ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ మనవడు, మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన అనిల్ జీల కూడా ఒక ఇంటివాడు అవుతున్నాడు. అయితే ఆయన తన పెళ్లి శుభలేఖ రాయించిన విధానం ఇప్పుడు ఆకట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Gangavva మనవడి పెళ్లి ! ఆసక్తికరంగా శుభలేఖ | Anil Jeela || Filmibeat Telugu

రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

 టీచర్ కాబోయి యూట్యూబ్ స్టార్

టీచర్ కాబోయి యూట్యూబ్ స్టార్

మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో అనిల్ జీల ఒకరు. అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటే ఆయన కూడా టీచర్ కాబోయి యూట్యూబ్ స్టార్ అయ్యాడు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దర్గా పల్లి గ్రామానికి చెందిన అనిల్ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. కెరీర్ మొదట్లో కొండగట్టు దగ్గర్లో ఉన్న ఒక గ్రామం లో టీచర్ గా ఆయన విధులు నిర్వహించే వారు. గవర్నమెంట్ టీచర్ గా స్థిరపడడం ఆయన లక్ష్యంగా ఉండేది. ఆ పనిలో బిజీగా ఉండగా మై విలేజ్ షో రూపకర్త శ్రీకాంత్ నుంచి పిలుపు అందడంతో మై విలేజ్ షో లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. గంగవ్వతో పాటు ఈయనకు కూడా అక్కడ మంచి క్రేజ్ లభించింది.

వరల్డ్ ఫేమస్ లవర్ లో దేవరకొండ ఫ్రెండ్ గా

వరల్డ్ ఫేమస్ లవర్ లో దేవరకొండ ఫ్రెండ్ గా

అలా లభించిన క్రేజ్ తో అనిల్ కు వరుస సినిమా అవకాశాలు కూడా లభించాయి. అనిల్ ఎక్కువగా మై విలేజ్ షో వీడియోలో గంగవ్వ కు మనవడిగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ స్నేహితుడు పాత్రలో కనిపించాడు. అది కాక ప్రెజర్ కుక్కర్, ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి మరిన్ని సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలాగే యూట్యూబ్ లో అనిల్ జీల అనే వ్లాగ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తాజాగా ఆయనకి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లికి సంబంధించిన శుభలేఖని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనిల్ షేర్ చేశాడు. అయితే ఈ పెళ్లి శుభలేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా పరిస్థితి బయట దారుణంగా ఉండడంతో ఈ శుభలేఖను ఇన్నోవేటివ్ గా సిద్ధం చేశాడు అనిల్.

ఆసక్తికరంగా శుభలేఖ

ఆసక్తికరంగా శుభలేఖ

''కరోనా కాలంలో ఇదేనా లగ్నపత్రిక, ఇన్విటేషన్ కాదు ఇన్ఫర్మేషన్, కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగవు అంటారు పెట్టుకున్న ముహూర్తానికి లగ్నం చేసుకుంటున్నా మీరు లేకుండానే అతి త్వరలో మన అందరం కలిసి మరో వేడుకగా కలుద్దాం మీ ఆశీస్సులతో అనిల్ జీల'' అని ఆయన పోస్ట్ చేశాడు. మే నెల ఒకటో తారీకు శనివారం ఎనిమిది గంటలకు ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఈ వివాహ మహోత్సవం టెలికాస్ట్ అవుతుందని అందులో రాసుకొచ్చాడు. ఆమని అనే యువతితో వివాహం జరుగుతోందని, ఇద్దరికీ కోవిడ్ నెగిటివ్ ఉందని పేర్కొన్నారు.. మర్చిపోకుండా మీ ఫోన్ లో ఒక జిబి డేటా ఉంచి పిల్ల, జెల్ల, ముసలి, ముతక అందరూ ఫోన్ల ముందు కూర్చుని ఇంటర్నెట్ లో పెళ్లి చూసి ఆన్లైన్ లో ఆశీర్వదించండి అని కోరాడు. అలాగే ఎవరైనా కట్నాలు చదివించాలంటే చదివించండి అంటూ గూగుల్ పే ఫోన్ పే క్యూఆర్ కోడ్స్ కూడా షేర్ చేశాడు.

లైవ్ లో ఆశీర్వాదాలు

లైవ్ లో ఆశీర్వాదాలు

పెండ్లి జరిగేది రామలింగేశ్వర దేవాలయంలో కానీ విందు కోసం లాంటి ఏర్పాట్లు చేయలేదని మాకు లైవ్ లో ఆశీర్వాదాలు ఇచ్చాక ఎవరి ఇంట్లో వాళ్లే అన్నం తినాలి అని చెప్పుకొచ్చారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మీరిచ్చే కట్న కానుకలతో కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది అని దానిలో పేర్కొన్నాడు అనిల్. బారాత్ ఉంది కానీ ఎవరి ఇంట్లో వాళ్లు పాటలు పెట్టుకుని ఎగరాలని, మీరు ఎగిరిన 15 సెకన్ల వీడియో మాకు పంపితే అనిల్ జీల వ్లాగ్స్ లో పెడతామని చెప్పుకొచ్చాడు. సందడిగా ఉన్న ఈ శుభలేఖని మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X