బిగ్‌బాస్‌ ఫేమ్ స్వామి ఓం కన్నుమూత.. కంటెస్టెంట్‌పై మూత్రం పోసిన వివాదాస్పద వ్యక్తిగా..

బిగ్‌బాస్ 10వ సీజన్‌లో అత్యంత వివాదాస్పద కంటెస్టెంట్, స్వయంగా తాను దేవుడి అవతారమని ప్రకటించుకొన్న స్వామి ఓం ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. స్వామి ఓం మరణవార్తను ఆయన కుమారుడు అర్జున్ జైన్, సన్నిహితులు మీడియాకు చేరవేశారు. స్వామి ఓం జీవితం, ఆయన మరణానికి సంబంధించిన విషయాల గురించి మరింత వివరాల్లోకి వెళితే...

కంటెస్టెంట్‌పై మూత్రం విసిరి

కంటెస్టెంట్‌పై మూత్రం విసిరి

స్వయంగా తాను దేవుడి అవతారం అని చెప్పుకొనే స్వామి ఓం బిగ్‌బాస్‌ 10లోకి ప్రవేశించిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకొన్నారు. బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో అత్యంత వివాదాస్పదంగా ప్రవర్తించారు. బానీ జే అనే కంటెస్టెంట్‌పై మూత్ర విసరడం పెద్ద గొడవ జరిగింది. ఆ సంఘటన అనంతరం స్వామి ఓంను వెంటనే ఎలిమినేట్ చేశారు.

సల్మాన్ ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టానని

సల్మాన్ ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టానని

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ చేసిన తర్వాత హోస్ట్ సల్మాన్ ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. స్మోకింగ్ జోన్‌లో సల్మాన్‌ను చెంప దెబ్బ కొట్టానని వ్యాఖ్యలు చేశారు. తనను ఎలిమినేట్ చేసినందుకు బిగ్‌బాస్‌ షోను ఆపివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఛానెల్స్ కంటెస్టెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం చేలరేగింది.

 మహిళపై అత్యాచారయత్నం

మహిళపై అత్యాచారయత్నం

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సృష్టించిన వివాదాలు ఆయనను ఇబ్బందుల్లో పడేశాయి. తన ఆశ్రమంలో ఉండే మహిళపై లైంగిక దాడి ప్రయత్నించారనే ఆరోపణలు మరింత వివాదంగా మారాయి. మహిళ బట్టలను విప్పేందుకు ప్రయత్నించడం ఆయనను సమస్యల్లో పడేశాయి.

Recommended Video

Acharya Movie : Megastar Chiranjeevi క్రేజ్ కి సరిలేరు ఇంకెవ్వరూ.. Nizam King చిరు !
కరోనాబారిన పడిన స్వామి జీ

కరోనాబారిన పడిన స్వామి జీ

ఇలాంటి అనేక వివాదాస్పద సంఘటనలతో జీవితం గడిపిన స్వామి ఓం కొద్ది నెలల క్రితం కరోనావైరస్‌ బారిన పడ్డారు. కరోనావైరస్ నుంచి కోలుకొన్న తర్వాత ఆయన ఆరోగ్యం అంతగా సహకరించలేదు. అప్పటి నుంచి తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చారు.

15 రోజుల క్రితం పక్షవాతానికి గురై

15 రోజుల క్రితం పక్షవాతానికి గురై

స్వామి ఓం కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెల్లడించిన ప్రకారం.. 15 రోజుల క్రితం ఆయన పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పక్షవాతం వచ్చినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో బుధవారం మధ్యాహ్నం జరుగుతాయి అని కుమారుడు అర్జున్ జైన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X