"తొలి సీజన్ బిగ్ బాస్‍‌లో తారక్ దడ పుట్టించాడు, నాని హోస్టింగ్ అలా లేదు"

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Jyothi Opinion On Bigg Boss Season 2

నాని హోస్ట్‌గా ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 2పై.... తొలి సీజన్ కంటెస్టెంట్, నటి జ్యోతి స్పందించారు. తొలి సీజన్ బిగ్ బాస్‍‌లో తారక్ దడ పుట్టించాడు, నాని హెస్టింగ్ అలా అనిపించడం లేదని, అందుకు కారణం ఈ షోలో పాల్గొంటున్న అందరికీ నాని మంచి ఫ్రెండ్. అందుకే వారిలో ఆ దడ కనిపించడం లేదు అని జ్యోతి తెలిపారు.

నాని చేస్తున్నపుడు ఆ ఫీల్ లేదు

నాని చేస్తున్నపుడు ఆ ఫీల్ లేదు

మేము చేసిన బిగ్ బాస్ సీజన్ 1తో పోల్చుకుంటే తారక్ ఆ షోను ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రతివారం ఆయన వచ్చే రెండు రోజులు టీఆర్పీ రేటింగ్స్ స్టాండర్స్ కూడా బాగా పెరిగాయి. ఆ రెండు రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండే మాలో దడ ఉండేది. నాని చేస్తున్నపుడు ఆ ఫీల్ లేదు. ఎందుకంటే నాని జస్ట్ ఫ్రెండ్ లైక్... మన నానియే కదా అనే ఫీలింగ్ అయితే కంటెస్టెంట్స్‌లో కనిపిస్తోంది. అఫ్ కోర్స్ నా ఫేవరెట్ హీరోల్లో నాని ఒకరు.... అని జ్యోతి తెలిపారు.

ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి

ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి

నాని కూడా బాగా చేస్తున్నాడు. మెల్లి మెల్లిగా అతడు ఇంకా ఇంప్రూవ్ అవుతాడని భావిస్తున్నాను. ఎందుకంటే హోస్ట్‌గా నాని చేస్తున్నతొలి షో ఇదే. నాని మరింత బాగా చేయాలని, క్యూరియాసిటీ, స్పాంటేనిటీ ఇంకా పెరిగితే బావుంటుంది అనిపిస్తుందని జ్యోతి అభిప్రాయ పడ్డారు.

అది కూడా మాలో భయం పెంచింది

అది కూడా మాలో భయం పెంచింది

ఫస్ట్ సీజన్ తెలుగు రాష్ట్రాలకు దూరంగా లోనావాలో జరిగింది. అదో కొండ ప్రాంతం. అక్కడ ఎవరో ఎంటో కూడా తెలియదు....ఇది కూడా మొదటి సీజన్లో కంటెస్టెంట్లపై చాలా ప్రభావం చూపింది. తారక్‌ను చూడగానే ఇంకా దడపుట్టేది. ఆయన గంభీరత్వం, ఆయన చేసిన హోస్టింగ్ కానీ అందరినీ ఎంతో సర్‌ప్రైజ్ చేసింది. ఇవన్నీ భయాలతో కూడి మేమంతా అక్కడకు వెళ్లి చాలా విభిన్నమైన అనుభూతి పొందాము అని జ్యోతి తెలిపారు.

రిలాక్స్ గా, చిల్‌గా గేమ్ ఆడుతున్నారు

రిలాక్స్ గా, చిల్‌గా గేమ్ ఆడుతున్నారు

బిగ్ బాస్ సీజన్ 2 మన హైదరాబాద్ లోనే జరుగుతుంది కాబట్టి చిల్. మన వాళ్లందరూ దగ్గరలోనే ఉన్నారు. ఎలాంటి టెన్షన్ లేదు. పైగా హోస్ట్ హీరో నాని... అక్కడున్న కంటెస్టెంట్లకు నాని ఒక ఫ్రెండుగా బాగా తెలుసు. అందుకే అందరూ చాలా రిలాక్స్ గా, చిల్‌గా గేమ్ ఆడుతున్నారు... అని జ్యోతి తెలిపారు.

బిగ్ బాస్ అందరి మధ్య చిచ్చుపెడతాడు

బిగ్ బాస్ అందరి మధ్య చిచ్చుపెడతాడు

కంటెస్టెంట్స్ అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బిగ్ బాస్ ఎవరినీ ఫ్రెండ్లీగా ఉండనివ్వడు. ఈ షో మెయిన్ కాన్సెప్ట్ అదే. వారి మధ్య ఎలా చిచ్చు పెట్టాలో బిగ్ బాస్‌కు బాగా తెలుసు. అక్కడ ఇచ్చే టాస్క్‌లు మనల్ని కంప్రెస్ చేసి, ట్రిగర్ చేస్తూ ముందుకు తీసుకెళుతుంది. ఎంత భరించాలన్నా కూడా మన ఇగో అంతా బయటకు వస్తుంది. సహనం చాలా ఎక్కువగా ఉండాలి అని జ్యోతి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X