Bigg Boss Non Stop : రెండో వారం మరో హాట్ బాంబ్ ఎలిమినేషన్.. ఊహించలేదు కానీ!

బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఎంతో వైభవంగా ఈ షో 17 మంది కంటెస్టెంట్స్ తో ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాంతానికి చేరడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాల్సి ఉంది. మొదటి వారం హాట్ బాంబ్ గా పేరుపొందిన ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా రెండో వారం కూడా నామినేషన్ లో 11 మంది సభ్యులు వచ్చారు. వారిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

11 మంది

11 మంది

పాత - కొత్త కంటెస్టెంట్ ల కలయిక తో బిగ్ బాస్ నాన్ స్టాప్ సిద్ధం చేశారు. ముందుగా పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ అని కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజర్స్ అని పిలుస్తున్నారు. రెండో వారం ఎలిమినేషన్ కోసం 11 మంది కంటెస్టెంట్ లు లైన్ లో ఉండగా వారిలో ఏడుగురు వారియర్స్ నుంచి ఐదుగురు ఛాలెంజర్స్ నుంచి నామినేషన్స్ లోకి వచ్చారు.

ఓట్లు పడినా

ఓట్లు పడినా

మొత్తం మీద చూస్తే సరయు, అఖిల్ హమీద, అరియనా, నటరాజ్ మాస్టర్, అషు రెడ్డి, మహేష్ విట్టా, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, యాంకర్ శివ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారంలో అఖిల్, అరియానా, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, హమీదా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్ ఉన్నారు. వాళ్లని నామినేషన్స్‌లో పెట్టగా వాళ్లకి ఓట్లు పడినా పడకపోయినా ఇప్పట్లో అయితే ఎలిమినేట్ చేయరు.

ఛాన్స్ లేదు

ఛాన్స్ లేదు

ఇక మిగిలిన వాళ్లలో యాంకర్ శివకి ఓట్లు గట్టిగానే పడుతున్నారు. దానికి కారణం ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావిస్తున్న బిందు మాధవితో శివ క్లోజ్‌గా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ ఓటింగ్ శివకి పడుతోంది. మిగిలిన వాళ్లలో మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, శ్రీరాపాక, సరయు నామినేషన్స్ లో ఉన్నారు. అనీల్‌ని రెండోవారంలో కెప్టెన్‌ని చేశారు కనుక ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు.

ఎలిమినేట్ అయ్యే అవకాశం

ఎలిమినేట్ అయ్యే అవకాశం

ఇక సరయు విషయానికి వస్తే తొలివారం తొలి ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కిన సరయు రెండో వారంలో సేఫ్ అయిందని అంటున్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు చూసి ఖతర్నాక్ కిలాడి అనుకున్న వారు ఆమె అమాయకత్వాన్ని చూసి ఓట్లు వేస్తున్నారు. ఇక శ్రీరాపాక, మిత్రా శర్మలలో ఎవరో ఒకరే రెండో వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుందని ముంచు నుంచి అంచనాలు ఉన్నాయి.

శ్రీ రాపాక

శ్రీ రాపాక

ఓటింగ్ పరంగా చూస్తే మిత్రా శర్మ కంటే శ్రీరాపాకకే ఎక్కువ ఓట్లు పడుతున్నా బిగ్ బాస్ ఆశించిన స్థాయిలో ఆట తీరు లేదని అంటున్నారు. ప్రతి వారం లాగానే ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అందరి కంటే వీక్ గా ఉన్న శ్రీరాపాక ఈ వారం ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. చివరి వరకు నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక చివరి దాకా సేఫ్ అవకుండా ఉన్నారని అందులో శ్రీ రాపాక ఎలిమినేట్ అయిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X