బిగ్ బాస్ రియాల్టీ షోలోకి మరో అడల్ట్ మూవీ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతోందా?
తెలుగులో నాని హోస్ట్‌గా బిగ్ బాస్ రెండో సీజన్ మొదలవ్వగా.....హిందీలో 12వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ వెర్షన్ బిగ్ బాస్ ఇండియన్ రియాల్టీ షోలలో టాప్ షోగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు పూర్తయిన 11 సీజన్లలో అనేక వివాదాలకు ఈ షో కేంద్ర బింధువైంది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ను ఇండియన్ ఎంటర్టెన్మెంటు రంగానికి పరిచయం చేసిన ఘనత కూడా దీనికే సొంతం. కాగా... త్వరలో ప్రారంభం కాబోయే 12వ సీజన్లో మరో శృంగార తారను భారతీయులకు పరిచయం చేయబోతున్నట్లు టాక్.

శాంతి డైనమైట్?
బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం... అడల్ట్ మూవీ స్టార్ శాంతి డైనమైట్ బిగ్ బాస్ హిందీ 12వ సీజన్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలోనూ ఆమె పేరు ప్రచారంలోకి
శాంతి డైనమైట్ పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గత సీజన్ల ప్రారంభంలోనూ బిగ్ బాస్ ఇంట్లోకి శృంగార డైనమైట్లు పేల్చేందుకు శాంతి వస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి శాంతి పేరు మార్మోగి పోవడం గమనార్హం.

ఎవరీ శాంతి డైనమైట్?
శాంతి డైనమైట్ బ్రిటన్‌కు చెందిన అడల్ట్ మూవీ స్టార్. ఇండియన్, గ్రీకు మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె తల్లి పంజాబి కాగా... తండ్రి గ్రీక్ సంతతికి చెందిన వాడు.

ఆమె అసలు పేరు
శాంతి డైనమైట్ అసలు పేరు సోఫియా వసిలెయడు. జూన్ 1, 1991లో జన్మించింది. ఉంగాండాలోని కంపాలాలో జన్మించింది.

టాప్ 50 సెక్సియెస్ట్ ఉమెన్
బ్రిటిష్ న్యూస్ పేపర్ ఈస్టర్న్ ఐ.... ప్రకటించిన టాప్ 50 ఆసియన్ ఉమెన్ లిస్టులో చోటు దక్కించుకుంది. ప్లేబోయ్ మేగజైన్ కవర్ పేజీ మీద కూడా అందాలు ఆరబోసింది.

అలా కెరీర్ మొదలెట్టింది
టీనేజీ వయసులోనే శాంతి డైనమైట్ గ్లామర్ మోడల్‌గా తన మీడియా కెరీర్ ప్రారంభించింది. హోటల్ వోయెర్ అనే యూకె బేస్డ్ టాప్‌లెస్ షోలో పాల్గొంది.

ఇండియాలో సొంత ప్రొడక్షన్ కంపెనీ
శాంతి డైనమైట్ ఇండియాలో సొంత ప్రొడక్షన్ కంపెనీ రన్ చేస్తోంది. అడల్ట్ మ్యూజిక్ వీడియోస్, సెక్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్, ఎయిడ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.

సన్ని లియోన్ మీద శాంతి ఆరోపణలు
సన్నీ లియోన్ బేబీ డాల్ ఆల్బమ్.... తన వీడియో నుండి కాపీ కొట్టారని గతంలో శాంతి ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. బిగ్ బాస్ 12లోకి శాంతి ఎంటరైతే ఆమెకు బాలీవుడ్లో మంచి కెరీర్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











