ఆమె వ్యభిచారి.. శ్రీశాంత్ దారుణమైన వ్యాఖ్య, గ్యాంగ్ రేప్ అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్!

హిందీ బిగ్‌బాస్ 12 సీజన్లో కంటెస్టెంటుగా ఉన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అక్కడ కూడా తన యాంగ్రీ, వివాదాస్పద ప్రవర్తనతో హాట్ టాపిక్ అవుతున్నాడు. హౌస్‌లో శ్రీశాంత్, మరో కంటెస్టెంట్ సురభి మధ్య జరిగే గొడవలు తారా స్థాయికి చేరాయి. ఒకరినొకరు దూషించుకుంటూ విమర్శల పాలయ్యారు.

వీకెండ్ ఎపిసోడ్లో షో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఇటు శ్రీశాంత్, అటు సురభిని హెచ్చరించారు. హౌస్‌లో మీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉందని, మీరు ఉపయోగించే పదజాలం చాలా నీచంగా ఉందని, హౌస్‌లో అలాంటి బిహేవియర్ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

 వ్యభిచారి అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీశాంత్

వ్యభిచారి అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీశాంత్

శ్రీశాంత్ క్రికెట్ కెరీర్, మ్యాచ్ పిక్సింగ్ గురించి రెచ్చ గొడుతూ మాట్లాడిన సురభికి.... సల్మాన్ ఖాన్ క్లాస్ పీకాడు. అదే సమయంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సురభిని వ్యభిచారిగా అభివర్ణించిన శ్రీశాంత్ వ్యవహారాన్ని కూడా సల్మాన్ ఖాన్ తప్పుబట్టారు. అయితే తన ప్రవర్తనపై శ్రీశాంత్ క్షమాపణలు చెప్పారు.

శ్రాశాంత్‌కు అభిమానుల నుంచి మద్దతు

శ్రాశాంత్‌కు అభిమానుల నుంచి మద్దతు

ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీశాంత్‌కు అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయనకు సపోర్ట్ చేస్తూ #WeStandBySreesanth అనే యాష్ ట్యాగ్ తో ట్వీట్ల వర్షం కురిపించారు.

 రెచ్చిపోయిన శ్రీశాంత్ అభిమాని, గ్యాంగ్ రేప్ అంటూ

రెచ్చిపోయిన శ్రీశాంత్ అభిమాని, గ్యాంగ్ రేప్ అంటూ

అయితే శ్రీశాంత్ అభిమాని ఒకరు ఇంకాస్త రెచ్చిపోయి సురభి మీద దారుణమైన కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సురభి ఏదో ఒక రోజు గ్యాంగ్ రేప్‌కు గురవుతుందని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడ్డారు. మహిళపై ఇలాంటి కామెంట్స్ సరికాదంటూ విరుచుకుపడ్డారు.

ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు

ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు

తను చేసిన ట్వీట్ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగడంతో కొంత సేపటి తర్వాత సదరు శ్రీశాంత్ అభిమాని ఆ ట్వీట్ తొలగించడంతో పాటు ఒక మహిళ పట్ల అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పారు.

 శ్రీశాంత్ అభిమానులు కూడా సపోర్ట్ ఇవ్వక పోవడంపై

శ్రీశాంత్ అభిమానులు కూడా సపోర్ట్ ఇవ్వక పోవడంపై


తాను చేసిన అభ్యంతరకర ట్వీట్ తొలగించిన అనంతరం.... ఆ వ్యక్తి క్షమాపణలు చెప్పడంతో పాటు, శ్రీశాంత్ అభిమానులు కూడా తనకు మద్దతు ఇవ్వక పోవడంపై విచారం వ్యక్తం చేశారు. తనలోని ఫీలింగ్స్ ఎవరూ అర్థం చేసుకోలేదని బాధపడుతూ మరో ట్వీట్ చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X