Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్‌ను పట్టేశా.. కాంట్రవర్సీ క్వీన్ ట్వీట్.. నీకంత సీన్ లేదమ్మా...
Recommended Video
బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది. ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ ముందు క్యూ కట్టారు. అయితే ఏ ప్రాజెక్ట్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. కానీ తాజాగా ప్రభాస్ హీరోగా ఓ బాలీవుడ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు బిగ్‌బాస్11 సెలబ్రిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
బిగ్‌బాస్11లో కాంట్రావర్సీ క్వీన్
బిగ్‌బాస్11లో క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీగా అరుషి ఖాన్‌కు పేరుంది. వివాదాస్పద సంఘటనల కారణంగా అరుషి రియాల్టీ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత అనేక వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే వ్యక్తిగా ముద్ర వేసుకొన్నది.
ప్రభాస్ సరసన నటిస్తున్నా..
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంచలనాత్మకమైన ట్వీట్‌తో మరోసారి అరుషి వార్తలో నిలిచింది. తాను ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నాను. బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్నాను అని ట్వీట్ చేసింది.
|
సల్మాన్‌కు థ్యాంక్స్
బిగ్‌బాస్ కారణంగానే నాకు ప్రభాస్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అందుకు 11 మంది సెలబ్రిటీలకు, సల్మాన్ ఖాన్‌కు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నది. అరుషీ ట్వీట్ చూసిన కొందరు కంగుతిన్నారు. అరుషికి ప్రభాస్ పక్కన నటించే అవకాశామా అని ముక్కున వేలేసుకొన్నారు.
నిజమే.. ప్రభాస్ పక్కన
ప్రభాస్ చిత్రంలో నిజంగా నటిస్తున్నదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి అరుషిని సంప్రదించగా.. మీరు విన్న వార్త నిజమే. ప్రభాస్ జంటగా నటిస్తున్నాను. అంతకంటే ఏమీ చెప్పలేను. కొద్దిరోజుల్లో మీకే అన్ని విషయాలు అధికారికంగా తెలుస్తాయి.
క్లారిటీ లేదు
ప్రభాస్ నటించే చిత్రం హిందీ చిత్రమా? లేదా తెలుగు చిత్రమా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్ కూడా ఈ వార్తపై పెదవి విప్పలేదు. సంబంధిత వర్గాలు కూడా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.
నెటిజెన్ల ఎదురుదాడి
అయితే అరుషి ఖాన్ ట్వీట్‌పై నెటిజన్లు ఎదురుదాడి ప్రారంభించారు. అబద్దాలు ఆడటానికైనా ఓ హద్దు ఉండాలి. ఈ వార్తను మేము నమ్మం. ప్రభాస్ నీతో ఎప్పటికీ కూడా నటించడు అని నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపించాడు.
ఖత్రోంకి ఖిలాడీ రియాల్టీ షోలో
ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరించే ఖత్రోంకి ఖిలాడి కార్యక్రమంలో అరుషి ఖాన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ షో కోసం స్విమ్మింగ్ నేర్చుకోవడమే కాకుండా జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్తున్నట్టు సమాచారం.