twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌ను పట్టేశా.. కాంట్రవర్సీ క్వీన్ ట్వీట్.. నీకంత సీన్ లేదమ్మా...

    By Rajababu
    |

    Recommended Video

    ప్రభాస్‌ను పట్టేశా.. కాంట్రవర్సీ క్వీన్ ట్వీట్..!

    బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది. ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ ముందు క్యూ కట్టారు. అయితే ఏ ప్రాజెక్ట్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. కానీ తాజాగా ప్రభాస్ హీరోగా ఓ బాలీవుడ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు బిగ్‌బాస్11 సెలబ్రిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

     బిగ్‌బాస్11లో కాంట్రావర్సీ క్వీన్

    బిగ్‌బాస్11లో కాంట్రావర్సీ క్వీన్

    బిగ్‌బాస్‌11లో క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీగా అరుషి ఖాన్‌కు పేరుంది. వివాదాస్పద సంఘటనల కారణంగా అరుషి రియాల్టీ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత అనేక వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే వ్యక్తిగా ముద్ర వేసుకొన్నది.

    ప్రభాస్ సరసన నటిస్తున్నా..

    ప్రభాస్ సరసన నటిస్తున్నా..

    బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంచలనాత్మకమైన ట్వీట్‌తో మరోసారి అరుషి వార్తలో నిలిచింది. తాను ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నాను. బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్నాను అని ట్వీట్ చేసింది.

    సల్మాన్‌కు థ్యాంక్స్

    బిగ్‌బాస్ కారణంగానే నాకు ప్రభాస్‌ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అందుకు 11 మంది సెలబ్రిటీలకు, సల్మాన్ ఖాన్‌కు ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొన్నది. అరుషీ ట్వీట్ చూసిన కొందరు కంగుతిన్నారు. అరుషికి ప్రభాస్ పక్కన నటించే అవకాశామా అని ముక్కున వేలేసుకొన్నారు.

    నిజమే.. ప్రభాస్ పక్కన

    నిజమే.. ప్రభాస్ పక్కన

    ప్రభాస్ చిత్రంలో నిజంగా నటిస్తున్నదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి అరుషిని సంప్రదించగా.. మీరు విన్న వార్త నిజమే. ప్రభాస్ జంటగా నటిస్తున్నాను. అంతకంటే ఏమీ చెప్పలేను. కొద్దిరోజుల్లో మీకే అన్ని విషయాలు అధికారికంగా తెలుస్తాయి.

    క్లారిటీ లేదు

    క్లారిటీ లేదు

    ప్రభాస్ నటించే చిత్రం హిందీ చిత్రమా? లేదా తెలుగు చిత్రమా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్ కూడా ఈ వార్తపై పెదవి విప్పలేదు. సంబంధిత వర్గాలు కూడా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.

     నెటిజెన్ల ఎదురుదాడి

    నెటిజెన్ల ఎదురుదాడి

    అయితే అరుషి ఖాన్ ట్వీట్‌పై నెటిజన్లు ఎదురుదాడి ప్రారంభించారు. అబద్దాలు ఆడటానికైనా ఓ హద్దు ఉండాలి. ఈ వార్తను మేము నమ్మం. ప్రభాస్ నీతో ఎప్పటికీ కూడా నటించడు అని నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపించాడు.

    ఖత్రోంకి ఖిలాడీ రియాల్టీ షోలో

    ఖత్రోంకి ఖిలాడీ రియాల్టీ షోలో

    ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరించే ఖత్రోంకి ఖిలాడి కార్యక్రమంలో అరుషి ఖాన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ షో కోసం స్విమ్మింగ్ నేర్చుకోవడమే కాకుండా జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్తున్నట్టు సమాచారం.

    English summary
    Prabhas became a household name across the country after the Baahubali films took the box office by storm, and many actresses would give an arm and a leg to star in a film with him. It looks like Arshi is the lucky one, although there has been no official announcement from the makers of the film yet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X