బెడ్‌పై నా స్పీడు తట్టుకోలేరు.. బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్ కామెంట్స్, సీక్రెట్‌గా ఆమెతో!
ఇండియాలో బిగ్ బాస్ షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లో బిగ్ బాస్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో బిగ్ బాస్ జోరు 12వ సీజన్ కు చేరుకుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ 12 సీజన్ ని వినూత్నంగా జంటలతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఒంటరిగానే పాల్గొంటున్నారు. తాజగా బిగ్ బాస్ 12 లో హాట్ బ్యూటీలు నేహా పెండ్సే, దీపికా కక్కర్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంచలన వ్యాఖ్యలకు కారణమైన నేహాని అంతా ట్రోల్ చేస్తున్నారు.

ప్రసారం కాలేదు
నేహా పెండ్సే, దీపికా కక్కర్ మధ్య వేడెక్కించే సంభాషణ జరిగింది. ఈ సంభాషణని ప్రసారం చేయలేదు కానీ బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్నెట్ లో ఉంచారు. దీపికా కక్కర్ తో నేహా అన్న మాట పెను సంచలనం సృష్టిస్తోంది.

బెడ్‌పై నా స్పీడు తట్టుకోలేరు
దీపికా కక్కర్, నేహా మాట్లాడుకుంటున్నారు. నిద్ర గురించి వారి మధ్య చర్చ జరిగింది. నేహా మాట్లాడుతూ బెడ్ పై నా స్పీడు ఎవరూ తట్టుకోలేరు అని చెప్పేసింది. ఈ పద ప్రయోగం మసాలా కోసంవాడిందే తప్ప. నేహా ఉద్దేశం అది కాదు. బెడ్ పై తాను నిద్రించే తీరు చాలా విచిత్రంగా ఉంటుందని వివరిస్తూ ఆ మాట మాట్లాడింది.

అన్నీ విసిరికొడతా
నిద్ర మత్తులో తానేం చేస్తానో తనకే తెలియదని, బెడ్ షీట్, దిండు అన్ని ఎక్కడెక్కడో విసిరి కొడతానని తెలిపింది. ఇంట్లో అయితే కొన్ని సార్లు అవి ఎక్కడెక్కడో పడి ఉంటాయని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో అంతా ఒకే చోట పడుకుంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ విషయాన్ని దీపికా కక్కర్ తో నేహా తెలిపింది. బెడ్ పై స్పీడు అంటే ఆమె ఉద్దేశం ఇది.

దీపికా వింతగా
అదే సమయంలో దీపికా నిద్రించే విధానం గురించి కూడా నేహా మాట్లాడింది. నీవు బెడ్ పై వింత పొజిషన్స్ లో పాడుకుంటావు అని తెలిపింది. దీనికి దీపికా కక్కర్ బదులిస్తూ.. నేను పడుకునేది రూమ్ చివర కదా.. మీ అందరికి ఎలాంటి సమస్య లేదు అని బదులిచ్చింది.

స్నేహం పెరుగుతోంది
ఇలా అన్ని విషయాలని వీరిద్దరో కలసి చర్చించుకుంటున్నారు. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఒకరితో ఒకరు దీపికా, నేహా పంచుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారుతున్నారు.


Click it and Unblock the Notifications











